News
News
వీడియోలు ఆటలు
X

International Dog Day 2021: కుక్కతో మనిషికి ఎందుకంత ఫ్రెండ్ షిప్

మనిషికి శునకానికి బంధం ఇప్పటిది కాదు.. వేల ఏళ్ల నాటిది. ఏ జంతువుతో అంత క్లోజ్ గా ఉండని మనిషి.. శునకంతో ఎందుకంత బెస్ట్ ఫ్రెండ్ లా ఉంటారు?

FOLLOW US: 
Share:

ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుందనే డైలాగ్ ఎప్పుడూ వింటాం. అదే ఈరోజు. అలా అని కాదు. ఇవాళ ఇంటర్నేషనల్ డాగ్ డే అన్నమాట. ప్రతి ఏటా ఆగస్టు 26న ఈ దినోత్సవాన్ని జరుపుకొంటారు.  2004లో కొలీన్ పైజ్ అనే ఒక రచయిత.. దీనిని మెుదలుపెట్టారు. జంతు సంక్షేమ న్యాయవాది అయిన ఈయన నేషనల్ డాగ్ డే, నేషనల్ పెట్ డే, నేషనల్ పప్పీ డే కోసం చాలా కృషి చేశారు. జంతువుల్లో ఏదీ శునకంలా విశ్వాసంగా ఉండదు.

కాస్త ప్రేమ చూపించి..కడుపు నింపితే చాలు తమ యజమానుల ప్రాణాలకు తమ ప్రాణాల్ని అడ్డు వేసి కాపాడతాయి పెంపుడు కుక్కలు.  యజమానుల్ని అనుక్షణం కనిపెట్టుకుని ఉంటాయి. యజమానికి ఆరోగ్యం బాగుండకుండా హాస్పిటల్ లో చేరితో హాస్పిటల్ బయటే రోజుల తరబడి వేచి చూసిన పెంపుడు కుక్కల గురించి విన్నాం. 

మీరు విచారంగా ఉన్నా... లేదా ఒంటరిగా ఉన్నా..  ఎప్పుడూ మీ శునకం మీ దగ్గరకు వస్తుంది. దానితో కాసేపు ఆడుకుంటే సరిపోతుంది. మీమ్మల్ని అది అసలు ఒంటరిగా వదలదు. ఒకవేళ మీ డాగ్ మీ ఇంటి దగ్గర లేకుండా ఉంటే.. మీ ఇళ్లంతా బోసిపోయినట్టు ఉంటుంది. ఎప్పుడైనా గమనించారో.. లేదో...

మీకు తెలుసా.. మీరు ఇంటి దగ్గర లేనప్పుడు మీ శునకం చాలా బాధపడుతోంది. ఒకవేళ మీరు ఇంటికి వచ్చారో.. మీ దగ్గరకు వచ్చి.. మీ స్పర్శ కోసం ఎదురుచూస్తోంది. సంతోషంగా మీమ్మల్ని తాకుతూ నడుస్తోంది. విశ్వాసం గల జంతువు కదా.. మీకు ప్రేమనే పంచుతుంది. కుక్కతో కాసేపు ఆడుకోగానే ఉల్లాసం వస్తుంది. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. శునకాలకు అసూయ అనేదే ఉండదు. శునకాలకు అసూయ లేదా చెడు అంటే ఏమిటో తెలియదు. కేవలం ప్రేమించడం మాత్రమే తెలుసు.

కుక్కలు యజమానుల కోసం ఏదైనా చేస్తాయి. మనం ఎన్నో ఉదాహరణలు చూశాం. ఫ్యామిలీ కోసం పాముతో కొట్లాడిన శునకం.. పులిని బెదిరించిన గ్రామసింహం.. ఇలాంటి వార్తలు ఎన్నో చూశాం. మీకు చెడు జరగనివ్వకుండా చూసుకుంటోంది శునకం.

ఒత్తిడిలో ఉన్నప్పుడు శునకాలు మనల్ని ఎంతో ఫ్రీ మైండెండ్ గా చేస్తాయి. మన లోపల ఉన్న బాధను అవి పొగొట్టడానికి వాటి ప్రయత్నం అవి చేస్తాయి. మనం వాటితో ఆడుకున్నా.. లేదా.. వాకింగ్ కి బయటకు తీసుకెళ్లిన మనకు తెలియకుండా మానసికంగా ఆనందంగా ఫీల్ అవుతాం. కుక్కలు క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా పసిగట్టగలవు.

కుక్కలకు జీవితం పట్ల గొప్ప ఉత్సాహంతో ఉంటాయి. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందిస్తాయి. ప్రతి రోజును ఒక కొత్త అద్భుతంగా చూస్తాయి.  నిజానికి శునకాలు.. మనకు ఎల్లప్పుడూ మంచి జీవితాన్ని గడిపేందుకు స్ఫూర్తినిస్తాయి. వృద్ధాప్యంలో ఒక శునకం మనతో ఉంటే చాలు.. ఎంతో ఆనందంగా గడిపేయోచ్చు.  

కుక్కలు ఎక్కువగా అరుస్తున్నాయంటే దొంగలు వచ్చినట్లుగా అనుమానించాల్సిందే. లేక ఇంకేవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చినట్లు భావిస్తుంటారు. ఇక ఎక్కడైనా బాంబులు పెట్టినట్లయితే వాటిని గుర్తించడంలో శునకాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంతేకాదు ఏదైనా హత్య లేదా ఇతర సంఘటనలకు సంబంధించి పోలీసులకు క్లూలు సైతం అందిస్తాయి. శునకాల వల్ల పోలీసు శాఖకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీటి ద్వారా ఎన్నో హత్య కేసులు, ఇతర కేసులను చేధించారు. ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి.

Also Read: వేడి నీళ్లు vs చన్నీళ్లు.. ఏ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యం?

Kolkata Chinese Kali Temple: ఈ దేవాలయంలో న్యూడిల్స్, సూప్ ప్రసాదం.. అసలు కథేంటంటే!

Published at : 26 Aug 2021 05:19 PM (IST) Tags: International Dog Day International Dog Day 2021 dog day dog day 2021 International Dogs Day International Dog Day history

సంబంధిత కథనాలు

ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌తో హార్ట్ ఫెయిల్యూర్‌ ముప్పును ముందే తెలుసుకోవచ్చట!

ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌తో హార్ట్ ఫెయిల్యూర్‌ ముప్పును ముందే తెలుసుకోవచ్చట!

World No Tobacco Day: సిగరెట్ ఊపిరితిత్తులనే కాదు మీ కంటి చూపుని కాల్చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త!

World No Tobacco Day: సిగరెట్ ఊపిరితిత్తులనే కాదు మీ కంటి చూపుని కాల్చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త!

WeightLoss: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? ధనియాల నీళ్లతో త్వరగా తగ్గొచ్చు

WeightLoss: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? ధనియాల నీళ్లతో త్వరగా తగ్గొచ్చు

Relationships: నా కూతురు ముందే నా భర్త నన్ను కొట్టాడు, నేను అలానే చేయాలనుకుంటున్నాను

Relationships: నా కూతురు ముందే నా భర్త నన్ను కొట్టాడు, నేను అలానే చేయాలనుకుంటున్నాను

Black Apples: బ్లాక్ డైమండ్ ఆపిల్స్ గురించి విన్నారా? నల్ల వజ్రాల్లా మెరుస్తాయివి

Black Apples: బ్లాక్ డైమండ్ ఆపిల్స్ గురించి విన్నారా? నల్ల వజ్రాల్లా మెరుస్తాయివి

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !