Nutty With Your Breakfast: బ్రేక్ ఫాస్ట్‌లో ఈ నట్స్ చేర్చితే గుండె జబ్బులు రావట!
Nutty With Your Breakfast: అల్పాహారంలో ఏం తీసుకోవాలనే అంశంలో చాలా అపోహలు ఉన్నాయి. ఓ తాజా స్టడీ క్లారిటీ ఇచ్చింది. గుడ్డుకు బదులు నట్స్ తీసుకుంటే 17శాతం గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుందని తెలిపింది.
Nutty With Your Breakfast: ఉదయం అల్పాహారంలో ఏం తినాలనే అంశంలో చాలా అపోహలు ఉన్నాయి. అలాంటి వారికి ఓ తాజా అధ్యయనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. గుడ్లు, నట్స్ వంటి పోషక విలువలు ఉన్న పదార్థాలు బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే మంచిదే. అయితే, గుడ్లకు బదులు నట్స్ తీసుకుంటే 17 శాతం వరకు గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు.
నట్స్‌తోనే ఆరోగ్యం:
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి సమతుల్య ఆహారం అందించాలి. అందులో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనేది అత్యంత కీలకం. అయితే సరైన ఫుడ్ ఎంపిక చేసుకుంటేనే అది సాధ్యం అవుతుంది. బీఎంసీ మెడికల్ జర్నల్ ప్రచురించిన ఓ పరిశోధన వివరాల ప్రకారం.. రోజూ బ్రేక్ ఫాస్టులో గుడ్డుకు బదులు నట్స్ తీసుకుంటే గుండె జబ్బులు 17 శాతం, మధుమేహం 18 శాతం, అకాల మరణాలు 15 శాతం వరకు తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు. గుడ్డు స్థానంలో 25 నుంచి 28 గ్రాముల నట్స్ తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. అయితే పూర్తిగా గుడ్లను డైట్ నుంచి తీసేయ్యకూడదని వారు చెప్పలేదు.
నట్స్ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో:
నట్స్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వాల్ నట్స్ చాలా ప్రయోజకరమైనవి. అందులో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్‌లు పుష్కలంగా లభిస్తాయి. నట్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడతాయి. అదనంగా, అర్జినైన్ అనే అమైనో ఆమ్లం నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇవి రక్తనాళాలను సడలించడంలో సహాయపడుతుంది. రక్తప్రవాహాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగేలా సులభతరం చేస్తుంది.
నట్స్ మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంతోపాటు శరీరంలో మంటను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నట్స్ లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను పెంపొందించడంతోపాటు రక్తంలో చక్కెర స్ధాయిలను తగ్గిస్తుంది. కొవ్వు బర్న్ చేస్తుంది..బరువు తగ్గడంలో సహాయపడుతాయి. అంతేకాదు గుండె జబ్బులతో సంబంధం ఉన్న ప్రమాద కారకాలను సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి. ఉదాహారణకు ఒక ఔన్స్ బాదం పప్పు తీసుకుంటే అందులో 15గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇందులో ప్రధానంగా 80శాతం మోనోశాచురేటెడ్, 15శాతం బహుళఅసంతృప్త, 5% సంతృప్త కొవ్వులు ఉంటాయి. అదేవిధంగా, వాల్‌నట్‌లు 18.5 గ్రాముల కొవ్వును అందిస్తాయి. వీటిలో ప్రధానంగా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయని తాజా స్టడిలో వెల్లడైంది.
2021 అధ్యయనం ప్రకారం, రెండు సంవత్సరాలలో రోజుకు దాదాపు అర కప్పు వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) లేదా 'చెడు' కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని తేలింది. అదే సమయంలో ఆరోగ్యకరమైన, వృద్ధులలో మొత్తం LDL కణాలు, చిన్న LDL కణాలను తగ్గిస్తాయని నిపుణులు తెలిపారు. ఆహార ఎంపికలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, సాసేజ్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలకు బదులుగా నట్స్ ను నిత్యం డైట్లో చేర్చుకున్నట్లయితే...గుడ్లకంటే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. వారానికి రెండుసార్లు నట్స్ తినేవారిలో ఆకస్మిక ప్రమాదానికి 30 శాతం నుండి 50 శాతం వరకు తగ్గుతుందని వెల్లడించింది. వారానికి అనేక సార్లు గింజలను తినే వ్యక్తులలో గుండె మరణం, లేదా హృదయ సంబంధ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని స్టడీ పేర్కొంది.
Also Read : ఈ దోశ బరువును, మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది.. రెసిపీ ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.