Omelette Curry : 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఆమ్లెట్ కర్రీ.. టేస్టీగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ ఇదే
5 Minute Omelette Curry : 5 నిమిషాల్లో కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఎగ్స్‌తో చక్కగా ఆమ్లెట్ కర్రీ చేసుకుని తినవచ్చు. చాలా సింపుల్గా తక్కువ సమయంలో చేసుకోగలిగే రెసిపీని ఇప్పుడు చూసేద్దాం.

Omelette Curry Recipe in 5 Minutes : గుడ్లను వివిధ రూపాల్లో తీసుకుంటారు. ఉడకబెట్టి, కర్రీలు, ఆమ్లెట్ రూపంలో వైరటీగా ట్రై చేస్తారు. అయితే ఈసారి టేస్టీగా, వైరటీగా తినాలనుకుంటే గుడ్లతో ఆమ్లెట్ కర్రీ ట్రై చేయండి. తక్కువ సమయంలో ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఈ కర్రీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉదయం బిజీగా ఉన్నప్పుడు లేదా వెంటనే లంచ్, డిన్నర్ సిద్ధం చేసుకోవాలనుకున్నప్పుడు ఇది మంచి ఆప్షన్. మరి 5 నిమిషాల్లో ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
గుడ్లు - 3
ఉల్లిపాయ - 1 చిన్నది
పచ్చిమిర్చి - 1
పసుపు - పావు టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెబ్బ
వెల్లుల్లి - 4
ఉల్లిపాయ - 1 పెద్దది
కారం - 1 టేబుల్ స్పూన్
పసుపు - అర టీస్పూన్
ధనియాల పొడి - 2 టీస్పూన్స్
గరం మసాలా - 2 టీస్పూన్స్
ఉప్పు - రుచికి తగినంత
Also Read : గుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ.. అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది
ఆమ్లెట్ తయారీ విధానం
ఒక గిన్నెలో 3 గుడ్లు పగలగొట్టి తీసుకోవాలి. అందులో చిన్న ఉల్లిపాయను సన్నగా తరిగి, ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేయాలి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, అర టీ స్పూన్ ఉప్పు వేసి గుడ్లను బాగా గిలకొట్టాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి మీడియం మంటపై ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు రెబ్బలు, నాలుగు వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి వేసి వేయించుకోవాలి.
అనంతరం మిగిలిన పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి వేసి.. ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్ల ధనియాల పొడి, రెండు టీ స్పూన్ల గరం మసాలా, అర టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా గిలకొట్టి పెట్టుకున్న గుడ్ల మిశ్రమాన్ని ఈ మసాలాపై పోయాలి. పాన్ మొత్తం సమంగా పరుచుకునేలా చేసి మంటను పూర్తిగా తగ్గించాలి.
Also Read : పల్లీలతో బెండకాయ ఫ్రై.. జిగురు తగ్గి టేస్టీగా ఉండాలంటే ఇలా చేసుకోండి, రెసిపీ ఇదే
ఇలా ఉడికించండి..
చిన్న మంటపై సుమారు నిమిషం పాటు లేదా కిందిభాగం గట్టిపడే వరకు ఉడికించాలి. అనంతరం జాగ్రత్తగా ఆమ్లెట్‌ను తిప్పాలి. మరోవైపు ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేకుండా స్టవ్‌ను ఆఫ్ చేయాలి. అంతే వేడి వేడి 5 Minutes Omelette Curry రెడీ. దీనిని అన్నం, రోటీ, చపాతీతో సర్వ్ చేసుకోవచ్చు. తక్కువ సమయంలో తయారయ్యే ఈ ఎగ్ రెసిపీని బిజీగా ఉండే రోజుల్లో కచ్చితంగా ట్రై చేయండి.
Also Read : నోరూరించే పాలకూర పప్పు రెసిపీ.. కుక్కర్లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























