అన్వేషించండి

Palak Rice: పోషకాల పాలకూర రైస్, పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ

పాలకూర రైస్ చాలా తక్కువ మంది చేసుకుంటారు, నిజానికి దీని టేస్టు అదిరిపోతుంది.

పాలకూర పెడితే తినే పిల్లలు చాలా తక్కువ. అసలు ఆకుకూరలను చూస్తేనే ముఖం మాడ్చుకుంటారు. తినడానికి ఇష్టపడరు. అలాగని ఎన్నాళ్లు వారికి ఆకుకూరలు పెట్టకుండా ఉంటారు? అందుకే ఆకుకూరలతో రైస్‌లు వండి పెడితే వారికి తెలియకుండానే తినేస్తారు. ఎందుకంటే అది ఆకుకూరతో వండినట్టు వారికి తెలియదు. ముఖ్యంగా పాలకూర కచ్చితంగా తినాల్సిన ఆహారం. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే మీ పిల్లల లంచ్ బాక్సుకు ఇలా సింపుల్ గా పాలకూర రైస్ చేసి పెట్టండి. రుచి అదిరిపోతుంది కాబట్టి తినేస్తారు. కొంతమంది పాలకూరను నేరుగా మిక్సీ చేసి కలుపుతారు. దీనివల్ల పచ్చివాసన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నూనెలో వేయిస్తే పచ్చివాసన పోతుంది.  

కావాల్సిన పదార్థాలు
బాస్మతి అన్నం - ఒక కప్పు
పాలకూర తరుగు - ఒక కప్పు
ఉల్లితరుగు (నిలువుగా) - పావు కప్పు
పచ్చి మిర్చి - రెండు
పచ్చి బఠానీలు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - అరస్పూను

తయారీ ఇలా...
1. ముందుగా బాస్మతి రైస్ వండి పెట్టుకోవాలి. 
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో పాలకూర ఆకులు వేసి వేయించాలి. 
3. పాలకూరలోని నీళ్లు దిగి, ఇంకిపోయాక ఆకులు దగ్గరగా అవుతాయి. 
4. అప్పుడు వాటిని మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. 
5. ఇప్పుడు అదే కళాయిలో నెయ్యి వేసుకోవాలి. 
6. ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, పచ్చి బఠానీలు వేసి వేయించాలి.
7. అవన్నీ వేగాక మెత్తని పేస్టులా చేసుకున్న పాలకూర పేస్టు, ఉప్పు వేసి కలుపుకోవాలి. 
8. అన్నీ వేగాక ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని కలిపేసుకోవాలి. అంతే పాలకూర రైస్ సిద్ధమైనట్టే. 

తినడం వల్ల కలిగే లాభాలు
 పాలకూర తినడం వల్ల చాలా ఆరోగ్యలాభాలు కలుగుతాయి. విటమిన్ ఎ, సి లు పుష్కలంగా లభిస్తాయి. చర్మం కాంతిమంతంగా మారుతుంది. మచ్చల్లాంటివి రాకుండా ఉంటాయి. చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా పాలకూరలోని పోషకాలు తగ్గిస్తాయి. అధికరక్తపోటు ఉన్న వారికి పాలకూర చాలా మేలు చేస్తుంది. పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తసరఫరా కూడా మెరుగుపడుతుంది. దీనిలో విటమిన్ కె లభిస్తుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం పోకుండా త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. అలాగే ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది. ఇది జీర్ణసమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది. మలబద్ధకం రాకుండా అడ్డుకుంటుంది. బరువు పెరగకుండా అడ్డుకుంటుంది. 

Also read: మీ డైట్‌లో ఈ ఆరు సూపర్ ఫుడ్స్ చేర్చుకుంటే ఆరోగ్యానికి తిరుగే ఉండదు

Also read: బియ్యపు నీళ్లతో శుభ్రం చేసుకుంటే నిజంగానే జుట్టు బాగా పెరుగుతుందా? పట్టుకుచ్చులా మెరుస్తుందా?

టాప్ హెడ్ లైన్స్

Weight Loss Goals : అన్నానికి బదులుగా డిన్నర్​లో ఇవి తినండి.. కడుపు నిండటంతో పాటు బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయి
అన్నానికి బదులుగా డిన్నర్​లో ఇవి తినండి.. కడుపు నిండటంతో పాటు బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయి
Sabudana Khichdi : టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం కిచిడీ.. ఇలా చేస్తే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా
టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం కిచిడీ.. ఇలా చేస్తే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా
Janmashtami Fasting : కృష్ణాష్టమి 2026 ఉపవాస సమయంలో యాక్టివ్​గా ఉండటానికి, నీరసాన్ని నివారించడానికి ఏమి తినాలి? 
కృష్ణాష్టమి 2026 ఉపవాస సమయంలో యాక్టివ్​గా ఉండటానికి, నీరసాన్ని నివారించడానికి ఏమి తినాలి? 
Heart Attack Risk : జిమ్‌లలో పెరుగుతోన్న యువకుల ఆకస్మిక మరణాలు.. నిజాన్ని వెలుగులోకి తెచ్చిన ICMR నివేదిక 
జిమ్‌లలో పెరుగుతోన్న యువకుల ఆకస్మిక మరణాలు.. నిజాన్ని వెలుగులోకి తెచ్చిన ICMR నివేదిక 

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Embed widget