అన్వేషించండి

Scrub Typhus Cases : ఏపీలో పెరుగుతోన్న స్క్రబ్ టైఫస్ కేసులు.. వ్యాప్తి కారణాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

Scrub Typhus : స్క్రబ్ టైఫస్ అనే చిన్న పురుగు పెద్ద ప్రమాదాన్ని తీసుకువచ్చింది. అసలు ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది? లక్షణాలు ఏంటి? ప్రమాదకరమా? చికిత్సలు ఉన్నాయా? చూసేద్దాం.

Hidden Danger of Scrub Typhus : చలికాలంలో జ్వరాలు రావడం సహజమే. అయితే ఈ మధ్యకాలంలో వస్తోన్న జ్వరం కాస్త డేంజర్​గా మారింది. నార్మల్ ఫీవర్ అని నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలపైనే ప్రభావం చూపిస్తుంది. దానినే స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) అంటున్నారు వైద్యులు. ఈ మధ్యకాలంలో ఈ తరహా కేసులు పెరుగడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది.  గతంలో అన్యప్రాంతాలకే పరిమితమైన ఈ వ్యాధి.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. అసలు ఇది ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.

Scrub Typhus అంటే ఏంటి?

స్క్రబ్ టైఫస్ అనేది Orientia tsutsugamushi అనే బ్యాక్టీరియా వల్ల కలిగే రాకెట్టియల్ ఇన్ఫెక్షన్. అయితే ఈ బ్యాక్టీరియా మనిషికి నేరుగా సోకదు. చిగ్గర్ (chigger mites లేదా లార్వల్ మైట్) అనే సూక్ష్మ పురుగు కుట్టడం వల్ల వస్తుంది. వీటి పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. కళ్లకు కూడా కనిపించవు. అందుకే వీటి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. 

పొలాలు, గడ్డి పొదలు, అడవులు, తడి నేల, పశువుల మేత ప్రాంతాల్లో ఈ చిగ్గర్లు ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఈ ప్రదేశాలకు వివిధ అవసరాల కోసం వెళ్తుంటారు. చిగ్గర్లు ఉన్న ప్రదేశాల్లో నడిచినా.. కూర్చొన్నా.. పని చేసినా.. అవి చర్మంపై అంటుకుని కాటు వేస్తాయి. దీనివల్ల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి స్క్రబ్ టైఫస్​కి కారణమవుతుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో పెరగడానికి కారణాలివే.. 

ఇటీవలి కాలంలో ఏపీలో ఈ కేసులు పెరుగుతున్నాయి. పంట కోత–పొలం పనుల సమయంలో చిగ్గర్లు సోకే ప్రమాదం ఉంది. అలాగే తడి నేల కూడా వీటి వ్యాప్తిని ప్రోత్సాహిస్తుంది. జ్వరం వస్తే వైరల్ ఫీవర్‌గా భావించి మందులు వేసుకుని వైద్య సహాయం తీసుకోకపోవడం వల్ల కూడా కేసులు పెరుగుతున్నాయి. 

స్క్రబ్ టైఫస్​ లక్షణాలు..

స్క్రబ్ టైఫస్‌లో లక్షణాలు సాధారణ జ్వరం లాగా ఉంటాయి. అందుకే చాలా మంది గుర్తించలేరు. మొదటివారంలో అధిక జ్వరం, చలి, తీవ్రమైన తలనొప్పి, బాడీ పెయిన్స్, అలసట, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటాయి. చిగ్గర్లు కాటు వేసిన చోట నల్లటి మచ్చ ఏర్పడుతుంది. ఇది స్క్రబ్ టైఫస్​కు క్లాసిక్​ సైన్​గా చెప్తారు. 

స్క్రబ్ టైఫస్ చికిత్స..

సాధరణ జ్వరమేనని చికిత్స తీసుకోకపోతే.. ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్​కు గురి అవుతాయి. మైకం రావడం, లో బీపీ, అవయవాల పనితీరు దెబ్బతినడం, అత్యవసర ఆరోగ్య ప్రమాదం ఏర్పడటం జరుగుతుంది. అందుకే దీనికి ముందుగానే చికిత్స తీసుకోవాలి. వైద్యులు IgM ELISA, PCR వంటి టెస్ట్​లు చేసి నిర్థారిస్తారు. ఒకవేళ సమస్య ఉందని తెలిపిస్తే.. యాంటీబయాటిక్స్‌తోనే ఇస్తారు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే 24–48 గంటల్లో జ్వరం తగ్గుతుంది. విస్మరిస్తే ప్రాణాంతకం అవుతుంది. 

స్క్రబ్ టైఫస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి.  పొలాల్లో పనిచేసేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. సాక్స్​లు వేసుకోవడం, ఫుల్ హ్యాండ్స్ ఉన్న దుస్తులు వేసుకోవడం చేస్తే మంచిది. ఇన్సెక్ట్ రిపెలెంట్ వాడితే మంచిది. ఇంటి దగ్గర్లో గడ్డి పొదలు లేకుండా చూసుకోవాలి. ప్రభుత్వం–స్వచ్ఛంద సంస్థలు గ్రామాల్లో ఫీవర్ క్యాంపులు నిర్వహించాలి.
Scrub Typhus అనేది నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. కానీ సులభంగా చికిత్స చేయగల వ్యాధి. కాబట్టి దీనిపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. లేదంటే అది చివరికి ప్రాణాంతకమవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget