అన్వేషించండి

సమంతకు వచ్చిన ఆ వ్యాధి అంత భయంకరమైనదా? ఇది వచ్చాక ఎన్నాళ్లు బతికే అవకాశం ఉంది?

సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆ వ్యాధి ఎంత భయంకరమైనదో మాత్రం చాలా మందికి తెలియదు.

రక్తాన్ని చిమ్మే గాయం కంటికి కనిపిస్తుంది,  అలాంటి గాయాలే ఎక్కువగా బాధిస్తాయనుకుంటాం కానీ కంటికి కనిపించని మయోసైటిస్‌లాంటి రోగాలు జీవితంపైనే విరక్తి తెప్పిస్తాయి. ఇప్పుడు సమంతను వేధిస్తున్న ఆరోగ్య సమస్య ఇదే. ఈ వ్యాధి బారిన పడినట్టు ప్రకటించాక తొలిసారి సమంత అభిమానుల ముందుకు వచ్చింది. తన బాధను కన్నీళ్లతో వివరించింది.నేను చావలేదు, ఇంకా బతికే ఉన్నాను అంటూ ఎమోషనల్ అయింది. కానీ ఆ వ్యాధి మాత్రం తనను చాలా బాధపెడుతోందని చెప్పింది. సమంత మాటలు విన్నాక మయోసైటిస్ అంత ప్రమాదకరమైనదా అనే సందేహం అందరిలో కలిగింది.  ఈ వ్యాధి గురంచి కొన్ని వివరాలు ఇవిగో...

మయోసైటిస్ వచ్చాక ఎన్నాళ్లు జీవిస్తారు?
సాధారణంగా మయోసైటిస్ అంత త్వరగా తగ్గదు. ఇది వచ్చాక మింగడం, శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. దీని వల్ల నిమోనియా వంటి తీవ్రమైన అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ అర్థంతరంగా చనిపోవడం వంటివి జరగవు. కాకపోతే ఇతర అనారోగ్యసమస్యలు కూడా వేధిస్తుంటాయి. ఈ సమస్య ఉన్పప్పటికీ 95 శాతం మంది చాలా ఏళ్లు బతికిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రాణం తీసేంత చరిత్ర ఈ వ్యాధికి లేదు. 

ఏం తినకూడదు?
ఈ వ్యాధి ఉన్నవారు చక్కెర, గోధుమపిండితో చేసిన ఆహారాలు దూరం పెట్టాలి. బ్రెడ్, పాస్తా, నూడుల్స్ వంటివి మానేయాలి. ఫ్యాక్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. అధిక ఫ్రక్జోజ ఉండే ఆహారాలు, కార్న్ సిరప్, జంక్ ఫుడ్ వంటివి తినకూడదు. కేవలం కూరగాయలు, తాజా పండ్లు వంటివే తినాలి. వైద్యుల సూచన మేరకు గుడ్లు, చికెన్, మటన్ వంటివి తినవచ్చు. 

ఒత్తిడి మయోసైటిస్‌కు కారణమవుతుందా?
మయోసైటిస్ అనే వ్యాధి ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ, తన సొంత శరీరంపైనే దాడి చేస్తుంది. అలాంటప్పుడు ఒత్తిడికి గురవుతుంటే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ మరింతగా క్షీణించి మయోసైటిస్ లక్షణాలను పెంచుతుంది. ఒత్తిడి వల్ల ఈ వ్యాధి వస్తుందని చెప్పలేం కానీ, ఈ వ్యాధి వచ్చాక మాత్రం అధిక ఒత్తిడికి గురవ్వకూడదు. 

చికిత్స చేయకపోతే ఏమి జరుగుతుంది?
చికిత్స చేయకుండా వదిలేస్తే మయోసైటిస్‌ ముదిరిపోతుంది. కండరాలు తీవ్రంగా నష్టపోతాయి. కండర కణాలు నశిస్తాయి. కీళ్లు, ఊపిరితిత్తుల వంటి ఇతర అవయవాలతో సంబంధం కలిగి ఉండి వాటిని దెబ్బతీస్తాయి. కండరాలు వాపుతో పాటూ, చర్మంపై దద్దుర్లు, మంట వస్తాయి. పరిస్థితి క్షీణిస్తే కనీసం అడుగు తీసి అడుగు వేయలేరు. చేతులతో ఏ బరువూ ఎత్తలేరు. 

మయోసైటిస్ పూర్తిగా నయం కాదా?
ప్రస్తుతానికి మయోసైటిస్‌కు చికిత్స లేదు. అందుకే పూర్తిగా నయం అవుతుందని చెప్పలేం. కానీ దానివల్ల కలిగే మంట, నొప్పి, కండరాల బలహీనతను తగ్గించే మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సూచన మేరకు మంచి ఆహారాన్ని తింటే శక్తి వంతంగా మారొచ్చు. కానీ ఈ వ్యాధితో జీవితాంతం పోరాడాల్సిందే. చికిత్సలో భాగంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులను అందిస్తారు. వ్యాయామం కూడా సూచిస్తారు. 

మయోసైటిస్ అరుదైన వ్యాధా?
మయోసిటిస్ అనేది అరుదైన కండరాల వ్యాధనే చెప్పాలి. అమెరికాలో 50,000 నుంచి 75,000 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు అంచనా. మనదేశంలో కూడా ఎంతో మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అరుదైన వ్యాధి అని ఎప్పుడు పిలుస్తారంటే ఆ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రెండు లక్షల కన్నా తక్కువగా ఉన్నప్పుడు.  

Also read: ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకపోవడమే ఉత్తమం, లేకుంటే కష్టాలు తప్పవు

టాప్ హెడ్ లైన్స్

B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
Embed widget