అన్వేషించండి

Effect of Covid-19 : సిరలపై కరోనా ప్రభావం.. గుండె జబ్బుల ప్రమాదానికి అదే కారణం, తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు

Heart Health : సిరలపై కోవిడ్ ప్రభావం ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని దెబ్బతింటుందని.. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతున్నాయని తెలిపింది తాజా పరిశోధన.

Covid-19 Affects Veins : కరోనా మహమ్మారి వెళ్లిపోయినా దాని ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ వైరస్ కేవలం ఊపిరితిత్తులు,  రోగనిరోధక శక్తిని మాత్రమే ఎఫెక్ట్ చేయలేదు.. సిరలపై కూడా తన నెగిటివ్ ప్రభావం చూపించదని చెప్తున్నారు నిపుణులు. దీనివల్ల గుండె ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిందని చెప్తున్నారు. తాజాగా యూరోపియన్ హార్ట్ జర్నల్లో పరిశోధన సమయంలో ఆశ్చర్యకరమైన గుర్తించారు. ఈ అధ్యయనంలో ఆస్ట్రేలియా, బ్రెజిల్, యూరప్​తో సహా 16 దేశాలకు చెందిన సుమారుగా 2400 మందిని పాల్గొన్నారు. వీరిలో కరోనా సోకిన వారి సిరలు సాధారణం కంటే ఎక్కువ వయస్సు పెరిగాయని తేలింది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదం పెరిగిందని గుర్తించారు.

కరోనా సోకిన వారి సిరలపై ప్రభావం

ఈ పరిశోధనలో కోవిడ్-19 సోకిన వారి ధమనుల్లో వశ్యత తగ్గినట్లు గుర్తించారు. అంటే సిరలు ముందే వృద్ధాప్యం చెందాయని.. దీనివల్ల రక్త ప్రసరణ ప్రభావితమవుతుందని తెలిపారు. గుండెపై అదనపు ఒత్తిడి పడిందని.. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగినవారిలో గుండెపోటు, స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి వాటి ప్రమాదం పెరిగిందని తెలుసుకున్నారు.

2400 మందిపై పరిశోధన 

పరిశోధనలో పాల్గొన్న 2400 మందిలో కరోనా నుంచి కోలుకున్న వారు కూడా ఉన్నారు. వీరిలో 40% మంది సిరలు వాస్తవ వయస్సు కంటే 5 సంవత్సరాలు ఎక్కువ వయస్సు కలిగి ఉన్నట్లు గుర్తించారు. కోవిడ్-19 ప్రభావం కేవలం ఇన్ఫెక్షన్ సమయంలోనే కాకుండా, రికవరీ తర్వాత కూడా శరీరంలో ఉంటుందని సూచిస్తుంది. నిపుణులు వైరస్ సిరలలో వాపు, నష్టం కలిగించవచ్చు. దీనివల్ల సిరల స్థితిస్థాపకత కోల్పోయి గుండెపై ఒత్తిడి పెరిగిందని తెలిపారు.

గుండె, సిరలను ఎలా కాపాడుకోవాలంటే..

కరోనా తర్వాత గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా.. సిరలను ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు నిపుణులు. 

  • సమతుల్య ఆహారం : పండ్లు, కూరగాయలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, పీచు పదార్థాలు  తీసుకోవాలి. ఇవి సిరలు కండీషన్ మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • వ్యాయామం : రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా వ్యాయామం చేయాలి. యోగా కూడా మంచిదే. ఇవి సిరల స్థితిస్థాపకతను కాపాడటానికి సహాయం చేస్తాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
  • రక్త పోటు, చక్కెర : అధిక రక్తపోటు, మధుమేహం సమస్యను రెట్టింపు చేసి ప్రమాదకరంగా మార్చుతాయి కాబట్టి.. వాటిని అదుపులో ఉంచుకోండి. వైద్యులు సూచించిన నియమాలు పాటిస్తూ మందులు ఉపయోగించండి. అప్పుడు పరిస్థితి విషమించకుండా ఉంటుంది.
  • ఒత్తిడి : ఒత్తిడి, ఆందోళన గుండె ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు.. సిరలపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ధ్యానం, మెడిటేషన్ లేదా తేలికపాటి వ్యాయామం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోండి. డీప్ బ్రీతింగ్ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది.
  • ఆరోగ్య పరీక్షలు : కరోనా ఎఫెక్ట్ పడినవారు కచ్చితంగా సిరలు, గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోవడం కోసం టెస్ట్​లు చేయించుకోవాలి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget