అన్వేషించండి

Cancer: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త, అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావచ్చు!

కొన్ని బాధకరమైన లక్షణాలు కనిపిస్తే క్లోమ గ్రంథి క్యాన్సర్ కి సూచనలు గా భావించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా  వస్తున్న పన్నెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. ఇతర క్యాన్సర్ మాదిరిగానే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ క్లోమ గ్రంథిలో కణాల అసాధారణ పెరుగుదల వల్ల వస్తుంది. ప్యాంక్రియాటిక్ అనేది కడుపులోని ముఖ్యమైన భాగం. చిన్న పేగు దగ్గర ఉండే పొడవైన గ్రంథి ఇది. ఇది జీర్ణక్రియకు సహాయపడే పదార్థాలు లేదా ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో సహాయపడటమే కాకుండా, రక్తప్రవాహంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించే హార్మోన్లను విడుదల చేయడంలో కూడా సహాయపడుతుంది. అటువంటి క్లోమ గ్రంథిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది క్యాన్సర్ బారిన పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

బాధాకరమైన విషయం ఏమిటంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకి వ్యాపిస్తుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ (ACS) ప్రకారం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు తరచుగా పొత్తికడుపు (బొడ్డు), కాలేయానికి వ్యాప్తి చెందుతాయి. ఊపిరితిత్తులు, ఎముకలు, మెదడుతో పాటి ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. క్యాన్సర్ రీసెర్చ్ UK ప్రకారం, శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించే ఈ రకమైన క్యాన్సర్‌ను అధునాతన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు.

వెన్నులో నొప్పి

క్యాన్సర్ ఏ భాగంలో వచ్చిందనే దానిపై ఆధారపడి దాని లక్షణాలు మారిపోతాయి. కానీ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం క్యాన్సర్ కణితి వ్యాప్తి చెందడానికి ముఖ్యమైన సంకేతం నొప్పి. వీటి వల్ల వచ్చే నొప్పి నిరంతరంగా ఉంటుంది. శరీరం ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతం వీపు భాగం. ఈ భాగంలో నొప్పి నిరంతరంగా ఉంటుంది. UK నేషనల్ హెల్త్ సర్వీసెస్ (NHS) ప్రకారం క్యాన్సర్ వ్యాప్తి చెందినప్పుడు ఈ వెన్నునొప్పి విపరీతంగా వస్తుంది. తినేటప్పుడు లేదా పడుకున్నప్పుడు తీవ్రమైన నొప్పికి రావడాన్ని గుర్తించొచ్చు.

కణితి వ్యాప్తి చెందే సంకేతాలు

⦿ ఎముకలు బలహీనపడిపోయి సులభంగా విరిపోతాయి.

⦿ రక్తంలో కాల్షియం స్థాయిలు అనూహ్యంగా పెరిగిపోతాయి. దీన్నే హైపర్‌కాల్సెమియా అంటారు. దీని వల్ల కన్ఫ్యూజన్, అనారోగ్యం, జీర్ణాశయంత్ర సమస్యలు వస్తాయి.

⦿ రక్త కణాల సంఖ్య పడిపోతుంది

⦿ పొత్తి కడుపు నొప్పి వెనుకకు వ్యాపించడం

⦿ కామెర్లు

⦿ అలసట, ఆకలి లేకపోవడం

⦿ మలం రంగు మారిపోవడం

⦿ బరువు తగ్గడం, శరీరంలో రక్తం గడ్డ కట్టడం

⦿ చర్మం దురద పెట్టడం

⦿ మధుమేహం

⦿ వికారం, వాంతులు

కళ్ళు పసుపు రంగులోకి మారపోవడం

ఈ సంకేతాలు కనిపించినంత మాత్రాన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నట్టు అర్థం కాదని మరికొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఇవి కనిపిస్తే క్యాన్సర్ వల్లే కాదు ఇతర పరిస్థితుల వల్ల కూడా సంభవించవచ్చు. అందుకే ఇటువంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే నిర్లక్ష్యం వహించకుండా వైద్యులని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను నివారించడానికి తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

క్యాన్సర్ ప్రమాద కారకాలు..

వయసు: ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ ఎదుర్కొనే చాలా మంది 45 కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లే.

లింగం: మహిళల కంటే పురుషుల్లోనే ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు.

ధూమపానం: పొగ తాగే వారికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది.

స్థూలకాయం: స్థూలకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే బరువు నియంత్రణలో ఉంచుకోవాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: జిడ్డు, మొటిమలతో విసిగిపోయారా? బొగ్గు పొడితో ఇలా చేయండి

Also read: దీర్ఘకాలం పాటూ గర్భనిరోధకాలు వాడడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
NATS: తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Embed widget