అన్వేషించండి

Snake Man: స్నేక్ మ్యాన్, పాములా చర్మాన్ని వదులుతున్న యువకుడు

ఓ యువకుడు పాములా చర్మాన్ని వదులుతున్నాడు. ప్రతి వారం అతడి చర్మం పొడిలా రాలిపోతుంటుంది.

పాములు కుబుసం వదలడం గురించి మీరు వినే ఉంటారు. అవి ఎప్పటికప్పుడు వాటి చర్మాన్ని వదిలేస్తూ.. కొత్త చర్మాన్ని పొందుతాయి. బీహార్‌కు చెందిన ఈ యువకుడి పరిస్థితి కూడా అంతే. కుబుసం వదలడమనేది పాముల్లో సహజంగా జరిగే ప్రక్రియ. అదే మనుషుల్లో జరిగితే.. అది అసహజం. ఆరోగ్యానికి అంత్యంత ప్రమాదకరం. ప్రస్తుతం ఈ యువకుడు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. ఈ సమస్య వల్ల అతడు నలుగురిలో తిరిగలేపోతున్నాడు.. ఇతరులతో కలవలేకపోతున్నాడు. అయితే, మనసులో ఎంత బాధ ఉన్నా.. అధైర్యపడకుండా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ యువకుడు. 

25 ఏళ్ల మజిబర్ రెహ్మాన్ మాలిక్ అనే ఈ యువకుడు ఎరిత్రోడెర్మా(erythroderma) అనే ప్రాణాంతక చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. దీనివల్ల అతడి చర్మం వాచిపోతూ పొట్టుగా రాలిపోతుంటుంది. ఫలితంగా చర్మం ఎర్రగా కమిలిపోతుంది. ఈ పరిస్థితిని ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తుంటారు. మాలిక్‌కు పుట్టక నుంచే ఈ సమస్య మొదలైంది. ప్రతివారం అతడు కుబుసం విడుస్తున్నట్లుగా చర్మాన్ని వదులుతాడు. చలికాలం వచ్చిందంటే మరింత నరకం. అతడ చర్మం పొడిగా మారిపోయి చిట్లిపోతుంది. 

స్థానికంగా ఎన్నో హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ కోసం ప్రయత్నించాడు. అయితే, ప్రతి డాక్టర్ ఒకటే మాట. ‘‘ఇక్కడి ఆసుపత్రుల్లో నీ సమస్యకు ట్రీట్మెంట్ లేదు. పెద్ద ఆసుపత్రులకు వెళ్లు’’ అని సూచించేవారు. కానీ, ఆర్థిక సమస్యల వల్ల అతడు, అతడి కుటుంబం ఆ ప్రయత్నం చేయలేదు. మాలిక్‌కు స్కూల్‌కు వెళ్లడమంటే చాలా ఇష్టం. అయితే, అతడి రూపాన్ని చూసి స్కూల్ పిల్లలు భయపడుతున్నారనే కారణంతో చదువుకు కూడా దూరమయ్యాడు. 

Also Read: సూపర్ మ్యాన్ సిండ్రోమ్, ఇది కూడా వ్యాధే - మీ నాన్నగారిలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

అయితే, తనకు ఉన్న సమస్య గురించి ఆలోచిస్తూ బాధతో కుమిలిపోవడం మాలిక్‌కు ఇష్టం లేదు. ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చేస్తూ తన పరిస్థితి గురించి ఇతరులకు వివరిస్తున్నాడు. ఈ చర్మ సమస్య వల్ల మాలిక్ కళ్లు ఎర్రగా మారిపోయాయి. ఒక కంటికి చూపు కూడా పోయింది. ఇంకో కన్ను కూడా క్రమేనా చూపును కోల్పోతున్నట్లు మాలిక్ చెప్పాడు. ‘‘నా సమస్యను నేను బలంగా మార్చుకున్నాను. మీకు ఏమైనా సమస్య ఉంటే కుమిలిపోకూడదు. ఇతరులు ఏమనుకుంటున్నారనేది నేను పట్టించుకోను. నా కుటుంబం, నా స్నేహితులు నాకు తోడుగా ఉన్నారు. కాబట్టి, నేను హ్యాపీగానే ఉన్నాను’’ అని మాలిక్ తెలిపాడు. అయితే, మాలిక్‌కు చికిత్స సాధ్యం కాదా? చర్మ వ్యాధి నిపుణులు అతడి సమస్యను పరిష్కరించలేరా? నిపుణులు ముందుకొచ్చి.. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఈ యువకుడిని ఆదుకోవాలని కోరుకుందాం. 

Also Read: 11 మినిట్స్, 7 హవర్స్, త్రిపుల్ 20 - ఇవి మీ ఆయుష్సును ఏ విధంగా నిర్ణయిస్తాయో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Animal Park Update : 'యానిమల్' సీక్వెల్​పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడో తెలుసా?
'యానిమల్' సీక్వెల్​పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడో తెలుసా?
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
Embed widget