Optical Illusion: మీరు తెలివైన వారైతే 15 సెకండ్లలో ఈ బొమ్మలో ఉన్న గ్రహాంతరవాసిని గుర్తించండి
మీరు తెలివైన వారు కాదో తేల్చే టెస్ట్ ఇది. పదిహేను సెకండ్లలో మీ ఐక్యూ లెవెల్ తేల్చేయవచ్చు.
మీ ఐక్యూ, పరిశీలనా సామర్థ్యం, నైపుణ్యాలు పరీక్షించడానికి ఈ పజిల్ చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇచ్చిన బొమ్మను చూడండి. దాన్ని చూసి కేవలం 15 సెకండ్లలో ఆ చిత్రంలో ఉన్న గ్రహాంతరవాసిని గుర్తించండి. ఎక్కువ సమయం తీసుకుంటే ఎవరైనా సులువుగానే గుర్తిస్తారు, కానీ కేవలం 15 సెకండ్లలో మాత్రమే గుర్తించాలి. అలా గుర్తించిన వ్యక్తి ఐక్యూ లెవెల్ ఎక్కువ అని అర్థం.
చిత్రంలో ఇద్దరు వివాహం చేసుకుంటున్నారు. మరొక ముగ్గురు చూస్తున్నారు. ఆ ఐదుగురిలో ఒకరు మాత్రమే గ్రహాంతరవాసి. మిగతా అందరూ సాధారణ మనుషులే. ప్రతి ఒక్కరినీ నిశితంగా 10 సెకండ్ల పాటు చూస్తే మీరు గ్రహాంతరవాసి ఎవరో చెప్పేస్తారు. కానీ అలా ప్రతి ఒక్కరిని 10 సెకండ్లు చూస్తే 50 సెకండ్ల సమయం పడుతుంది. మీరు జవాబు చెప్పడానికి ఒక నిమిషం సమయం పట్టే అవకాశం ఉంది. కానీ 15 సెకన్లలోనే చెప్పాలి. అలా చెబితే మీ తెలివితేటలు ఎక్కువ అని నిరూపణ అయినట్టే.
జవాబు ఇది
గ్రహాంతరవాసి ఎవరో 15 సెకండ్లలో కనిపెట్టిన వారికి శుభాకాంక్షలు. ఇక ఎక్కువ సమయం తీసుకుని జవాబు కనిపెట్టిన వారికి కూడా కంగ్రాట్స్. జవాబు కనిపెట్టలేని వారి కోసం సమాధానం చెబుతున్నాం. ఐదుగురిలో వధువు చేతులు చూడండి. ఆమెకి మూడు చేతులు కనిపిస్తున్నాయి. అంటే ఆమెనే గ్రహాంతరవాసి అని అర్థం.
ఐక్యూ అంటే ఏమిటి?
ఇంటెలిజెంట్ కోషియంట్‌కు సంక్షిప్త రూపమే IQ. ఇది ఒక వ్యక్తి తెలివితేటలను, మేధస్సును అంచనా వేసే పరీక్ష. మొదటి సారి 110 ఏళ్ల క్రితం 1912లో ఈ పదాన్ని వాడారు. ఒక వ్యక్తి ఆలోచించే సామర్థ్యాన్ని, సమస్యలను పరిష్కరించే సత్తాను, తెలివితేటలను కొలవడానికి ఉపయోగించే సాధనమే ఈ ఇంటిలిజెంట్ కోషియంట్. వ్యక్తి తెలివితేటలను, సామర్థ్యాన్ని వారి వయసు ఆధారంగానే లెక్కిస్తారు.
ఎలా లెక్కిస్తారు?
కొన్ని ప్రశ్నలు ఇవ్వడం ద్వారా ఇంటిలిజెంట్ కోషియంట పరీక్షను నిర్వహిస్తారు. ఆ పరీక్షలో పాల్గొన్న వ్యక్తి వయస్సు 15 ఏళ్లు అనుకుందాం. ఐక్యూ టెస్ట్ లో అతనికి వచ్చిన పాయింట్లు 18 అనుకుందాం . అంటే అతని శారీరక వయస్సు 15 ఏళ్లు అయితే, మానసికపరమైన వయస్సు 18 ఏళ్లు. ఇప్పుడు అతని ఇంటిలిజెంట్ కొషియంట్ లెక్కించడానికి 18 / 15 X 100 చేయాలి. అంటే అతని ఐక్యూ 120.
ఎంత ఉంటే తెలివైనవారు?
ఒక సాధారణ వ్యక్తి ఐక్యూ 100 ఉంటుంది. వంద కన్నా తక్కువ స్కోరు ఉంటే ఆ మనిషి తక్కువ తెలివితేటలు కలవాడని అర్థం. అదే వంద కన్న ఎక్కువ ఉంటే ఆ మనిషి తెలివైనవాడు అని అర్థం. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ఐక్యూ కలిగిన వ్యక్తిగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి చెప్పుకుంటారు. అలాగే ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఎక్కువ ఐక్యూ గల వ్యక్తిగా ప్రాచుర్యం పొందారు. వీరిద్దరికి ఐక్యూ స్కోర్ 160 వచ్చింది. ఇంటిలిజెంట్ కోషియంట్‌లో 145 స్కోర్ దాటితే వాళ్లని జీనియస్‌లని చెబుతారు. 70 కన్నా తక్కువ ఉందంటే మానసికపరమైన సమస్యలు ఉన్నట్టు లెక్క. 85 నుంచి 100 వరకు స్కోర్ వస్తే ఆ వ్యక్తి యావరేజ్ తెలివితేటలు ఉన్నవాడని అర్థం.
Also read: ఏడాదికి ఒకసారి మాత్రమే పండే పంట హిమాలయన్ వెల్లుల్లి, దీని ధర అదిరిపోతుంది