News
News
X

Sankranthi 2023: ప్రసాదం బూరెలు చేయడం చాలా సులువు, మీరూ ప్రయత్నించండి

సంక్రాంతి అంటే పిండివంటలు గుర్తొస్తాయి. ముఖ్యంగా నైవేద్యంలో స్వీటు ఉండాల్సిందే.

FOLLOW US: 
Share:

సంక్రాంతి పండుగ వచ్చిందటే వంటగది ఘుమఘమలాడాల్సిందే. పులిహోర, బూరెలు కచ్చితంగా ఉంటాయి. ఎక్కువ మంది పూర్ణం బూరెలు చేసుకుంటారు. నిత్యం పూర్ణం బూరెలు అంటే బోరు కొడుతుంది కదా. ఈసారి సింపుల్‌గా ప్రసాదం బూరెలు చేసుకోండి. పిల్లలకు చాలా నచ్చుతాయి. చేయడం కూడా చాలా సులువు. 

కావలసిన పదార్థాలు
మినప్పప్పు - ఒక కప్పు 
బియ్యం - ఒక కప్పు 
నెయ్యి - రెండు స్పూనులు 
నీళ్లు - ఒక కప్పు 
పంచదార - ఒకటిన్నర కప్పు
యాలకుల పొడి - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ ఇలా
1. ముందుగా ఒక గిన్నెలో మినపప్పు, మరో గిన్నెలో బియ్యం నానబెట్టుకోవాలి. 

2. నాలుగు గంటల పాటూ నానాక రెండింటినీ మిక్సిలో వేసి రుబ్బుకోవాలి. 

3. మరీ పలుచగా కాకుండా, అలాగని మరీ అందంగా కాకుండా రుబ్బుకోవాలి. 

4. ఆ పిండిని తీసి ఒక గిన్నెలో వేసి ఒక స్పూను ఉప్పువేసి కలపాలి. దాన్ని ఒక గంట పాటూ పక్కన పెట్టేయాలి. 

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి వేయించాలి. 

6. అయిదు నిమిషాలు వేగాక అందులో మరగకాచిన వేడి నీళ్లను ఒక గ్లాసు వేయాలి. 

7. అడుగంటిపోకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఒక కప్పు పంచదార కూడా వేయాలి. 

8. ఒక స్పూను యాలకుల పొడి కూడా వేసి కలుపుతూనే ఉండాలి. 

9.   చిన్న మంట మీద ఉడికిస్తే రవ్వ మాడిపోకుండా బాగా ఉడుకుతుంది. మిశ్రమం  అంతా దగ్గరగా అయి ఉండలు చుట్టేందుకు వీలుగా మందంగా మారుతుంది. అప్పుడు స్టవ్ కట్టేయాలి. 

10. బొంబాయి రవ్వ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. 

11. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. 

12. బొంబాయి రవ్వను బూరెల సైజులో ఉండలుగా చుట్టుకుని మినప - బియ్యం పిండిలో ముంచి నూనెలో వేయించాలి. 

13. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారాక తీసి పక్కన పెట్టుకోవాలి. అంటే ప్రసాదం బూరెలు సిద్ధమైనట్టే. 

View this post on Instagram
 
A post shared by Vismai Food (@vismaifoodies)

Also read: మిస్ యూనివర్స్ పోటీలో భారతీయ అందం దివితా రాయ్, ఎవరీమె?

Published at : 15 Jan 2023 06:57 AM (IST) Tags: Prasadam Sankranthi 2023 Sankranthi 2023 Recipes Prasadam Boorelu Recipe Prasadam Burelu Making

సంబంధిత కథనాలు

Kitchen Tips: పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా నిల్వ చేయండి

Kitchen Tips: పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా నిల్వ చేయండి

Air Fryer: ఎయిర్ ఫ్రైయర్‌లో అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించొచ్చా? అలా చేస్తే ఇబ్బందులు వస్తాయా?

Air Fryer: ఎయిర్ ఫ్రైయర్‌లో అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించొచ్చా? అలా చేస్తే ఇబ్బందులు వస్తాయా?

Paneer: పాలతోనే కాదు పప్పుతో కూడా పనీర్ తయారు చేసుకోవచ్చు, ఎలాగంటే

Paneer: పాలతోనే కాదు పప్పుతో కూడా పనీర్ తయారు చేసుకోవచ్చు, ఎలాగంటే

Rotis Cooking: రోటీలు చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించి చూడండి, మెత్తగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయ్!

Rotis Cooking: రోటీలు చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించి చూడండి, మెత్తగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయ్!

Green Peas Recipe: పచ్చిబఠానీ - చీజ్ కట్‌లెట్ రెసిపీ, సాయంత్రానికి టేస్టీ స్నాక్

Green Peas Recipe: పచ్చిబఠానీ - చీజ్ కట్‌లెట్ రెసిపీ, సాయంత్రానికి టేస్టీ స్నాక్

టాప్ స్టోరీస్

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో  'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!