అన్వేషించండి

Monkey Fever : మంకీ ఫీవర్​తో 29 ఏళ్ల వ్యక్తి మృతి.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

Monkey Fever Death : ఈ మధ్యకాలంలో కొత్త వైరస్లు.. ఎప్పుడో వచ్చి ఆగిపోయిన వ్యాధులు బయటకి వస్తున్నాయి. అలాగే మంకీ ఫీవర్​ కూడా వచ్చింది. మరి దాని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం. 

Monkey Fever (KFD) : కర్ణాటకలోని ఓ వ్యక్తి మంకీ ఫీవర్​తో మృతి చెందాడు. కర్ణాటకలో క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ లేదా కోతి జ్వరంతో 29 ఏళ్ల వ్యక్తి మరణించడంతో.. ఈ వ్యాధిపై అందరి దృష్టి మళ్లీంది. పరిస్థితి తీవ్రమయ్యే వరకు ఈ అనారోగ్యం గుర్తించడమే కారణంగా చెప్తున్నారు నిపుణులు. తీర్థహళ్లి తాలూకా నివాసి అయిన యువకుడు జనవరి 28న ఉడిపి జిల్లాలోని ఒక ఆసుపత్రిలో మంకీ ఫీవర్​తో చికిత్స పొందుతూ మరణించాడు.

సాధారణంగా ఇన్ఫెక్షన్ వచ్చిన వారంలోపు KFD గుర్తిస్తే.. రోగి బతికే అవకాశం దాదాపు 100 శాతం ఉంటుందని కర్ణాటక ఆరోగ్య శాఖ కమిషనర్ గురుదత్త తెలిపారు. లక్షణాలు కనిపించిన వెంటనే.. అధికారులు రోగిని ఆసుపత్రికి తరలించారని.. అయితే ఒక్క రోజులోనే KFDని నిర్ధారించారని, వెంటనే ఆస్పత్రికి రిఫర్ చేశామని తెలిపారు. కొన్ని రోజుల వరకు పరిస్థితి స్థిరంగానే ఉంది కానీ.. అకస్మాత్తుగా క్షీణించడంతో మృతి చెందినట్లు వెల్లడించారు. 

మంకీ ఫీవర్ ఎలా వస్తుంది?

మంకీ ఫీవర్ అనేసరికి చాలామంది ఇది కోతుల నుంచి వస్తుంది అనుకుంటారు. కానీ ఇది కోతుల నుంచి మనుషులకు నేరుగా వ్యాపించదని డాక్టర్ ఐశ్వర్య ఆర్ తెలిపారు. ఈ వ్యాధి హేమాఫిసాలిస్ స్పినిగెరా అనే నిర్దిష్ట రకమైన ఫారెస్ట్ టిక్ ద్వారా వ్యాపిస్తుంది. ఉడుతలు, ఎలుకలు వంటివి జంతువులు సంక్రమణకు మూలాలు అని తెలిపారు. వాటి కాటు ద్వారా అనారోగ్యంతో లేదా చనిపోయిన కోతులు ద్వారా వ్యాధి బారిన పడతారు. అయితే ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి ఉండదు. సాధారణంగా ఈ కేసులు అక్టోబర్, నవంబర్​లలో మొదలై.. జనవరి, ఏప్రిల్ నాటికి పెరుగుతాయని తెలిపారు. 

మంకీ ఫీవర్​ పెరగడానికి కారణాలు ఏంటి?

నిపుణుల ప్రకారం.. రక్షణ లేకుండా జంతువులను పట్టుకోవడం, అడవుల్లోకి వెళ్లడం లేదా వైరస్ సోకిన కోతులు చనిపోయిన ప్రాంతాలలో నివసించడం వల్ల KFD ప్రమాదం పెరుగుతుంది. 

మంకీ ఫీవర్ లక్షణాలు ఏమిటి?

KFD లక్షణాలు సాధారణంగా 3 నుంచి 8 రోజుల్లో కనిపిస్తాయి. అవి తీవ్రమైన చలి, తీవ్రమైన తలనొప్పితో ప్రారంభమవుతాయి. దీని తరువాత ముక్కు, గొంతు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, లో బీపీ, ప్లేట్​లెట్స్ తగ్గడం, కొన్ని సందర్భాల్లో నాడీ సంబంధిత లక్షణాలు కూడా కనిపించవచ్చు. అలాగే వాంతులు, వికారం, కండరాల నొప్పులు, మానసిక సమస్యలు, వణుకు, కంటి చూపు తగ్గడం, తీవ్రమైన తలనొప్పులు దీని లక్షణాలు. 

మంకీ ఫీవర్ ఎప్పుడు ప్రాణాంతకమంటే.. 

మంకీ ఫీవర్ మరణాల రేటు 2 నుంచి 10 శాతం మధ్య ఉంటుంది. వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే.. అంత త్వరగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడుకోవచ్చు. సకాలంలో చికిత్సతో చేస్తే పూర్తిగా కోలుకుంటారు.

మంకీ ఫీవర్ ట్రీట్​మెంట్

మంకీ ఫీవర్​కి నిర్దిష్టమైన చికిత్స లేదు. కానీ చికిత్సలో IV ద్రవాలను ఇవ్వడం, రక్తస్రావాన్ని నిర్వహించడం, పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు. ప్రోటీన్-రిచ్ డైట్, హైడ్రేటెడ్​గా ఉండడం కూడా ముఖ్యమే. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Coconut Laddu Recipe : బెల్లం పాకంతో కొబ్బరి లడ్డూలు.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
బెల్లం పాకంతో కొబ్బరి లడ్డూలు.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
Excessive Body Heat : బాడీలో హీట్‌ ఎక్కువైతే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే?
బాడీలో హీట్‌ ఎక్కువైతే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే?
Beerakaya Thokka Pachadi : బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి రెసిపీ.. వేడి వేడి అన్నంలో కలిపి తింటే అదిరిపోతుంది
బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి రెసిపీ.. వేడి వేడి అన్నంలో కలిపి తింటే అదిరిపోతుంది

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget