అన్వేషించండి

Body Itching : శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి

Itchy Skin Without Rash : దద్దుర్లు లేకుండా బాడీ అంతా దురద పెడుతుందా? దురదతో పాటు కొన్ని లక్షణాలు కూడా ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెప్తోన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పొడి చర్మం, అలర్జీలు, చర్మ సమస్యల వల్ల శరీరమంతా దురద వస్తుంది.
  • కాలేయం, మూత్రపిండాలు, థైరాయిడ్ సమస్యలు కూడా దురదకు కారణం కావచ్చు.
  • దద్దుర్లు లేకుండా తీవ్ర దురద వస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.
  • మాయిశ్చరైజర్ వాడి, చర్మాన్ని తేమగా ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలి.

Itchy Skin Causes : శరీరంపై దురద రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. పొడి చర్మం, చెమట, అలర్జీలు, సబ్బులు లేదా ఇతర ఉత్పత్తుల వల్ల కూడా దురదకు కారణం కావచ్చు. అయితే కొన్నిసార్లు ఎలాంటి దద్దుర్లు లేకుండానే శరీరమంతా దురదగా అనిపించవచ్చు. ఇది ఎక్కువ రోజులు కొనసాగితే లేదా ఇతర లక్షణాలు కూడా ఉంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదని చెప్తున్నారు నిపుణులు. మరి దురద రావడానికి కారణాలేంటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

శరీరంపై దురద రావడానికి కారణాలివే

పొడిబారితే : చర్మంలో తేమ తగ్గినప్పుడు పొడిబారడం, పొట్టు రాలడం, దురద వంటి సమస్యలు రావచ్చు. వేడి నీటితో ఎక్కువసేపు స్నానం చేయడం, తరచుగా సబ్బులు వాడటం వల్ల కూడా చర్మం పొడిబారవచ్చు. ఇలాంటి సందర్భాల్లో చర్మానికి తేమను అందించే మాయిశ్చరైజర్లు ఉపయోగపడతాయి.

Also Read : బీపీ, షుగర్, కొలెస్ట్రాల్.. 30 తర్వాత ఈ హెల్త్ చెకప్స్ తప్పక చేయించుకోండి

అలర్జీలు : కొన్ని ఫుడ్స్, మందులు, సబ్బులు, పెర్ఫ్యూమ్స్, డిటర్జెంట్లు లేదా సౌందర్య ఉత్పత్తుల వల్ల అలర్జీ రావచ్చు. దీనివల్ల చర్మంపై దురద, ఎర్రటి దద్దుర్లు, ఉబ్బిన మచ్చలు కనిపించవచ్చు. 

చర్మ సమస్యలు : ఎగ్జిమా, సోరియాసిస్, ఉర్టికేరియా వంటి చర్మ సమస్యల వల్ల దురద రావచ్చు. కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లు, గజ్జి వంటి సమస్యలు కూడా దురదకు కారణమవుతాయి. ముఖ్యంగా రాత్రివేళ దురద ఎక్కువగా ఉండటం, ఇంట్లో ఇతరులకు కూడా దురద రావడం వంటి లక్షణాలు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

చెమట, వేడి : ఎండలో ఎక్కువసేపు ఉండటం, అధికంగా చెమట పట్టడం, గాలి ఆడని దుస్తులు ధరించడం వల్ల చెమటకాయలు ఏర్పడి దురద రావచ్చు. అలాంటప్పుడు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవడం మంచిది.

Also Read : బరువు తగ్గాలా? కఠినమైన డైట్ వద్దు, ఈ చిన్న మార్పులు చాలు అంటోన్న హెల్త్ కోచ్.. వీటితో పది కిలోలు తగ్గిందట

మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ : కొన్ని మందులు వాడిన తర్వాత దురద, దద్దుర్లు లేదా చర్మంపై ఇతర మార్పులు కనిపించవచ్చు. కాబట్టి కొత్త మందు ప్రారంభించిన తర్వాత కూడా ఇలాంటి లక్షణాలు వస్తే వైద్యుడిని సంప్రదించాలి. 

కాలేయం, మూత్రపిండాల సమస్యలు : కొన్ని సందర్భాల్లో కాలేయం లేదా మూత్రపిండాల పనితీరులో సమస్యలు ఉన్నప్పుడు శరీరమంతా దురద రావచ్చు. ముఖ్యంగా చర్మంపై ఎలాంటి దద్దుర్లు లేకపోయినా దురద కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలి. 

థైరాయిడ్ సమస్యలు, మధుమేహం : థైరాయిడ్ పనితీరులో మార్పులు, మధుమేహం, రక్తహీనత వంటి సమస్యలు కూడా కొంతమందిలో దురదకు కారణం కావచ్చు. దురదతో పాటు అలసట, అధిక దాహం, బరువులో మార్పులు వంటి లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Also Read : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే

దురదతో పాటు ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త

దురదతో పాటు పెదవులు, నాలుక లేదా గొంతు అకస్మాత్తుగా వాచిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మింగలేకపోవడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. దద్దుర్లతో పాటు జ్వరం, తీవ్రమైన నొప్పి లేదా అనారోగ్యంగా అనిపిస్తే జాగ్రత్త. దురదతో పాటు కళ్లలోని తెల్లటి భాగం లేదా చర్మం పసుపు రంగులోకి మారడం, మూత్రం ముదురు రంగులో రావడం వంటి లక్షణాలు ఉంటే కాలేయ సమస్యలున్నాయో చెక్ చేసుకోవాలి. 

దద్దుర్లు లేకుండానే దురద

చర్మంపై ఎలాంటి మార్పులు కనిపించకపోయినా శరీరమంతా దురదగా ఉంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా దురద పదేపదే వస్తున్నా, తీవ్రంగా ఉన్నా లేదా రెండు వారాలకు మించి కొనసాగినా వైద్యుడిని సంప్రదించాలి. అవసరాన్ని బట్టి రక్త పరీక్షలు, కాలేయం, మూత్రపిండాలు, థైరాయిడ్ పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటే మంచిది. గర్భిణుల్లో అరచేతులు, అరికాళ్లపై దద్దుర్లు లేకుండానే తీవ్రమైన దురద రావడం జరగవచ్చు.

Also Read : ఉదయాన్నే వాము నీరు తాగితే కలిగే అద్భుత లాభాలు.. బరువు తగ్గడం నుంచి గట్ హెల్త్ వరకు

దురదను తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దురదను తగ్గించుకునేందుకు సువాసనలు లేని మాయిశ్చరైజర్‌ను స్నానం చేసిన తర్వాత అప్లై చేయాలి. దీనివల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. గోరువెచ్చని లేదా సాధారణ ఉష్ణోగ్రతలోని నీటితో స్నానం చేయాలి. వేడి నీళ్లు మంచిది కాదు. దురద ఉన్న ప్రాంతాన్ని గట్టిగా గోకడం వల్ల గాయాలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దురద వచ్చే చోట చల్లటి తడి గుడ్డను కాసేపు ఉంచుకోవచ్చు.

కొత్త సబ్బు, క్రీమ్ లేదా డిటర్జెంట్ వాడిన తర్వాత దురద మొదలైతే దాన్ని వాడటం ఆపి వైద్య సలహా తీసుకోండి. కారణం తెలియకుండా స్టెరాయిడ్ క్రీములు, యాంటీబయాటిక్స్ లేదా అలర్జీ మందులు వాడకండి. దురదకు అసలు కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం ముఖ్యం.

Also Read : నోటితో గాలి పీల్చుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. మీ హెల్త్ రిస్క్​లో ఉన్నట్టే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Healthy Skin Diet : ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
Hemorrhoids Risk : యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
Coconut Benefits : కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
Mens Day 2026 Wishes : హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget