అన్వేషించండి

Makeup: మేకప్ తీయకుండా నిద్రపోతున్నారా? మీ చర్మం ఎంతగా దెబ్బతింటుందో తెలుసా?

ఇప్పుడు మేకప్ వేసుకోవడం ట్రెండ్ అయ్యింది. నటులే కాదు అందరూ మేకప్ వేసుకుంటున్నారు.

మేకప్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సినిమా నటీనటులే. నిజానికి ఆధునిక కాలంలో కేవలం వారే కాదు ఎంతో మంది మేకప్ వేసుకుంటున్నారు. కాంపాక్ట్ పౌడర్ తో మొదలుపెట్టి ఐలేషెస్ వరకు చాలా మంది మేకప్ ఫాలోఅవుతున్నారు. కొంతమంది అర్థరాత్రి దాటాకా ఇంటికి చేరినప్పుడు అలసిపోయి అలాగే నిద్రపోతారు. కానీ అలా చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మీ చర్మాన్ని మీరే చేజేతులా పాడుచేసుకున్నవారు అవుతారు. దీర్ఘకాలంగా మేకప్ చర్మంపైనే ఉండడం వల్ల చాలా హాని కలుగుతుంది. 

ఏ సమయానికైనా నిద్రపోయే ముందు మేకప్ తొలగించడం చాలా ముఖ్యం. లేకుంటే అది చర్మం రంధ్రాలను మూసేస్తుంది. రంధ్రాలు ఎక్కువ కాలం పాటూ మూసుకుపోయినప్పుడు ఇది మొటిమలకు దారితీస్తుంది. చర్మాన్ని దెబ్బతీస్తుంది. అలాగే ఇతర చర్మ సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఎదురయ్యే సమస్యలు ఇవే. 

మొటిమలు
ముందుగా చెప్పినట్టు మేకప్ తీయకుండా పడుకోవడం వల్ల కచ్చితంగా మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అంతేకాదు ముఖంలో జిడ్డుదనం పెరిగిపోతుంది. దురద ఎక్కువైపోతుంది. కాబట్టి పడుకునేముందు కచ్చితంగా మేకప్ మొత్తం క్లీన్ చేసకుని చర్మ రంధ్రాలు తమ పని తాము చేసే అవకాశాన్ని కల్పించండి. 

దురదలు
ఎక్కువ సేపు మేకప్ ముఖంపై ఉండడం వల్ల చర్మం పొడిగా మారుతుంది. ఇది దురదకు దారితీయవచ్చు. ఆ దురదలను గోకడం వల్ల గోళ్లలోని దుమ్ముధూళి కూడా చర్మ రంధ్రాల్లోకి చేరవచ్చు. ఎర్రటి పాచెస్ లా వచ్చి ఇతర చర్మవ్యాధులు దాడి చేయవచ్చు. 

కళ్లకు ఇరిటేషన్
మేకప్‌ తీయకుండా నిద్రపోవడం వల్ల కళ్ల చుట్టూ ఉన్న చర్మానికి చాలా హాని. ఆ చర్మం శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. కళ్ల చుట్టూ ఉండే ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది. ఆ ప్రాంతం దెబ్బతింటే ముఖమంతా అందవికారంగా కనిపిస్తుంది. కాబట్టి మేకప్ విషయంలో జాగ్రత్త పడండి. 

పెదవులు
లిప్ స్టిక్ ను వాడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. రోజులో రెండు మూడు గంటలకోసారి లిప్ స్టిక్ రుద్దేవారు ఎంతో మంది. పడుకునే ముందు మాత్రం పెదవులను శుభ్రం చేసుకుని, లిప్ స్టిక్ మొత్తం తొలగించాకే నిద్రపోవాలి. లేకుంటే పెదవులు పొడిగా మారిపోతాయి. పగుళ్లు ఏర్పడతాయి. పెదవుల్లోని తేమను మొత్తం లిప్ స్టిక్ పీల్చేస్తుంది. దీనివల్ల పెదవులు పాలిపోయినట్టు మారిపోతాయి. 

Also read: డయాబెటిస్ ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన నాలుగు కూరగాయలు ఇవే

Also read: భూమ్మీద ఇప్పటివరకు పుట్టినవాళ్లలో అత్యంత ధనవంతుడు ఈయనే, పనివారికి కూడా బంగారు వస్త్రాలే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Happy Vinayaka Chavithi : వినాయక చవితి విశిష్టతను తెలిపే విషెష్ ఇవే.. గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు ఇలా చెప్పండి
వినాయక చవితి విశిష్టతను తెలిపే విషెష్ ఇవే.. గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు ఇలా చెప్పండి
Sleep and Depression Medicines : నిద్ర, డిప్రెషన్ మందులు ఎవరికి ఎక్కువ ప్రమాదం? కిందపడే రిస్క్‌పై తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నిద్ర, డిప్రెషన్ మందులు ఎవరికి ఎక్కువ ప్రమాదం? కిందపడే రిస్క్‌పై తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Rice Water for Skin and Hair : పండుగల ముందు గ్లోయింగ్ స్కిన్, షైనీ హెయిర్ కావాలా? రైస్ వాటర్ ఇలా ఉపయోగించండి
పండుగల ముందు గ్లోయింగ్ స్కిన్, షైనీ హెయిర్ కావాలా? రైస్ వాటర్ ఇలా ఉపయోగించండి
Golden Modaks : గణేష్ చతుర్థి స్పెషల్ గోల్డెన్ మోదకాలు.. వినాయకుడికి ఇలా ఈజీగా, టేస్టీగా చేసి నైవేద్యంగా పెట్టేయండి
గణేష్ చతుర్థి స్పెషల్ గోల్డెన్ మోదకాలు.. వినాయకుడికి ఇలా ఈజీగా, టేస్టీగా చేసి నైవేద్యంగా పెట్టేయండి

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
AP Congress new incharge: ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
Saifabad పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Embed widget