అన్వేషించండి

Thyroid: హైపర్ థైరాయిడిజం ఉందా? ఎముకలు విరుగుతాయి జాగ్రత్త

థైరాయిడ్ సమస్యతో బాధపడేవాళ్లు ఎముకల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

థైరాయిడ్ అధికంగా ఉత్పత్తి  అయ్యేవారిలో వచ్చే సమస్యను హైపర్ థైరాయిడిజం అంటారు. థైరాయిడ్ హార్మోను అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల జీవక్రియ రేటు పెరిగిపోతుంది. అలాగే బరువు తగ్గడం, చేయి వణకడం, గుండు వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపొరోసిస్) వంటి ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కీళ్ల సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్సులు కూడా అధికం. 

ఆస్టియోపొరోసిస్ అనేది ఒక సైలెంట్ డిసీజ్. ఇది ప్రధానంగా  మహిళల్లోనే కలుగుతుంది. హైపర్ థైరాయిడిజం బారిన పడిన స్త్రీలలో ఇది వచ్చే అవకాశం ఎక్కువ. వీరిలో  ఎముకల గట్టిదనం తగ్గి చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎముకలు పెళుసుగా మారి ఫ్రాక్చర్లు త్వరగా అవుతాయి. గాయం తగిలి ఎముకలు విరిగే వరకు ఆస్టియోపొరోసిస్ వచ్చిన సంగతి కూడా తెలిసే అవకాశం తక్కువ. కాబట్టి హైపర్ థైరాయిడిజంతో బాధపడే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎముకలు బలహీనంగా మారడానికి కారణం కాల్షియం, విటమిన్ డి తక్కువగా అందడమే.  

థైరాయిడ్ ఎముకలను ఎలా ప్రభావితం చేస్తుంది?
బ్రిటీష్ థైరాయిడ్ ఫౌండేషన్ ప్రకారం, హైపర్ థైరాయిడిజం, ఎముకలతో సహా మొత్తం శరీర జీవక్రియను నియంత్రిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలలో ఏదైనా భంగం ఏర్పడితే, దాని కారణంగా ఎముక అణువులు కరిగిపోవడం, సమతుల్యత దెబ్బతినడం వంటివి జరుగుతాయి.

థైరాయిడ్ హార్మోన్ అధికంగా విడుదలై, ఎముకను కోల్పోయే రేటును వేగవంతం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 
ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, సెకండరీ బోలు ఎముకల వ్యాధికి హైపర్ థైరాయిడిజం ఒక ముఖ్యమైన కారణం.

హైపర్ థైరాయిడిజంతో బాధపడేవాళ్లు ఖనిజాలు, విటమిన్ల లోపం రాకుండా చూసుకోవాలి. విటమిన్ డి పుష్కలంగా అందేలా సూర్యకాంతిలో నిల్చోవాలి. కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. థైరాయిడ్ అదుపులో ఉండేలా చూసుకోవాలి. థైరాయిడ్ మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలి.

ఆహారపరంగా కూడా  చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసొన, పాలు, పెరుగు, పనీర్, తాజా పండ్లు, కూరగాయలు తినాలి. రోజు గ్లాసుడు పాలు తాగితే కాల్షియం లోపం రాకుండా ఉంటుంది. విటమిన్ డి కోసం పచ్చసొన తినాలి. సూర్యకాంతిలో నిలబడాలి.

 

Also read: ప్రేమమూర్తి అయిన అమ్మకు అందంగా ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి

Also read: మీకు ఇష్టమైన పండు ఏదో చెప్పండి, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసిపోతుంది

Also read: షుగర్ వ్యాధిని అదుపులో పెట్టే అద్భుత ఔషధం ఇది, ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

టాప్ హెడ్ లైన్స్

Floor Cleaning Tips: ఫ్లోర్‌ తుడుస్తున్నప్పుడు నీటిలో ఇవి కలిపితే ఇల్లంతా ధగధగ మెరుస్తుంది!
ఫ్లోర్‌ తుడుస్తున్నప్పుడు నీటిలో ఇవి కలిపితే ఇల్లంతా ధగధగ మెరుస్తుంది!
Chicken Pulao Recipe: చికెన్ పులావ్ సీక్రెట్ రెసిపీ తెలుసుకుంటే చికెన్ బిర్యానీని మర్చిపోతారు!
చికెన్ పులావ్ సీక్రెట్ రెసిపీ తెలుసుకుంటే చికెన్ బిర్యానీని మర్చిపోతారు!
How To Cut Bhindi: బెండకాయను ఎలా కట్ చేయాలి? సరిగ్గా కోయకుంటే టేస్ట్‌ పోతుంది!
బెండకాయను ఎలా కట్ చేయాలి? సరిగ్గా కోయకుంటే టేస్ట్‌ పోతుంది!
How To Get Rid Of Lizards At Home: ఇంట్లో బల్లులను చంపకుండా వదిలించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే!
ఇంట్లో బల్లులను చంపకుండా వదిలించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
US Iran War: ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌లోకి నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ - 6 వేరియంట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్లు & ప్రీమియం ఫీచర్లతో లాంచ్‌
కేవలం రూ.10.49 లక్షలకే కొత్త నిస్సాన్ టెక్టాన్ - క్రెటా, సెల్టోస్‌కు కొత్త సవాల్
Breaking News:నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
Lenin Live Updates: లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
Benefits Of Matcha Tea: గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
Prashna Ravan: రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
Embed widget