అన్వేషించండి

Signs A Man Loves You Deeply : ఏ అబ్బాయి అయినా మిమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తున్నాడా? అయితే అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టే

Men in Love : ప్రేమిస్తే వాట్సాప్​లలో, ఇన్​స్టాలో ప్రపోజ్ చేసేవాళ్లు ఉంటారు. కానీ కొందరు చేతల్లోనే తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. పైకి చెప్పలేకపోవచ్చు కానీ.. అది ప్రేమేనట. మీకు అర్థమవుతోందా?

Recognizing True Love : ఏ ఒక్కరూ ఒకలా ఉండరు. అలా అని ఓ ఇద్దరూ ఒకేలా ప్రేమించుకోరు. ఒక్కొక్కరి ప్రేమ ఒక్కోలా ఉంటుంది. సోషల్ మీడియానే జీవితంగా మారిన ఈరోజుల్లో కొందరు స్నాప్​ చాట్​లలోనో.. ఇన్​స్టాల్లోనో ప్రపోజ్ చేసి రిలేషన్​షిప్​లోకి వెళ్తున్నారు. కానీ కొందరు అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడటానికే భయపడతారు. అలాంటిది వారి ప్రేమ చెప్తే అమ్మాయి పూర్తిగా దూరమైపోతుందేమోననే భావనలో ఉంటారు. అలా లోలోపలే ప్రేమను దాచేసుకుంటారు. కానీ వారు చేసే పనుల్లో వారి ప్రేమ స్పష్టంగా తెలుస్తుందట. మరి మిమ్మల్ని సైలెంట్​గా ఆరాధించే అబ్బాయిలు మీ చుట్టూ ఉన్నారేమో ఇలా తెలుసుకోండి. 

జెనరేషన్​లో మార్పులు, పరిస్థితుల కారణంగా నిజమైన ప్రేమను పొందడం చాలా అరుదుగా మారిపోయింది. అలాగే దానిని గుర్తించడం కూడా కష్టమే అయిపోయింది. అవతలి వారు మోసం చేస్తున్నారేమో అనే గజిబిజి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే కొన్ని సంకేతాలు నిజమైన ప్రేమకు అర్థాలని చెప్తారు. ఓ వ్యక్తి మిమ్మల్ని శారీరక అవసరాల కోసం ప్రేమిస్తున్నారో.. లేదా మీతో జీవితాన్ని పంచుకోవాలని చూస్తున్నారో తెలుసుకోగలిగే అంశాలున్నాయి. అవేంటంటే.. 

మీ సంతోషమే అతని ఆనందం.. 

ఓ వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే అతనికి మీ ఆనందమే మొదటి ప్రయారిటీ అవుతుంది. మీకు ఇష్టమైన వాటితో సర్​ప్రైజ్ చేయడం, మీకు నచ్చిన పనిని చేసే విధంగా మిమ్మల్ని ప్రోత్సాహించడం చేస్తూ ఉంటారు. మీకు నచ్చే పనులు చేసేందుకు చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. 

వినాలి కదా..

మీరు ఏమి చెప్పినా వాళ్లు మీ మాటను అంతే శ్రద్ధతో వింటారు. మీరు ఎలా మాట్లాడుతున్నారు.. మీరు ఏమి ఫీల్​ అవుతున్నారో మీ మాటలు వినే అర్థం చేసుకోగలుగుతారు. మీరు చెప్పే ప్రతి విషయాన్ని అతను గుర్తుపెట్టుకుని అర్థం చేసుకుంటారు. 

టైమ్

ఏ రిలేషన్​షిప్​లో అయినా గొడవలు వచ్చేది ఈ టైమ్​ దగ్గరే. నువ్వు నాకు టైమ్​ ఇవ్వట్లేదనే చోటనే గొడవలు మొదలవుతాయి. కానీ మీ బిజీ షెడ్యూల్​ని అర్థం చేసుకోవడంతో పాటు.. అతని బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీకోసం కాస్త టైమ్ ఇస్తూ ఉంటారు. మీతో టైమ్ స్పెండ్ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు. 

గౌరవిస్తాడు..

రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకోవడమనేది ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిన చర్య. ఓ పరిస్థితి ఎదురైనప్పుడు అది అతనికి నచ్చకపోయినా.. మీ మాటను గౌరవిస్తూ ఉండే వాళ్లు మీ చుట్టూ ఉండొచ్చు. మీ వ్యక్తిగత అభిప్రాయాలను కూడా అతను గౌరవించి.. మీరు హ్యాపీగా ఉండేలా చూసుకుంటారు. 

గోల్స్

అమ్మాయిల గోల్స్​కి అడ్డుచెప్పేవారు చాలామందే ఉంటారు. కానీ కొందరు మాత్రం మీ గోల్స్​ని రీచ్​ అయ్యే జర్నీలో మీకు తోడుగా ఉంటారు. మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ.. తిరిగి వెనక చూడకుండా.. ఇంకేమి ఆశించకుండా మీరు మీ గోల్స్ రీచ్​ అయితే చాలు అనుకుంటారు. 

తప్పు చేస్తే.. 

తన వల్ల తప్పు జరిగినా.. ఏ ఇతర కారణాల వల్ల తప్పు జరిగినా.. మిమ్మల్ని వదులుకోకూడదనే ఉద్దేశంతో అతనే ముందుగా మీకు సారీ చెప్తాడు. అతను ఎంతటి పొజీషన్​లో ఉన్నా.. మీకు సారీ చెప్పేందుకు వెనకడుగు వేయరు. తమ కోపం, ఇగో కంటే మీ ప్రేమకే అతను ఎక్కువ వాల్యూ ఇస్తాడు. 

కంఫర్ట్.. 

తనతో ఉంటే మీకు సేఫ్ అండ్ సెక్యూర్డ్​గా ఉందా? అది అతను మీకిచ్చే అతి పెద్ద గిఫ్ట్​ అనే చెప్పొచ్చు. ఎందరిలో ఉన్నా.. కొందరి దగ్గర మాత్రమే అమ్మాయిలు సేఫ్​గా ఫీల్​ అవుతారు. అలాంటి పర్సన్స్ లైఫ్​లో ఉంటే ఓసారి వారి ప్రేమ గురించి ఆలోచించండి. 

ఇవేకాకుండా చాలా విషయాల్లో అబ్బాయిలు సైలెంట్​గానే తమ ప్రేమను చూపిస్తూ ఉంటారు. మీరు కష్టాల్లో ఉంటే అతనే మీ ముందు కనిపించే మొదటి వ్యక్తిగా ఉండొచ్చు. మీ ఇష్టాలను తెలుసుకుని.. వాటిని చేసే మనిషి కావొచ్చు. పదిమందిలో ఉన్నా.. ఒంటరిగా ఉన్నా అంతే కేర్​ చూపించే ఫ్రెండ్​గా మీతో ఉండొచ్చు. తన భవిష్యత్తులో కూడా మీరే ఉంటారని పదే పదే గుర్తు చేయొచ్చు. మీతో ప్రతి విషయాన్ని ఎలాంటి బెరుకు లేకుండా చెప్పగలిగే మనిషి అయి ఉండొచ్చు. ఇవన్నీ అతనిలోని ప్రేమకు సంకేతాలే. 

మరికొందరు మీరు ఎంత ఇబ్బంది పెట్టినా.. సహనంతో మీ చుట్టూ తిరగొచ్చు. మీకోసం గొడవల్లో రాజీ పడొచ్చు. రియల్ బ్యూటీ ఇదేనంటూ మీలో కాన్ఫిడెన్స్​ని నింపొచ్చు. కష్టాల్లో తోడుగా.. ఇష్టాల్లో మీకు సమయం ఇస్తూ.. మీ ఫ్రెండ్​షిప్ లేదా లవ్​ కోసం తపిస్తూ ఉంటారు. అలాంటి వారి జీవితానికి మీరే తుది మజిలీ కావొచ్చు. కాబట్టి మీ ఫ్రెండ్​లో లేదా మిమ్మల్ని ఆరాధించే వ్యక్తుల్లో ఈ లక్షణాలు ఉంటే.. వారి ప్రేమను ఓసారి కన్సిడర్ చేసి చూడొచ్చు. అలాగే ఈ లక్షణాలు ఉన్న అందరూ రియలా? అంటే చెప్పలేము. కొందరు మీ ప్రేమను దక్కించుకోవడం నటిస్తారు కూడా. కానీ రియల్​ లవ్​ని వారి చేతల్లో గుర్తించొచ్చు. అదేమి పెద్ద కష్టం కాదు. చూసే మనసు ఉండాలి అంతే. 

Also Read : 2024లో న్యూ డేటింగ్ ట్రెండ్.. రిస్క్​ లేకుండా ఈ రిలేషన్​షిప్​ ఏదో బానే ఉందిగా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Embed widget