New Covid Variant KP.2 : కొవిడ్ న్యూ వేరియంట్ KP.2 వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఉంది.. మరో వేవ్ వచ్చే సూచనలున్నాయా?
KP.2 Symptoms : కొవిడ్‌ను గుర్తుచేస్తూ.. వివిధ వేరియంట్ల రూపంలో రిమైండర్లు ఇస్తూనే ఉంది. తాజాగా KP.2 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది. దీనిగురించి నిపుణులు ఏమంటున్నారంటే..
COVID New Variant Increasing in US : కరోనా వివిధ వేరియంట్ల రూపంలో ప్రజల ఆరోగ్యానికి టెస్ట్‌లు పెడుతోంది. ఓ వేరియంట్ పోయే సరికి.. మరో వేరియంట్‌గా రూపాంతరం చెంది ప్రజారోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం కోవిడ్ KP.2 వేరియంట్ రూపంలో ఉంది. అయితే ఈ వేరియంట్ మరో వేవ్‌ని ప్రేరేపించే అవకాశం లేదని.. చైనా తెలిపింది. ఈ వేరియంట్‌ను జనవరిలో మొదటిసారిగా కనుగొన్నారు. KP.2 ఓమిక్రాన్ ఆఫ్షూట్ వేరియంట్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది.
చైనాలో కూడా KP.2 వేరియంట్‌ను గుర్తించారు. మార్చిలో మొదటిసారిగా దీనిని గుర్తించగా.. మే 12వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు 25 నమోదయ్యాయి. అక్కడి వారాంతపు నివేదికలలో KP.2 కేసులు 0.05 శాతం నుంచి 0.3 శాతం నిష్పత్తి మాత్రమే ఉంది. దానిని బట్టి చూసుకుంటే ఇది అనుకున్నదానికన్నా చాలా తక్కువస్థాయిలో ఉందని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ టీమ్ అధికారికంగా తెలిపింది.
వేవ్ వచ్చే ఛాన్సే లేదు
ప్రపంచవ్యాప్తంగా కొత్త కొవిడ్ 19 వేరియంట్ KP.2.. చైనాలో కొత్త ఇన్ఫెక్షన్ వేవ్‌ను ప్రేరేపించే అవకాశం లేదని.. ఇప్పటికే అది తక్కువ స్థాయిలలో ఉంది చైనా వెల్లడించింది. కొన్ని స్థానిక కేసులు మాత్రమే నమోదయ్యాయని ఆ దేశ అధికారులు చెప్తున్నారు. KP.2 ఒమెక్రాన్ జాతికి చెందింది. దీనిని మొదటిసారిగా ఇండియాలోనే జనవరిలో కనుగొన్నారు. ప్రస్తుతం ఇండియాలో వందకు పైగా KP.2 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ అంతర్జాతీయంగా వ్యాపిస్తూ.. యునైటెడ్ స్టేట్స్లో కాస్త ఎక్కువగా విజృంభిస్తుంది.
అక్కడంతా బాగానే ఉందట
చైనాలో ప్రస్తుతం ముందు వేరియంట్ అయిన JN.1 కేసులు తగ్గుతున్నాయని తెలిపింది. KP.2 కేసులు మాత్రం న్యూ ఇన్ఫెక్షన్ వేవ్‌ను తీసుకువచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో JN.1 ఎక్కువగా ఉంది. అంతేకాకుండా JN.1 తో పోల్చితే KP.2 వేరియంట్‌కి గణనీయమైన మార్పులు లేవని నివేదికలు సూచిస్తున్నాయి. KP.2 వేరియంట్‌ను మే 3 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్ 19 వేరియంట్ల జాబితాలో చేర్చింది.
యూఎస్‌లోనే ఎక్కువ కేసులు
KP.2 వేరియంట్ చైనాలో కాదు కానీ.. USలో ప్రధానంగా ఉంది. ఇప్పటివరకు 28.2 శాతం ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. మార్చి మధ్యకాలంలో 1.4శాతం నుంచి ఈ వేరియంట్ పెరిగిందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదించింది. ఈ వేరియంట్ యూకే, ఆస్ట్రేలియా వంటి పాశ్చాత్య దేశాలలో కూడా విస్తరిస్తోంది. KP.2 కొవిడ్ 19 వేరియంట్ల సమూహానికి చెందినది. శాస్త్రవేత్తలు వాటిని సాంకేతిక పేర్ల తర్వాత "FLiRT" అని పిలుస్తున్నారు. దీనిలో వచ్చే వేరియంట్ జాతులన్నీ JN.1 వేరియంట్ వారసులుగా చెప్తున్నారు.
లక్షణాలు ఇవే..
కొవిడ్ వేరియంట్‌కు ప్రాధాన్యత, పర్యవేక్షణ అవసరమని.. ప్రజారోగ్య అధికారులకు సూచించడానికి దీనిని ఉపయోగిస్తారు. మునుపటి వేరియంట్ల మాదిరిగానే.. ఓ వ్యక్తిలో KP.2 వేరియంట్ సోకితే దాని లక్షణాలు కనిపించడానికి 5 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు పడుతుంది. కొన్ని సందర్భాల్లో లక్షణాలు త్వరగా కనిపించవని పరిశోధకులు తెలుపుతున్నారు.
Also Read : అందుబాటులోకి డెంగ్యూ వ్యాక్సిన్.. తాజాగా ప్రీక్వాలిఫై చేసిన WHO