అన్వేషించండి

Slim Waist Surgery : నడుమును సన్నగా చేసే రిబ్ మోడలింగ్ సర్జరీ.. ఎంత ప్రమాదమో తెలుసా?

Rib Modeling Surgery : సన్నని నడుము కోసం పక్కటెముకలను విరగ్గొట్టుకుంటున్నారా? సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న రిబ్ మోడలింగ్ సర్జరీ ప్రమాదమా? నిపుణులు ఏమంటున్నారో తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రిబ్ మోడలింగ్ నడుము సన్నబరచడానికి పక్కటెముకల శస్త్రచికిత్స.
  • పక్కటెముకలను పాక్షికంగా విరిచి, నడుము వంపు చేస్తారు.
  • శస్త్రచికిత్సతో నడుము సన్నబడినప్పటికీ, ప్రమాదాలు ఉంటాయి.
  • అర్హతగల సర్జన్‌తో ప్రయోజనాలు, నష్టాలపై చర్చించాలి.

Rib Modeling Surgery Procedure Details : సన్నని నడుము, ఆకర్షణీయమైన శరీరాకృతి కావాలని చాలామంది కోరుకుంటారు. దీనిలో భాగంగా కొందరు మహిళలు వివిధ రకాల కాస్మెటిక్ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రిబ్ మోడలింగ్ సర్జరీపై ఎక్కువగా వినిపిస్తోంది. ఈ రిబ్ మోడలింగ్ సర్జరీలో నడుము సన్నగా కనిపించేలా చేయడానికి.. కింది పక్కటెముకల ఆకృతిని మారుస్తారు. మరి దీనికోసం పక్కటెముకలను నిజంగానే విరగ్గొడతారా? శస్త్రచికిత్స ఎలా చేస్తారు? ఫలితాలు ఎలా ఉంటాయి? ఆరోగ్యానికి ప్రమాదమా వంటి విషయాలు తెలుసుకుందాం.

రిబ్ మోడలింగ్ సర్జరీ 

రిబ్ మోడలింగ్‌ను పక్కటెముకల ఆకృతిని మార్చే కాస్మెటిక్ శస్త్రచికిత్సగా చెప్పవచ్చు. దీని ప్రధాన ఉద్దేశ్యం నడుము భాగం సన్నగా కనిపించేలా చేయడమే. సాధారణంగా ఇందులో కింది పక్కటెముకల ఆకృతిని మార్చేందుకు ప్రయత్నిస్తారు. ఇది లైపోసక్షన్‌ వంటి ప్రక్రియల కంటే భిన్నమైనది. ఎందుకంటే లైపోసక్షన్‌లో శరీరంలోని కొన్ని ప్రాంతాల్లో పేరుకున్న కొవ్వును మాత్రమే తొలగిస్తారు. కానీ రిబ్ మోడలింగ్‌లో ఎముకల నిర్మాణంపైనే పనిచేస్తారు. 

పక్కటెముకలను పూర్తిగా తొలగించకుండా, వాటిని నియంత్రిత పద్ధతిలో బలహీనపరచి లేదా విరగొట్టి, నడుము లోపలివైపు వంపు వచ్చేలా చేసే పద్ధతులు దీనిలో ఉన్నాయి. అయితే ఈ ప్రక్రియ చేసే విధానం వైద్యుడు, వారు ఉపయోగించే టెక్నిక్‌ను బట్టి మారవచ్చు.

Also Read : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే

ఈ సర్జరీ ఎందుకు చేయించుకుంటారు?

సోషల్ మీడియాలో కనిపించే ఆకర్షణీయమైన శరీరాకృతులు.. నడుముపై పెరుగుతున్న ఆసక్తి ఈ సర్జరీపై చర్చకు కారణమవుతున్నాయి. కొందరు మహిళలు వ్యాయామం లేదా ఆహార నియంత్రణతో మాత్రమే దీనిని సాధించలేమని భావించి.. ఇలాంటి కాస్మెటిక్ విధానాల గురించి తెలుసుకుంటున్నారు. 

కార్సెట్ ధరించినప్పుడు కనిపించే సన్నని నడుము వంపులను శాశ్వతంగా పొందాలనే ఉద్దేశంతో కొందరు ఈ సర్జరీని ఎంచుకుంటున్నారు. మరికొందరు లైపోసక్షన్‌ వంటి ఇతర కాస్మెటిక్ ప్రక్రియలతో కలిపి చేయించుకోవాలని చూస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరి శరీర నిర్మాణం వేర్వేరుగా ఉంటుంది. అందువల్ల అందరికీ ఇది ఒకే రకమైన ఫలితాలు ఇస్తాయని చెప్పలేం.

Also Read : వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?

రిబ్ మోడలింగ్ సర్జరీ ఎలా చేస్తారు?

ఈ ప్రక్రియలో సాధారణంగా నడుము కింది భాగంలో చిన్న కోతలు చేసి.. కింది పక్కటెముకల ఆకృతిని మారుస్తారు. కొన్ని పద్ధతుల్లో పక్కటెముకలను బలహీనపరచి లేదా విరగొట్టి, లోపలివైపు వంపు వచ్చేలా చేస్తారు. ఈ సర్జరీని సాధారణంగా అనస్థీషియా ఇచ్చి చేస్తారు. ఉపయోగించే విధానాన్ని బట్టి శస్త్రచికిత్స వివరాలు మారుతాయి. పక్కటెముకలు, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాలకు దగ్గరగా ఈ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి వైద్యులు శరీర నిర్మాణాన్ని జాగ్రత్తగా అంచనా వేయాల్సి ఉంటుంది.

శస్త్రచికిత్సలో ఏమి జరుగుతుంది?

డాక్టర్ హదీద్ ప్రకారం.. నడుము కింది భాగంలో రెండు చిన్న కోతలు పెట్టి.. కింది మూడు పక్కటెముకలను పాక్షికంగా విరగ్గొడతారు. డాక్టర్ మార్షల్ ప్రకారం.. ఈ ప్రక్రియను జనరల్ అనస్థీషియా ఇచ్చి.. అల్ట్రాసౌండ్ ఉపయోగించి పక్కటెముకలు, ఊపిరితిత్తుల స్థానాన్ని అంచనా వేస్తారు. ఆ తర్వాత.. ఒక ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించి.. పక్కటెముకల ఉపరితలంపై నియంత్రిత పద్ధతిలో శస్త్రచికిత్స చేసి.. పక్కటెముకలను విరగ్గొట్టడానికి ఒత్తిడిని ప్రయోగిస్తారు. అంతేకానీ పక్కటెముకలను తొలగించరు.

Also Read : బరువు తగ్గాలా? కఠినమైన డైట్ వద్దు, ఈ చిన్న మార్పులు చాలు అంటోన్న హెల్త్ కోచ్.. వీటితో పది కిలోలు తగ్గిందట

సర్జరీ తర్వాత పక్కటెముకలు కొత్త స్థానంలో స్థిరపడేందుకు కొంతకాలం కార్సెట్ ధరించాలని వైద్యులు సూచిస్తారు. ఎంతకాలం ధరించాలనేది సర్జరీ విధానం, రోగి కోలుకునే తీరుపై ఆధారపడి ఉంటుంది. నడుము చుట్టుకొలత తగ్గే పరిమాణం కూడా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండవచ్చు.

నిజంగా నడుము సన్నబడుతుందా?

రిబ్ మోడలింగ్‌పై ప్రచురితమైన కొన్ని అధ్యయనాల్లో నడుము చుట్టుకొలత తగ్గినట్లు నివేదించారు. 2026లో ప్రచురితమైనట్లు ఒక సమీక్షలో నాలుగు అధ్యయనాలు, మొత్తం 318 మంది రోగుల ఫలితాలను పరిశీలించగా.. మూడు నెలల తర్వాత నడుము చుట్టుకొలతలో సగటున సుమారు 8.6 సెంటీమీటర్ల తగ్గుదల నమోదైనట్లు సమాచారం ఉంది.

Also Read : అన్నానికి బదులుగా డిన్నర్​లో ఇవి తినండి.. కడుపు నిండటంతో పాటు బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయి

అయితే ఈ ఫలితాలను అందరికీ వర్తింపజేయలేం. అధ్యయనాల్లో పాల్గొన్నవారి సంఖ్య, ఉపయోగించిన శస్త్రచికిత్స పద్ధతులు, ఫాలోఅప్ వ్యవధి వంటి అంశాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలంలో ఈ మార్పులు ఎంతకాలం నిలుస్తాయి? భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చు? అనే విషయాలపై మరింత పరిశోధన అవసరం.

రిబ్ మోడలింగ్ సర్జరీ ప్రమాదమా?

నడుము సన్నగా కనిపించినప్పటికీ.. ఈ శస్త్రచికిత్సలో ఉండే ప్రమాదాలను నిర్లక్ష్యం చేయకూడదు. పక్కటెముకలు ఊపిరితిత్తులు, ఇతర ముఖ్యమైన శరీర నిర్మాణాలకు దగ్గరగా ఉంటాయి. అందువల్ల ఎముకల ఆకృతిని మార్చే ప్రక్రియలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు. అవేంటంటే..

Also Read : బరువు తగ్గాలన్నా.. పొట్టను తగ్గించుకోవాలన్నా.. ఈ ఎఫెక్టివ్ 7 యోగాసనాలు వేసేయండి

ఊపిరితిత్తుల చుట్టూ ఉండే ప్రదేశంలో గాలి చేరడం వల్ల ఊపిరితిత్తులు కొంతవరకు లేదా పూర్తిగా కుంచించుకుపోవచ్చు. ఇది అత్యవసర వైద్య చికిత్స అవసరమయ్యే సమస్య కావచ్చు. అలాగే ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న ప్రదేశంలో రక్తం చేరవచ్చు. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా విరిగిన పక్కటెముకలు ఆశించిన విధంగా నయం కాకపోవచ్చు. దీనివల్ల నొప్పి లేదా

ఇతర సమస్యలు తలెత్తవచ్చు.

శస్త్రచికిత్స తర్వాత కొందరిలో నొప్పి ఎక్కువకాలం కొనసాగవచ్చు. గాయం మానడంలో సమస్యలు తలెత్తవచ్చు. ఇన్ఫెక్షన్, గాయం నెమ్మదిగా మానడం, చర్మంపై మచ్చలు లేదా ఇతర మార్పులు రావచ్చు. అలాగే రెండు వైపులా నడుము ఆకృతి ఒకేలా మారకపోవచ్చు. ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. కొన్ని అధ్యయనాల్లో సమస్యలు తక్కువ శాతంలో నమోదైనప్పటికీ.. వాటిని పూర్తిగా విస్మరించలేం. 

సర్జరీ చేయించుకోవాలనుకుంటే..

రిబ్ మోడలింగ్ అనేది కేవలం అందం కోసం చేసే సాధారణ చికిత్స కాదు. ఇందులో ఎముకల నిర్మాణాన్ని మార్చాల్సి ఉంటుంది. అందువల్ల ఈ ప్రక్రియ గురించి ఆలోచించేవారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. సర్జరీ వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాల గురించి అర్హత కలిగిన ప్లాస్టిక్ సర్జన్‌తో పూర్తిగా చర్చించాలి. సర్జరీ తర్వాత కోలుకోవడానికి పట్టే సమయం, కార్సెట్ ధరించాల్సిన అవసరం, నొప్పి నిర్వహణ వంటి అంశాల గురించి ముందుగానే తెలుసుకోవాలి.

Also Read : 4 నెలల్లో 15 కిలోల బరువు తగ్గిన ఇన్‌ఫ్లుయెన్సర్.. బరువు తగ్గేందుకు ఫాలో అయి 5 చిట్కాలు ఇవే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Best One-Year FD Rates : లక్ష రూపాయలను ఒక సంవత్సరానికి FDలో జమ చేస్తే ఏ బ్యాంకు ఎంత రాబడిని ఇస్తుంది?
లక్ష రూపాయలను ఒక సంవత్సరానికి FDలో జమ చేస్తే ఏ బ్యాంకు ఎంత రాబడిని ఇస్తుంది?
Amla Juice : ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగితే బరువు తగ్గుతారా? చర్మం మెరుస్తుందా? నిజాలివే
ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగితే బరువు తగ్గుతారా? చర్మం మెరుస్తుందా? నిజాలివే
Japanese Beauty Secrets : తక్కువ ఖర్చుతో గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవాలా? ఈ 5 జపనీస్ చిట్కాలు ట్రై చేయండి
తక్కువ ఖర్చుతో గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవాలా? ఈ 5 జపనీస్ చిట్కాలు ట్రై చేయండి
Jeera vs Ajwain vs Methi Water : జీలకర్ర నీళ్లా? వాము నీళ్లా? మెంతుల నీళ్లా? ఉదయాన్నే ఏది తాగితే మంచిది?
జీలకర్ర నీళ్లా? వాము నీళ్లా? మెంతుల నీళ్లా? ఉదయాన్నే ఏది తాగితే మంచిది?
Advertisement

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Embed widget