By: ABP Desam | Updated at : 27 Apr 2023 05:00 AM (IST)
Image Credit: Pixabay
వేసవిలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫ్రూట్స్ జాబితాలో పుచ్చకాయ ముందుంటుంది. సమ్మర్ సీజన్ లో దొరికే పోషకాల పండు పుచ్చకాయ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. జ్యూసీ, క్రంచీ ఫ్రూట్ లో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. అల్పాహారం లేదా భోజనం మధ్యలో దీన్ని తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. సాయంత్రం వేళ కూడా తినొచ్చు కానీ రాత్రి పూట మాత్రం తినొద్దు. ఎందుకంటే ఇది పొట్టను కలవరపెడుతుంది. మధుమేహులు కూడా పుచ్చకాయ తినొచ్చు. షుగర్ లెవల్స్ పెరుగుతాయనే భయం అక్కర్లేదు.
గర్భిణీలు రోజూ పుచ్చకాయ తీసుకుంటే చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. రోగనిరోధక పని తీరు, కణ నిర్మాణం, గాయాలు నయం చేయడం కోసం అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. అంతే కాదు ఇందులో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ స్థాయిలు ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుని ప్రోత్సాహిస్తాయి.
పుచ్చకాయ తియ్యగా ఉంటుంది. అందువల్ల ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుందని చాలా మందికి సందేహం కలుగుతుంది. కానీ 100గ్రాముల పుచ్చ కాయలో కేవలం 6.2 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అందుకే మధుమేహులు నిరభ్యంతరంగా తినొచ్చు. ఇందులోని అధిక నీటి శాతం, ఫైబర్ పొట్టకి సంతృప్తి కలిగిన ఫీలింగ్ ఇస్తాయి. అందుకే ఇది తిన్న తర్వాత ఆకలిగా అనిపించదు. చిరుతిండిగా చక్కగా ఉపయోగపడుతుంది. ఆకలి తీర్చేందుకు ఒక చిన్న భాగం ముక్క తీసుకుంటే సరిపోతుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు పెరుగుతారనే భయపడాల్సిన అవసరం లేదు. జీర్ణక్రియ సజావుగా జరిగేలా చూస్తుంది. ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది.
పుచ్చకాయలలోని అనేక పోషకాలు ఆరోగ్యకరమైన గుండెకు తోడ్పడతాయి. ఇందులోని లైకోపీన్ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి, రక్తపోటుని అదుపులో ఉంచేందుకు సహాయపడుతుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అధిక కొలెస్ట్రాల్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టాన్ని నిరోధించడంలో కూడా సహాయపడుతుంది. ఇంకా పుచ్చకాయలోని అమినో యాసిడ్ సిట్రులిన్, నైట్రిక్ ఆక్సైడ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తపోటుని అకస్మాత్తుగా పెరగకుండా చేస్తుంది.
లైకోపీన్ కంటికి మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డిజేనరేషన్ వ్యాధిని నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది వృద్ధుల్లో అంధత్వానికి కారణమయ్యే సాధారణ కంటి సమస్య.
పుచ్చకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. పళ్ల మీద ఫలకం ఏర్పడకుండా నెమ్మదించేలా చేస్తుంది. ఈ కాయ తింటే చిగుళ్ళు బలోపేతం అవుతాయి. బ్యాక్టీరియా దాడుల నుంచి చిగుళ్ళను కాపాడుతుంది. దంతాలు తెల్లగా మార్చేందుకు, పెదవులు పొడిబారిపోకుండా పగిలిపోకుండా నిరోధిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: నిద్ర పట్టేందుకు మీరు రోజూ ఇలా చేస్తున్నారా? మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు!
Skin Glow: చర్మం మెరిసిపోవాలంటే రోజూ తినాల్సిన ఆహారాలు ఇవిగో
Chai-Biscuit: ఛాయ్‌తో బిస్కెట్స్ కలిపి తీసుకుంటున్నారా? మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవల్సిందే
Air Conditioning: వేసవిలో ఏసీ లేకుండానే మీ రూమ్ ఇలా చల్లబరుచుకోవచ్చు
White Jamun: ఈ తెల్ల నేరేడు పండ్లను కచ్చితంగా వేసవిలో తినాల్సిందే
Hair: పొడవాటి జుట్టు కోసం మందార పువ్వులు ఆకులతో ఇలా చేయండి
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?