Younger Looking Skin : ఈ ఇంటి చిట్కాలతో ముడతలు దూరమై చర్మం బిగుసుకుంటుంది.. 40 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్లలా కనిపిస్తారు
Natural Skin Tightening Hacks : చర్మ సంరక్షణ కోసం ఖరీదైన ఉత్పత్తులు వాడినా లాభం లేదా? అయితే ఇంట్లో దొరికే వాటితోనే ముఖాన్ని మెరిపించుకోవచ్చు. చర్మాన్ని టైట్ చేసే చిట్కాలు ఏంటో చూసేద్దాం.

Chemical-Free Face Tightening Tips : ఈ రోజుల్లో ముఖ చర్మాన్ని బిగుతుగా చేసే అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఖరీదైన, రసాయనాలతో కూడిన ఉత్పత్తులు చర్మాన్ని బాగుచేయడానికి బదులుగా పాడుచేస్తాయి. దీనివల్ల ప్రజలు వాటిపై నమ్మకం కోల్పోతున్నారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటిని ఉపయోగించడం ద్వారా మీ చర్మం 40 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల వయసులో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఇంటి చిట్కాలు చాలా తక్కువ ఖర్చుతో మీ చర్మంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి.
కొబ్బరి నూనె, కాఫీ మిశ్రమం
ఇందులో మొదటి చిట్కా కాఫీ, కొబ్బరి నూనె మిశ్రమం. కాఫీ పౌడర్ చర్మం నుంచి మృత కణాలను తొలగిస్తుంది. ఇది ముఖంలో రక్త ప్రసరణను బాగా పెంచుతుంది. 1 టీస్పూన్ కాఫీ పౌడర్, 1 టీస్పూన్ కొబ్బరి నూనెతో పేస్ట్ చేసి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
గుడ్డులోని తెల్లసొన
మన ముఖంలో రంధ్రాలు ఉంటాయి. వాటిని పూర్తిగా తొలగించలేము కానీ.. వాటి పరిమాణాన్ని తగ్గించవచ్చు. గుడ్డులోని తెల్లసొనను గిలకొట్టి ముఖానికి రాసుకుంటే ముఖంలోని రంధ్రాల పరిమాణం తగ్గుతుంది. పైగా ఎగ్ వైట్ స్మెల్ రాదు. కాబట్టి ఎగ్తో ఇబ్బంది లేదనుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు.
కలబంద
కలబంద జెల్ ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు. ఇది ముఖంపై వాపును తగ్గించడంతో పాటు మచ్చలను కూడా తగ్గిస్తుంది. కలబంద జెల్‌ను ముఖానికి రాసుకుని ఆరనివ్వండి. ఆరిన తర్వాత ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మం బిగుతుగా మారుతుంది. కొత్త కణాల అభివృద్ధి కూడా పెరుగుతుంది.
శనగపిండి, పసుపు పేస్ట్
శనగపిండి ముఖంపై టానింగ్‌ను తొలగిస్తుంది. పసుపు దాని యాంటీసెప్టిక్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. వీటిని పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. 2 టీస్పూన్ల శనగపిండిలో చిటికెడు పసుపు కలపండి. కావాలంటే పాలు కూడా కలుపుకోవచ్చు. ఆ తర్వాత నీళ్లు పోసి బాగా కలిపి ముఖానికి రాసుకోండి.
టమాటో, తేనె
టమాటో రసం, తేనె కలిపి రాసుకుంటే రంధ్రాలు బిగుతుగా మారుతాయి. టమాటో చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. తేనె ముఖాన్ని మృదువుగా, బిగుతుగా మార్చడానికి సహాయపడుతుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















