అన్వేషించండి

Vinayaka Chavithi Prasadam : మోదకాలంటే వినాయకుడికి మహా ప్రీతి.. రవ్వతో, డ్రై ఫ్రూట్స్​తో ఇలా టేస్టీగా మోదకాలు చేసేయండి

Lord ganesha recipes : గణేశ్ చతుర్థి సమయంలో వినాయకుడుకి రవ్వ మోదకాలు, డ్రై ఫ్రూట్ మోదకాలు చేసేయండి. వీటిని తయారు చేయడం చాలా తేలిక. వీటిని టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. 

Vinayaka Chavithi Recipes 2024 : మోదకాలు లేని వినాయక చవితి ఉండదనే చెప్పాలి. ఎందుకంటే వినాయకచవితి రోజు మోదకాలకు ఉండే ప్రత్యేకతే వేరు. గణేషుడుకి ఇవి అంటే చాలా ఇష్టమని చెప్తారు. ఆరోజు మోదకాల్లో వివిధ రకాలు వండుతారు. అయితే ఈసారి వినాయక చవితికి రవ్వ మోదకాలు(Ravva Modak), డ్రై ఫ్రూట్స్ మోదకాలు(Dry Fruit Modak) సిద్ధం చేసేయొచ్చు. వీటిని తయారు చేయడం కష్టమనుకుంటున్నారేమో.. చాలా సింపుల్​గా వీటిని వండేయొచ్చు. మరి వీటిని ఎలా వండాలి. కావాల్సిన పదార్థాలు ఏంటి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

రవ్వ మోదకాలకు కావాల్సిన పదార్థాలు 

నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్

రవ్వ - కప్పు

పాలు - రెండు కప్పులు

యాలకుల పొడి - అర టీస్పూన్

పంచదార - ముప్పావు కప్పు

కొబ్బరి - 1 కప్పు

బెల్లం - అర కప్పు

యాలకుల పొడి - 

తయారీ విధానం

ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై మందపాటి పాన్ పెట్టండి. దానిలో నెయ్యి వేసి కరగనివ్వాలి. నెయ్యి వేడిగా మారి కరిగిన తర్వాత దానిలో కొబ్బరి వేసి రెండు నిమిషాలు వేపాలి. అనంతరం దానిలో బెల్లం వేయాలి. యాలకుల పొడి వేసి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. కొబ్బరిలోని నీటితో బెల్లం కరిగి పూర్తిగా కొబ్బరిలో కలుస్తుంది. బెల్లం, కొబ్బరి కాస్త దగ్గరైన తర్వాత స్టౌవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో కడాయి తీసుకుని దానిలో నెయ్యి వేసి రవ్వను వేయించుకోవాలి. 

రవ్వ నుంచి మంచి అరోమా వచ్చిన తర్వాత దానిలో పాలు వేయాలి. పాలు, రవ్వ బాగా కలిసిపోవాలి. రవ్వ మంచిగా ఉడికి.. పాలల్లో కలిసి దగ్గరవుతుంది. ఇలా అయిన మిశ్రమంలో పంచదార వేసి.. అది కరిగి రవ్వలో కలిసే వరకు కలుపుకోవాలి. రవ్వ పాన్​ని వదిలేంత వరకు దానిని కలుపుతూనే ఉండాలి. స్టౌవ్ ఆపేసి.. దానిలో నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు మోదకాలు చేసుకునే మౌల్డ్ తీసుకోవాలి. దానిలో రవ్వను, ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని మధ్యలో ఉంచి మౌల్డ్ చేయాలి. అంతే టేస్టీ రవ్వ మోదకాలు రెడీ. 

డ్రై ఫ్రూట్స్ మోదకాలకు కావాల్సిన పదార్థాలు 

ఖర్జూరం - 150 గ్రాములు

కొబ్బరి పొడి - 50 గ్రాములు

జీడిపప్పు - 3 టేబుల్ స్పూన్స్

నెయ్యి  1 టేబుల్ స్పూన్

బాదం - 1 టేబుల్ స్పూన్

యాలకుల పొడి - చిటికెడు

పిస్తా - 2 టేబుల్ స్పూన్స్ 

పాల పొడి - 50 గ్రాములు

గసగసాలు - 1 టీస్పూన్

తయారీ విధానం

ముందుగా సీడ్స్​ లేకుండా ఖర్జూరం తీసి దానిని పేస్ట్ చేసుకోవాలి. జీడిపప్పును కూడా పౌడర్​గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాదం, పిస్తాలను పలుకులుగా చేసుకోవాలి. ముందుగా స్టౌవ్ వెలిగించి దానిలో కొబ్బరి పొడి వేసి కాస్త వేయించి పక్కన పెట్టుకోవాలి. అరోమా వచ్చే వరకు వేయిస్తే సరిపోతుంది. అనంతరం గసగసాలు వేసి.. చిట్లేవరకు వాటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. 

అదే కడాయిలో బాదం పలుకులు, పిస్తా వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కాస్త నెయ్యి వేసి ఖర్జూరం పేస్ట్​ని వేయాలి. దీనిని సన్నని సెగ మీద వేయించుకోవాలి. తర్వాత స్టౌవ్ ఆపేసి పాలపిండి వేసి ఖర్జూరం పేస్ట్​లో మిక్స్​ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిలో జీడిపప్పు పొడి, బాదం, పిస్తా పలుకులు, గసగసాలు, కొబ్బరి పొడి. యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మోదకాల మౌల్డ్​కి నెయ్యి రాసి.. ఈ మిశ్రమాన్ని వాటిలో స్టఫ్ చేస్తే డ్రై ఫ్రూట్స్ మోదకాలు రెడీ. లేదంటే దీనిని ఉండలుగా చుట్టుకుని లడ్డూలుగా కూడా ప్రసాదంగా పెట్టవచ్చు. 

Also Read :  గణపయ్యకు లడ్డూల నైవేద్యం.. టేస్టీ కొబ్బరి లౌజ్​లు, నోరూరించే రవ్వ లడ్డూలు.. సింపుల్, టేస్టీ రెసిపీలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget