Soy Foods: సోయా ఫుడ్స్‌తో గుండె జబ్బులకు చెక్ - లేటెస్ట్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించిన వైద్యులు
సోయా ఫుడ్స్‌తో ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. సోయా ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం వల్ల గుండె సంబంధ సమస్యలు దరిచేరవని తేలింది.
Soy Foods Reduce Risk Of Heart Diseases: సోయా ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్యులు. వారానికి ఓసారి సోయా ఫుడ్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. తరచుగా సోయా ఫుడ్స్ తీసుకోవడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం 17 శాతం తగ్గుతున్నట్లు గుర్తించారు. స్ట్రోక్ ముప్పు సైతం 18 శాతం తగ్గుతుందని బోస్టన్‌లోని హార్వర్డ్ TH చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు తెలిపారు. సోయాలో ఉండే ఫైటోఈస్ట్రోజెన్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతున్నట్లు గుర్తించామన్నారు. సోయా ఉత్పత్తులు ధమనుల పనితీరును మెరుగు పరుస్తున్నట్లు తెలిపారు. రక్త పోటును తగ్గించడంలో సోయా ఫుడ్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. సోయా ఫుడ్స్ తో కొలెస్ట్రాల్ కరిగి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని తెలిపారు. మాంసాహారం తీసుకోని వారికి సోయా ఫుడ్ చాలా ఉపయోగపడుతుందంటున్నారు. సోయాలో తొమ్మిది అమైనో ఆమ్లాలతో పాటు అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ ఉంటుందని... ఇది శరీరంలో కండరాల బలోపేతానికి కారణం అవుతుందన్నారు.
సోయా ఫుడ్స్ ఎంత పరిమాణంలో తీసుకుంటే మంచిది ?
శరీరానికి అససరమైన ప్రొటీన్ అందాలంటే రోజుకు కనీసం 25 గ్రాములు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సోయా ఉత్పత్తులు ఏరూపంలో తీసుకున్న ప్రొటీన్ అందుతుందంటున్నారు. రోజూ ఒక కప్పు సోయా మిల్క్ శరీరానికి కావాల్సి ప్రొటీన్ ను అందిస్తాయంటున్నారు. అయితే, ఆయా వ్యక్తుల జన్యుపరమైన విధానాలకు అనుకూలంగా సోయా ఉత్పత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. అందరిలో ఒకే రమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉండదంటున్నారు. ఓట్స్, బార్లీ లాంటి కరిగే ఫైబర్... గింజలు, ఆలివ్ నూనె లాంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటితో పోల్చితే సోయా ఉత్పత్తులు ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తాయంటున్నారు నిపుణులు.
Read Also: పెద్దలలో జాండిస్ - ఏ ఫుడ్స్ తీసుకోవాలి? ఏం తీసుకోకూడదంటే?
సోయా ఉత్పత్తులతో కలిగే ఇబ్బందులు
సోయా ఫుడ్స్ తో కలిగే లాభాలతో పాటు నష్టాలను కూడా తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. థైరాయిడ్, హార్మోన్ సమస్యలు ఉన్న వాళ్లకు అలర్జీ కలిగించే అవకాశం ఉందంటున్నారు. ఎక్కువగా ప్రాసెస్ చేయబడిన సోయా ఉత్పత్తులను తీసుకోకపోవడం మంచిదంటున్నారు. వాటి వల్ల అనుకున్న స్థాయిలో ప్రొటీన్లు అందే అవకాశం లేదంటున్నారు. సోయా సాస్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. దీనిలో సోడియం బీపీని పెంచే అవకాశం ఉందంటున్నారు. ఆల్రెడీ బీపీ ఉన్న వాళ్లు సోయాను తీసుకోకపోవడం మంచిదంటున్నారు. సోయా ఫుడ్స్ మరింత రుచికరంగా ఉండేందుకు కలిపే రసాయనాలు పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయంటున్నారు. ఊబకాయం, జీవక్రియ సమస్యలు, లైంగిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. వీలైనంత వరకు రసాయనాలు కలపని సోయా ఫుడ్స్ తీసుకునేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాంసాహారం తీసుకోని వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందివ్వడంలో సోయా ఫుడ్స్ కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
Read Also : నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారా ? అయితే మీ లివర్ మటాషే.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు