అన్వేషించండి

Makeup Trends 2023 : సోషల్ మీడియాలో బాగా వైరల్​ అవుతున్న మేకప్ ట్రెండ్స్ ఇవే.. మీరు ఇంట్లోనే ట్రై చేయొచ్చు

Most Hyped Makeup Trends : సోషల్ మీడియా యుగంలో కంటికి ఇంపుగా లేదా కొత్తగా ఏది కనిపించినా అది ట్రెండే అవుతుంది. అలాగా ఈ సంవత్సరం మేకప్​లో కూడా కొన్ని ట్రెండ్స్ వచ్చాయి.

Biggest Makeup Trends 2023 : ఇన్​స్టా, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువయ్యే కొద్ది.. స్క్రీన్​మీద అందంగా కనిపించాలనే కోరికతో చాలా మంది మేకప్​ను ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వాటిలో ప్రో అవ్వడమే కాకుండా.. కొత్తకొత్త పద్ధతులు, ట్రెండ్స్ ట్రై చేసి.. అందరికంటే భిన్నంగా, అందంగా కనిపించాలని కోరుకుంటున్నారు. రోజుకో కొత్త రంగు మార్చితేనే కదా.. లుక్స్, కంటెంట్ డిఫరెంట్​గా అనిపించేది. అయితే 2023లో ఇలా మేకప్​లో జరిగినా మార్పులు.. టాప్​గా నిలిచిన మేకప్​ ట్రెండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ సంవత్సరంలో కాస్మెటిక్ ప్రభావం ఇన్​ఫ్లూయన్సర్స్​పై, వారి వల్ల అభిమానులపై బాగానే ప్రభావం పడింది. ముఖ్యంగా ముఖానికి వేసుకునే మేకప్, సర్జరీలు, ట్రీట్​మెంట్స్​పై చాలా అవగాహన వచ్చేసింది. ఇది కేవలం సౌందర్యంపైన మాత్రమే ప్రభావం చూపలేదు. వ్యక్తిత్వం, సృజనాత్మకత, అలంకరణ కళాత్మకత వంటి వాటిపై కూడా తీవ్ర ప్రభావం చూపించాయి. అయితే 2023లో బాగా ప్రాచూర్యం పొందిన ట్రెండ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

గోల్డెన్ అవర్ గ్లామ్

సాధారణంగా ఫోటోలు, వీడియోల కోసం గోల్డెన్ అవర్ కోసం వెయిట్ చేస్తారు. అయితే ఈ బ్యూటీ ట్రెండ్ గోల్డెన్ అవర్ సమయంలో చర్మానికి వచ్చే మెరుపుతో ప్రేరణ పొందింది. ఇది మీకు వార్మ్ టోనింగ్​ ఇచ్చి.. మీ స్కిన్ మెరిసేలా చేస్తుంది. అయితే ఈ లుక్​ కావాలానుకుంటే సాధారణంగా మనం ఉపయోగించే బ్లష్, బేస్​ తెలుపు, పింక్​ టోన్​లకు బాయ్ చెప్పాలి. గోల్డెన్ అవర్ గ్లామ్​ కోసం వార్మ టోన్​ హైలైటర్ యూజ్ చేస్తారు. పేరుకు తగ్గట్లుగా మారేందుకు ఎక్కువ హైలైట్, బ్రోంజర్ ఉపయోగిస్తారు.

మెటాలిక్ షేడ్స్

కొంచెం మెరుపు, మెటాలిక్ మేకప్​ లుక్​తో ఏ రూపానికైనా తక్షణమే లుక్​ వస్తుంది. ప్రతి రెప్పపాటుతో కాంతిని ఆకర్షించే, మెరిసే ఐషాడోల నుంచి.. దృష్టిని ఆకర్షించే, మిరిమిట్లుగొలిపే మెటాలిక్ లిప్​స్టిక్​ల వరకు ఉండే ఈ ట్రెండ్.. అన్నీ సీజన్​లలోనూ హైలైట్​గా నిలిచింది. 
మెటాలిక్ సిల్వర్, గోల్డెన్ బ్లష్, లావెండర్​ లేదా కూల్ బ్లూస్​లో షేడ్స్​ను మిక్స్ చేసి ఈ మేకప్​ లుక్​ని క్రియేట్ చేస్తున్నారు. ఇది ఫెస్టివల్ టైమ్​లో మీ ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది. 

బోల్డ్ ఐ బ్రోస్

ఈ మధ్య కాలంలో కనుబొమ్మల మీద చాలా మంది దృష్టి పెడుతున్నారు. ఒకప్పుడు మేకప్​తో వాటిని సెట్ చేసుకుంటే.. ఇప్పుడు కాస్మోటిక్ ట్రీట్​మెంట్స్​తో వాటిని తీర్చిదిద్దుతున్నారు. ఇది బోల్డ్, చక్కటి ఆహార్యాన్ని అందిస్తుంది. బోల్డ్ ఐ బ్రోస్​ని సహజమైన ఆకృతిలో.. మొఖానికి తగినట్లు ఇస్తూ కూడా మేకప్​ లుక్​ని సెట్​ చేసుకుంటున్నారు. అందుకే ఇది బాగా ట్రైండ్ అయింది. ఇన్​ఫ్లూయన్సర్స్​, సెలబ్రెటీల వల్ల ఇది సాధారణ ప్రజలలోకి కూడా బాగా వెళ్లిందనే చెప్పుకోవాలి. 

బోల్డ్ బ్లష్

బ్లష్ అనేది ముఖంపై పింక్ గ్లోని ఇస్తుంది. ఇది ముఖానికి శక్తివంతమైన, గొప్పరంగును అందిస్తాయి. ఈ లుక్​ కావాలనుకునేవారు కచ్చితంగా తమ రంగుకు సరిపోలే వాటిని మాత్రమే ఎంచుకోవాలి. లేదంటే మీ ముఖం చాలా ఎబ్బెట్టుగా మారిపోతుంది. మీరు సాధారణంగా వేసుకునే బ్లష్ కంటే కాస్త ఎక్కువగా మీరు బ్లష్ చేసుకోవచ్చు. మీరు బోల్డ్ బష్ చేసుకోవడం వల్ల కలిగే మరో బెనిఫిట్ ఏంటంటే.. మీరు సన్​బర్న్ కాకుండా బీచ్​ గ్లోని పొందవచ్చు. 

ఫుడ్ థీమ్ మేకప్

తీసుకునే ఆహారం నుంచి ప్రేరణ పొంది ఫుడ్ థీమ్ మేకప్​ను ట్రెండ్​లోకి తీసుకొచ్చారు. ఇది కూడా గ్లామర్ ప్రపంచంలో బాగానే ట్రెండ్ అవుతుంది. మొదట్లో ఈ మేకప్ ఔత్సాహికులకు కాస్త కష్టంగానే ఉండేది. కానీ ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది. తమ సౌందర్య ఎంపికల ద్వారా తమకు నచ్చిన ఫుడ్స్​పై ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. కనుబొమ్మలు, పెదవుల నుంచి పండ్ల నుంచి ప్రేరణ పొంది.. ఎస్ప్రెస్సో షాట్​ల పేరుతో మేకప్ చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్​ మీ మేకప్​ దినచర్యలో కాస్త సృజనాత్మకతను జోడిస్తుందనే చెప్పవచ్చు.

Also Read : ఇంట్లోనే పార్లల్​​లాంటి వాక్సింగ్.. స్మూత్ స్కిన్​ కోసం ఇలా చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget