Sugarcane Juice : సమ్మర్లో చెరకు రసం తాగుతున్నారా? ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుందా? లేదంటే..
Summer Drink : సమ్మర్లో బయటకి వెళ్తే చల్లగా ఏమైనా తాగాలి అనిపిస్తుంది. ఆ సమయంలో కూల్ డ్రింక్స్, జ్యూస్ ప్రాంతాలు రద్దీగా ఉంటాయి. చెరుకు రసాన్ని కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి మంచిదా? కాదా?
Healthy Drink in Summer : ఎండలో బయట తిరగకూడదు అంటారు కానీ.. వివిధ అవసరాలు, కారణాల దృష్ట్యా చాలామంది ఎండలోనే తిరగాల్సి వస్తుంది. ఆ సమయంలో కడుపులోకి చల్లగా వెళ్లేది ఏదైనా పర్లేదు అని ఏది కనిపిస్తే దానిని తాగేస్తూ ఉంటారు. డీహైడ్రేషన్ సమస్య కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకే సమ్మర్లో కూల్ డ్రింక్స్ నుంచి నిమ్మసోడాల వరకు గిరాకీ మామూలుగా ఉండదు. అంతేకాకుండా సహజంగా లభ్యమయ్యే కొబ్బరి బోండాల నుంచి.. చెరుకు రసానికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది.
సమ్మర్లో కూల్‌డ్రింక్స్ లాంటివి, ఐస్ ఎక్కువగా వేసిన పానీయాలు తాగవద్దని.. అవి ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఇవి వ్యక్తిని డీహైడ్రేషన్‌కు గురిచేస్తాయి అంటున్నారు. హైడ్రేటెడ్‌గా ఉండేందుకు చెరుకు రసం లాంటివి తాగవచ్చు అంటున్నారు. వీటి వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు చేకూరతాయి అంటున్నారు. తియ్యగా దాహార్తి తీర్చే చెరుకు రసం ఆరోగ్యానికి మంచిదేనా? సమ్మర్లో దీనిని తాగవచ్చా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వేడి వల్ల కలిగే సమస్యలకు..
సమ్మర్లో చెరుకు రసం తాగడం పూర్తిగా ఆమోదయోగ్యం అంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ ఓ గ్లాసు చెరుకు రసం తాగడం వల్ల సూర్యుని వేడిని అధిగమించవచ్చు అంటున్నారు. అంతేకాకుండా వేడి సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇది ఎనర్జీని అందిస్తుందని.. శరీరంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్లు స్థాయిని పెంచుతాయి. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడంలో చెరుకు రసం సహాయం చేస్తుంది.
చర్మానికి మంచిది..
చెరకు రసంలోని యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటుంది. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా రోగనిరోధకశక్తిని పెంచుతాయి. శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచడంలో సహాయం చేస్తాయి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది.
మూత్రపిండాల పనితీరు..
సమ్మర్లో మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. అయితే చెరకు రసం మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మీ శరీరం నుంచి అదనపు ఉప్పు, నీటిని తొలగించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో పోరాడే వారికి ఇది ప్రయోజనాలు అందిస్తుంది.
క్యాన్సర్‌తో పోరాడుతుంది..
చెరకు రసంలో ఫ్లేవోన్లు క్యాన్సర్ కణాల ఉత్పత్తి, వ్యాప్తిని ఆపడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని పలు అధ్యయనాలు నిరూపించాయి. చెరకు నుంచి సహజంగా సేకరించే పాలీఫెనాల్ రిచ్ చెరకు సారం క్యాన్సర్ నిరోధక ప్రభావాన్ని తగ్గిస్తుంది.
మెరుగైన జీర్ణక్రియకు
చెరుకు రసం పొటాషియంతో నిండి.. మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. శరీరంలో pH స్థాయిలను సమతుల్యం చేస్తుంది. అంతేకాకుండా పొటాషియం కడుపుని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే యాంటీమైక్రోబయాల్ ఏజెంట్‌గా పని చేస్తుంది.
Also Read : కొవ్వు వేగంగా తగ్గాలంటే ఈ వ్యాయామంతో పాటు ఆ ఫుడ్స్ తీసుకోవాలట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.