Jackfruit Day : ఆరోగ్యానికి మేలు చేసే పనస పండు.. లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
JackFruit Day : పనస పండుతో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. వాటినే గుర్తిస్తూ ప్రతి ఏడాది ఈ పండుపై అవగాహన కల్పిస్తూ ఇంటర్నేషనల్ జాక్‌ఫ్రూట్ డే నిర్వహిస్తున్నారు.

International JackFruit Day 2025 : ప్రతి ఏడాది జూలై 4వ తేదీన అంతర్జాతీయంగా పనసపండు దినోత్సవం నిర్వహిస్తున్నారు. పనస పండు తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటి? ఎవరు తినొచ్చు? వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ జాక్‌ఫ్రూట్ డే నిర్వహిస్తున్నారు. దీనిలోని పోషక విలువలు గుర్తించి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం డైట్లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. అసలు ఈ పనస పండు దినోత్సవం ఎలా మొదలైంది. దానివల్ల ఆరోగ్యానికి కలిగే ప్రధాన లాభాలు ఏంటో చూసేద్దాం.
పనస పండు దినోత్సవ చరిత్ర..
అంతర్జాతీయ జాక్‌ఫ్రూట్ దినోత్సవాన్ని 2016లో మొదటిసారిగా నిర్వహించారు. పోషకాహార నిపుణులు, పర్యావరణవేత్తలు కలిసి దీనిని ప్రారంభించారు. పోషక విలువలు ఉన్న ఈ ఫ్రూట్ గురించి.. ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. జాక్‌ఫ్రూట్ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తూ.. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వివరిస్తూ దీనిని నిర్వహించడమే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
పనస పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. మైక్రోన్యూట్రెంట్స్ ఉంటాయి. విటమిన్ సి, ఏ, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ నిండుగా ఉంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా డైట్లో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇంతకీ పనస పండు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి..
పనస పండులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి సీజనల్ వ్యాధులు రాకుండా ఇన్ఫెక్షన్లు సోకకుండా హెల్ప్ చేస్తాయి. వాతావరణం మారుతున్న సమయంలో ఇబ్బందులు రాకుండా హెల్ప్ చేస్తాయి.
గట్ హెల్త్
జీర్ణ సమస్యలను దూరం చేసి గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ సమస్యలను దూరం చేసి.. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యానికై..
పనస పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి.
స్కిన్ హెల్త్
పనస పండులోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యఛాయలను దూరం చేస్తాయి. గ్లోయింగ్ స్కిన్‌ని అందిస్తాయి.
బరువు తగ్గడానికై..
పనసలో కేలరీలు తక్కువగా ఉంటాయి. జాక్‌ఫ్రూట్‌లోని ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది హెల్తీ స్నాక్‌గా చెప్పవచ్చు.
బ్లడ్ షుగర్
గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్ ఉంటుంది. ఈ రెండూ రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.
ఇవేకాకుండా పనసలోని కాల్షియం, మెగ్నీషియ, విటమిన్ కె బోన్ సమస్యల్ని దూరం చేస్తాయి. ఎముకలను స్ట్రాంగ్‌గా చేసి బలాన్ని అందిస్తాయి. విటమిన్ ఎ, కారోటెనోయిడ్స్ కంటి చూపును మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్లో తీసుకుంటే మంచిది. అంతేకాకుండా పనస గింజలు, పనస పట్టు కూడా ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఇస్తుంది. పర్యావరణానికి కూడా ఇది మేలు చేస్తుంది కాబట్టే పనసను ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్నారు.






















