Sravana Masam 2025 : శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదా? శాస్త్రీయ కారణాలు ఇవే.. తప్పక తెలుసుకోండి
Sawan 2025 : శ్రావణమాసంలో చాలామంది మాంసాహారం తినరు. అయితే దీనికే ఆధ్యాత్మికంగానే కాదు.. శాస్త్రీయపరంగా కూడా ఓ కారణముంది. అదేంటో ఇంతకీ నాన్‌వెజ్ తినాలో వద్దో తెలుసుకుందాం.

Sravana Month 2025 : శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ సంవత్సరంలో శ్రావణ మాసం 29 రోజులు ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజూను పవిత్రమైనదిగా భావిస్తారు. నవరాత్రి సమయంలో తొమ్మిది రోజులు ఎలా పవిత్రంగా భావిస్తారో.. వీటిని అలాగే భావిస్తారు. అందుకే ఈ పవిత్ర మాసంలో అన్నిరోజులు పూజలు చేస్తారు. అందుకే ఆహారం, దినచర్యలో కొన్ని నియమాలు పాటిస్తారు. అలా పాటించడం వల్ల జీవితంలో ఆర్థికంగా, మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా కొన్ని ఇబ్బందులు రావాని భక్తులు భావిస్తారు. అలా పాటించే నియమాల్లో నాన్‌వెజ్ ఒకటి. చాలామంది భక్తులు శ్రావణమాసంలో నాన్‌వెజ్ తినరు. అయితే దీనివెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉందని చెప్తున్నారు. అదేంటో తెలుసుకుందాం.
మతపరమైన కారణమిదే..
శ్రావణ మాసంలో పరిశుభ్రత, పవిత్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎందుకంటే ఈ నెల శివుడికి అంకితం చేస్తారు కాబట్టి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. భక్తుడు తన ఇంద్రియాలను నియంత్రించుకున్నప్పుడు.. అతను దేవునితో సంబంధం పెట్టుకోవడంలో విజయం సాధిస్తాడని చెప్తోంది శాస్త్రం. పూజలు చేసేప్పుడు భక్తుడు దృష్టి అంతా శివునిపైనే ఉండాలి. అయితే మాంసాహారం తింటే.. బద్ధకం పెరుగుతుంది. అంతేకాకుండా అహంకారం, కోపం, అజ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో నాన్‌వెజ్ తినరు.
సమతుల్య ఆహారం తీసుకోకపోతే.. వ్యక్తి తన ఇంద్రియాలను నియంత్రించలేడు. పూజలో అడ్డంకులు ఏర్పడతాయి. ఆధ్యాత్మికత నుంచి విడిపోతాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జ్యోతిష్య శాస్త్రంలో శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదని తెలిపారు. మతపరమైన కోణం నుంచి చెప్పాలంటే.. కొన్ని నమ్మకాల ప్రకారం వర్షం కారణంగా శ్రావణ మాసంలో జీవులను చంపి తినడం పాపం కిందకు వస్తుంది. అందుకే తినరు.
శాస్త్రీయ కారణం ఇదే
శ్రావణ మాసంలో మాంసాహారం తినకపోవడానికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. శ్రావణ మాసం జూలై లేదా ఆగస్టులో వస్తుంది. ఈ సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. దీని కారణంగా ఆహార పదార్థాలలో ఫంగస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీనిని తీసుకోవడం వల్ల వ్యక్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శ్రావణ మాసంలో మాంసాహారం.. సాధారణ రోజుల కంటే వేగంగా పాడైపోతుందట. అంటే 6 గంటలు తాజాగా ఉండే ఆహారం 4 గంటల్లోనే పాడైపోతుందట. అలాగే వీటితో పాటు వేగంగా బ్యాక్టిరీయా వ్యాప్తి ఉంటుందట. అందుకే నాన్‌వెజ్‌కి దూరంగా ఉండాలని చెప్తారు.
అంతేకాకుండా వర్షాకాలంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఆ సమయంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి. అలాగే జీర్ణవ్యవస్థ వీక్‌గా ఉంటుంది. నాన్‌వెజ్ అరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే దానిని దూరంగా ఉండాలని చెప్తున్నారు.
మీరు ఆధ్యాత్మికంగా నాన్‌వెజ్ తినకపోయినా పర్లేదు. కానీ సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉండే సమయంలో ఇలా నాన్‌వెజ్ తినకూడదని వైద్యులు కూడా సూచిస్తారు. పూర్తి ఆరోగ్యం కోసం మీరు దానిని అవాయిడ్ చేయవచ్చు. లేదా పూర్తిగా శుభ్రమైన రీతిలో.. బాగా ఉడికించుకుని తినడం ద్వారా వ్యాధుల వ్యాప్తి కాస్త తగ్గే అవకాశం ఉంటుంది.






















