అన్వేషించండి

Weight Loss: ఎక్కువసేపు నిద్రపోయినా బరువు తగ్గుతారట, కొత్త అధ్యయనం చెబుతోంది

నిద్రపోతే బరువు తగ్గుతారని చెబుతోంది కొత్త అధ్యయనం. అదెలాగో చూడండి.

బరువు తగ్గాలని ఎన్నో వ్యాయామాలు చేస్తుంటారు చాలా మంది. ఆహారపరంగానూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొంత పరిష్కారం పడకగదిలోనే ఉందని చెబుతోంది కొత్త అధ్యయనం. యూనివర్సిటీ ఆఫ్ షికాగో పరిచేస్తున్న పరిశోధకులు నిద్రకు,బరువు తగ్గడానికి మధ్య సంబంధాన్ని కనిపెట్టే ప్రయత్నం చేశారు. అందులో వారికి ఓ కొత్త విషయం తెలిసింది. అధికంగా నిద్రపోవడం వల్ల కూడా బరువు తగ్గుతారని తేలింది.  రోజూ ఒక గంట ఎక్కువసేపు నిద్రపోతే ఎంతో కొంత బరువు తగ్గే అవకాశం ఉంటుంది. 

అధికబరువుతో ఇబ్బంది పడేవారు రోజూ కన్నా మరో గంటసేపు అదనంగా నిద్రపోవాలి. దీని వల్ల వారు ఆ రోజు తినే ఆహారాన్ని తగ్గిస్తారు. పరిశోధనలో పాల్గొన్నవారిలో కొందరు రోజుకి 270 కేలరీల ఆహారాన్ని తగ్గిస్తే, మరికొందరు 500 కేలరీల వరకు తగ్గించారు. ఇలా రోజూ ఒక గంట అదనంగా నిద్రిస్తే, ఆహారం తినడం తగ్గి, ఆటోమేటిక్‌గా బరువు తగ్గుతారు.  కష్టపడకుండా బరువు తగ్గే మార్గం ఇది. ఇలా రోజూ అదనంగా ఒక గంట పడుకోవడం ద్వారా మూడేళ్లలో పదమూడు కిలోల బరువు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు పరిశోధకులు. మొన్నటి వరకు అన్ని పరిశోధనలు నిద్ర తగ్గితే ఏమవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశాయి. తాజా పరిశోధన మాత్రం నిద్ర పెరిగితే ఏమవుతుందో చెప్పింది. 

నిద్ర చాలా అవసరం
శరీరానికి తిండి ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే అవసరం. మనస్పూర్తిగా నిద్రపోవడం వల్ల ఆకలిని తగ్గించే హార్మోన్ విడుదలడం, మెదడులో ఆకలిని నియంత్రించే భాగం చురుకుగా పనిచేయడం జరుగుతుంది. బరువు తగ్గడానికి వ్యాయామాలు, సరైన ఆహారమే కాదు అధిక నిద్ర కూడా అవసరమే అని తాజా అధ్యయనం చెబుతోంది. అంతేకాదు నిద్ర వల్ల ఆయుష్షు పెరుగుతుంది. సరైన నిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి దక్కుతుంది. దీంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. రోగనిరోధక శక్తి కూడా బాగా పనిచేస్తుంది. దీనివల్ల వ్యాధులు త్వరగా ఎటాక్ చేయవు. ఒకవేళ అనారోగ్యం బారిన పడిన కూడా త్వరగా నయం అవుతుంది. నిద్ర తగ్గడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.  అందుకే పిల్లలకు పది గంటల నిద్ర, పెద్దలకు ఎనిమిది గంటల నిద్ర తగ్గకూడదు. 

Also read: కొత్త జంటలకు ఉత్తమ హనీమూన్ డెస్టినేషన్ అండమాన్ నికోబార్ దీవులు, అక్కడికి ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చువుతుంది?

Also read: ఈ మూడు ఆహారాలు వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తాయి, హెచ్చరిస్తున్న అధ్యయనాలు

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget