By: ABP Desam | Updated at : 18 Sep 2022 01:19 PM (IST)
Photo@Pixabay
క్వీన్ ఎలిజబెత్.. కొన్ని దశాబ్దాలపాటు బ్రిటన్ రాణిగా కొనసాగారు. తాజాగా తను చనిపోయారు. 90 ఏళ్లకుపైగా జీవించిన ఈమె తన జీవితంలో ఎన్నో ముఖ్య ఘటనలను చూశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిణామాలను గమనించారు. వాటి గురించి కాసేపు పక్కన పెడితే.. ఆమె ఆహారపు అలవాట్ల గురించి కీలక విషయాలు వెల్లడించారు క్వీన్ మాజీ చెప్ డారెన్ మెక్‌గ్రాడీ.. దివంగత బ్రిటన్ రాణి ఎలిజబెత్ దగ్గర ఎంతోకాలం ఆయన చెఫ్‌గా పని చేశారు. ఆమె ఆహారపు అలవాట్ల గురించి మిగతా వారితో పోల్చితే ఈయనకు పూర్తిగా తెలుసు. ఎన్నో ఏండ్ల పాటు తను వండిన ఆహార పదార్థాలనే ఆమె భోజనంగా తీసుకున్నారు. ఆయన చేసే వంటలను రాణి ఎంతో ఇష్టంతో తినేవారట.
క్వీన్ ఎలిజబెత్ ఫుడ్ మెనూలో పెద్దగా మార్పులు ఉండేవి కాదట. తన జీవితాంతం.. కాస్త అటు ఇటుగా ఒకే ఎప్పుడో ఒకసారి ఏదైనా కొత్త వంటకం రుచి చూసేవారట. రాణికి సంబంధించిన ఫుడ్ విషయంలో కచ్చితమైన ప్రొటోకాల్ ఉండేదట. ఒకవేళ ఫుడ్ మెనూలో కొత్తగా ఏదైనా వంటకాన్ని యాడ్ చేయాలంటే కచ్చితంగా రాణి అనుమతి తీసుకోవాలి. అంతేకాదు.. దాని రెసిపీ గురించి ఆమెకు వివరించాల్సి ఉంటుంది. అప్పుడే ఆయా వంటలకు రాణి ఓకే చెప్పేవారు.
ఒకానొక సమయంలో రాణికి కొత్త వంటకాలను పరిచయం చేయాలి అనుకున్నారట డారెన్ మెక్‌గ్రాడీ. ఓ కొత్త వంటకాన్ని మెనూలో చేర్చడానికి రాణి అనుమతి కోసం నోట్ పంపించారట. ఆ వంటకం పేరు విని క్వీన్ ఎలిజబెత్ గందరగోళానికి గురయ్యారట. ఆ వంటకం పేరు మరేదో కాదు.. ‘వీల్డ్ ఫార్మర్స్ డాటర్’. తొలుత ఈ వంటకం పేరు వినగానే ఆమె ఆశ్చర్యపోయారట. అంతేకాదు.. ఆ వంటకం కూడా రాణిని అంతగా ఆకట్టుకోలేకపోయిందట. ప్రోటోకాల్ ప్రకారం డిష్‌లోని పదార్థాల గురించి ఆమెకు వివరించనందున ఆమె దానిని వెనక్కి పంపించారట. అదే సమయంలో ఆ వంటకం గురించి చెఫ్ కు తిరిగి ఓ నోట్ పంపించారట. అందులో ‘వీల్డ్ ఫార్మర్స్ డాటర్స్ ఏమిటి? లేదా ఎవరు?!" అని రాశారట. వెంటనే దాని గురించి వివరించేందుకు క్వీన్ దగ్గరికి వెళ్లారట చెఫ్ డారెన్.
అటు క్వీన్స్ ఆహార పదార్థాల ఎంపికల గురించి డారెన్ పలు కీలక విషయాలు వెల్లడించారు. క్వీన్ ఎలిజబెత్ చాలా కాలం ఒకే వంటకాన్ని తీసుకునే వారని చెప్పారు "మేము మెనులో కొత్త వంటకాన్ని యాడ్ చేస్తే, దానికి సంబంధించిన వివరాలను క్వీన్‌కి పంపుతాము. అందులో రెసిపీ కూడా వివరిస్తాము. ఆపై ఆమె తనకు కావలసిన ఐటెమ్ ను ఎంచుకుంటారు” అని తెలిపారు. వంటకాల విషయంలో రాణి ఎలిజబెత్ నుంచి తాను ఏనాడు ఎలాంటి ఫిర్యాదులను అందుకోలేదని వెల్లడించారు. తాము చేసిన వంటలను మితంగా తీసుకునే వారని వెల్లడించారు. ఫుడ్‌తో ప్రయోగాలు వద్దని చెప్పే వారన్నారు. ఈ నేపథ్యంలో తమకు పని మరింత ఈజీగా ఉండేదన్నారు.
Curd: పెరుగు మిలిపోయిందా? ఇదిగో ఈ టేస్టీ వంటలు చేసేయండి
Korean Beauty Tips: ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ వినియోగించాలని అనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Apple: రాత్రి వేళల్లో ఆపిల్ పండ్లు తినకూడదా? తింటే ఏమవుతుంది?
Salt: ఆహారంలో ఉప్పు పూర్తిగా మానేస్తే ఎంత ప్రమాదమో తెలుసా?
Heart Diseases: ఎమోషనల్ స్ట్రెస్ వల్ల గుండె ప్రమాదంలో పడుతుంది జాగ్రత్త!
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
/body>