By: ABP Desam | Updated at : 23 Jul 2022 06:42 PM (IST)
Representational Image/Pixabay
కవల పిల్లలను చూసేందుకు భలే ముచ్చటగా ఉంటుంది. కానీ, రెండో సారి కూడా కవల పిల్లలే పుడితే? ఆనందం మాట దేవుడెరుగు.. రెండు షిఫ్టులు పనిచేసినా వారిని పోషించలేరు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు అదెంతో కష్టం. అయితే.. ఉగాండాకు చెందిన ఓ జంటకు ఏకంగా ఐదు సార్లు కవల పిల్లలు పుట్టారు. మొత్తం 10 మంది పిల్లలను పోషించే భారం వారిపై పడింది. ఆ పిల్లలను కన్నది నువ్వే, వారి బాధ్యతలు కూడా నువ్వే చూసుకోవాలంటూ భర్త ఆమెను వదిలించుకున్నాడు.
లోంగో గ్లోరియా అనే మహిళ నాలుగు సార్లు కవల పిల్లలకే జన్మనిచ్చింది. ఐదోసారైనా కవలల నుంచి ముక్తి లభిస్తుందని అనుకుంది. కానీ, అలా జరగలేదు. ఐదో సారి మరో ఇద్దరు పుట్టడంతో.. పిల్లల సంఖ్య పదికి చేరుకుంది. దీంతో ఆమె భర్త స్సలోంగో ఇది అసాధారణం, ఇందులో నా ప్రమేయం లేదంటూ.. రాత్రికి రాత్రి ఆమెను, పిల్లలను ఇంటి నుంచి గెంటేశాడు.
ఈ సందర్భంగా గ్లోరియా మాట్లాడుతూ.. ‘‘నేను ఐదోసారి గర్భవతి అయ్యానని తెలిసిన మూడో రోజే నా భర్త ఇంటి నుంచి వెళ్లిపోమన్నాడు. దీంతో నేను కంపాలకు ఇళ్లల్లో పనులు చేస్తూ ఉపాధి పొండానికి వచ్చేశాను. ఇప్పుడు నా భర్త ఫోన్ నెంబరు కూడా నాదగ్గర లేదు’’ అని గ్లోరియా స్థానిక మీడియా సంస్థకు తెలిపింది. ‘‘ఈ పిల్లలందరికీ జన్మనిచ్చినందుకు నేను బాధపడను. వాళ్ల నాన్నకు వాళ్లంటే ఇష్టం లేదని నాకు తెలుసు, వాళ్లను ఆయన దగ్గర వదిలేయలేను. సవాళ్లు ఉన్నప్పటికీ, నేను నా పిల్లలను ఎప్పటికీ వదిలిపెట్టను. దేవుడు సాయం చేస్తాడని నాకు తెలుసు’’ అని తెలిపింది.
‘‘నా పది మంది పిల్లల్లో కొందరు ఇప్పటికే వివిధ పనుల కోసం వెళ్లిపోయారు. ఒకరు మరణించారు. అంతమంది పిల్లలతో ఉండేందుకు ఇంటి యజమాని అంగీకరించకపోవడంతో నేను కొత్త ఇంట్లోకి వెళ్లాను. లాక్‌డౌన్ సమయంలో ఇల్లు అద్దె చెల్లించడం కూడా కష్టమైపోయింది. కుటుంబపోషణ భారమైంది. ఆ ఇల్లు వదిలి మరోక ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది’’ అని తెలిపింది. పాపం గ్లోరియా ఇంకా ఆ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంది. ఆమెకు ఎవరైనా సాయం చేస్తే బాగుంటుంది కదూ. (Image Credit: NTV Mwasuze Mutya)
Also Read: ఈ వయస్సు వచ్చాక మగాళ్ల లైంగిక శక్తి మటాష్, ఇలా చేస్తే సేఫ్!
Also Read: ఎలోన్ మస్క్ తండ్రి వీర్యానికి అంత డిమాండా? 76 ఏళ్ల వయస్సులోనూ అదేపని!
Viral Video: చిరుతతో ఆటలేంట్రా నాయనా? అదేమైనా కుక్క పిల్లా, తోకపట్టుకుని లాగుతున్నావ్?
స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కడుపులో మంటగా ఉందా? ఇవిగో ఆయుర్వేద చిట్కాలు
టాయిలెట్లో టైంపాస్? గంటలు గంటలు కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!
30 Days Water Challenge: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..
70 ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన బామ్మగారు, 54 ఏళ్ల కల ఫలించిన వేళ!
Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల
AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు