Lung Cancer : స్మోకింగ్ అలవాటు లేకపోయినా లంగ్ క్యాన్సర్ వస్తుందా? అదెలా సాధ్యం?
Lung Cancer: ధూమపానం చేయనివారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకుతుంది. ఇటీవల కాలంలో నాన్ స్మోకర్స్ కు ఈ ప్రమాదం పెరుగుతోంది.
Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న క్యాన్సర్లలో ఒకటి. ధూమపానం చేసేవారిలో ఈ రకమైన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి. అయితే తాజాగా అందుతున్న రిపోర్టులు ఆందోళన కలిగిస్తున్నాయి. ధూమపానం చేయనివారిలో కూడా ఈ ప్రమాదం వేగంగా పెరుగుతోందని పేర్కొంది. ఇది మాత్రమే కాదు, 50 - 60 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ధూమపానం చేయనివారిలో నమోదవుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రతి సంవత్సరం మిలియన్ల మంది మరణానికి కారణమవుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణంగా రెండు ప్రధాన రకాలుగా వర్గీకరించారు. నాన్⦿ స్మాల్ సెల్ కార్సినోమా (NSCLC), చిన్న కణ క్యాన్సర్ (SCLC). వీటిలో NSCLC ఎక్కువ ప్రమాదకారి అని వైద్యులు చెబుతున్నారు. మీరు ధూమపానం చేయకపోయినా, ఈ క్యాన్సర్ ప్రమాదం నుంచి తప్పించుకోలేరు. ధూమపానం చేయనివారిలో ఏయే కారణాలు ప్రమాదాన్ని పెంచుతున్నాయో తెలుసుకుందాం?
స్మోకింగ్ చేయకపోయినా ఎలా?
యూఏఎస్ సీడీసీ ప్రకారం, 50 శాతం కంటే ఎక్కువ ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎప్పుడూ ధూమపానం చేయని వ్యక్తులలో కనిపిస్తాయి. ఎందుకంటే అడెనోకార్సినోమా లేదా క్యాన్సర్ ఊపిరితిత్తుల చిన్న గాలి సంచులను, శ్లేష్మం వంటి పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ధూమపానం చేయనివారిలో సుమారు 20 శాతం మందిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు లోపలి పొరలో కనిపిస్తాయి.
ఎప్పుడూ పొగతాగని వ్యక్తులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకడానికి మరో కారణం.. పాసివ్ స్మోకింగ్ ఒకటి. పాసివ్ (పరోక్ష) స్మోకింగ్ కారణంగా దాదాపు 7,000 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణిస్తున్నారని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నివేదిక వెల్లడించింది. పాసివ్ (పరోక్ష) స్మోకింగ్ అంటే పొగాకు ఉత్పత్తులను కాల్చేవారు వదిలే పొగను పీల్చడం.
అంటే, మీ పక్కన ఉన్న వ్యక్తి స్మోక్ చేసినప్పుడు వచ్చే పొగను పీల్చుకుంటే.. మీరు క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉండవచ్చు. చాలా మంది వ్యక్తులు తమ కార్యాలయంలో ధూమపానం చేయకపోయినా, క్యాన్సర్ కారకాలకు గురవుతున్నారు. ఆర్సెనిక్, యురేనియం, ఆస్బెస్టాస్, డీజిల్ పొగ ఉన్న ప్రదేశాలలో పనిచేసే వ్యక్తులకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పొగను పీల్చడం ద్వారా, హానికరమైన అంశాలు ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తాయి, ఇది క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది.
అనేక అధ్యయనాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులు.. ధూమపానం చేయకపోయినా, ఈ క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉందని తేలింది. మీ కుటుంబంలో ఎవరికైనా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటే, అది వచ్చే అవకాశాలు కూడా రెట్టింపు అవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను కలిగి ఉన్న ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మీ కుటుంబంలో ఉన్నట్లయితే ముప్ప తప్పదు. అలాంటివారు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
నాన్ స్మోకర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి?
చాలా మంది ధూమపానం చేయనివారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు గుర్తించడం కష్టం. అంటే అది వ్యాప్తి చెందే వరకు వారు తరచుగా నిర్ధారణ చేయబడరు. కానీ కొంతమంది క్యాన్సర్ ప్రారంభ దశల్లో లక్షణాలను గమనిస్తారని ఆంకాలజిస్టులు తెలిపారు. ఇఃవి ధూమపానం చేసేవారిలో కనిపించే లక్షణాలను పోలి ఉంటాయి.
⦿ తగ్గని దగ్గు లేదా కాలక్రమేణా తీవ్రమవుతుంది
⦿ దగ్గుతున్నప్పుడు రక్తం పడటం
⦿ ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం
⦿ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
⦿ గురక
⦿ బొంగురుపోవడం
⦿ ఆకలి లేకపోవడం
⦿ ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గడం
⦿ అలసట
⦿ మింగడంలో ఇబ్బంది
⦿ ముఖం /లేదా మెడలో వాపు
⦿ న్యుమోనియా, ఊపిరితిత్తుల అంటువ్యాధులు
Read Also: ఏమీ చేయకుండా ఉండడం బద్ధకం కాదు బాసూ, అదో ఆర్ట్ ⦿ డచ్ ఫిలాసఫీకి ఫిదా అవుతారంతే