News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Taapsee Pannu Six Pack Body: ‘సిక్స్ ప్యాక్’ బాడీతో తాప్సీ సర్‌ప్రైజ్ - ఈ డైట్ పాటిస్తే మీరూ ఆమెలా ఫిట్‌గా మారిపోవచ్చు!

సిక్స్ ప్యాక్ బాడీ అనగానే హీరోలే గుర్తుకు వస్తారు. ఈ విషయంలో తామేమి తక్కువ కాదని నిరూపించింది తాప్సీ. తన సిక్స్ ప్యాక్ బాడీతో ఇప్పుడు అందరినీ తన వైపుకి తిప్పేసుకుంది.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ నటి తాప్సీ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో తాప్సీ సిక్స్ ప్యాక్ అబ్స్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫోటో పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే తన అభిమానులు లైకుల మీద లైకులు కొట్టేస్తూ వైరల్ చేస్తున్నారు. ఆమె కొత్త లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. సిక్స్ ప్యాక్ బాడీ పొందటం కోసం తాప్సీ చాలా కష్టపడ్డారని ఆమె డైటీషియన్ చెప్పుకొచ్చారు. ఇలా కనిపించడం కోసం తాప్సీ నెలకు లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టినట్టు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు.

గతేడాది నవంబర్ లో తాప్సీ సిక్స్ ప్యాక్ బాడీ రావాలని కోరుకుంటున్నట్టు ఆమె తన డైటీషియన్ కి చెప్పారంట. తన చేతిలో కొద్ది రోజులు సమయం మాత్రమే ఉందని అనుకున్న రోజుల్లోగా సిక్స్ ప్యాక్ తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడినట్టు డైటీషియన్ చెప్పుకొచ్చింది. సిక్స్ ప్యాక్ పొందటం అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. కనీసం 3-4 నెలల నుంచి సంవత్సరం వరకు సమయం పడుతుంది. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, రెగ్యులర్ బ్లడ్ వర్క్ ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు.

తాప్సీ సిక్స్ ప్యాక్ ఇలా 

ముందుగా ఆమె శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించాలీ, బరువు తగ్గించి శరీరాన్ని టోన్ చేసేందుకు తాప్సీ రెడీ అయిపోయారు. రష్మీ రాకెట్ సినిమా కోసం తాప్సీ కండలు తిరిగిన దేహంతో బరువుగా కనిపించింది. కానీ దానికి పూర్తిగా భిన్నంగా ఆమె ఇప్పుడు సన్నగా మారిపోయారు. సిక్స్ ప్యాక్ వచ్చేలా చేయాలనుకుంటే ముందుగా చేయాల్సింది కొవ్వుని కరిగించుకోవడం. ఈ విషయంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ శ్రమ పడతారు. కిచెన్ లో దొరికే పదార్థాలు, సప్లిమెంట్స్ తీసుకుని తాప్సీ తన రూపాన్ని మార్చుకున్నారు.

ఉదయాన్నే పేగులు సరిగా ఉండేలా చూసుకోవడం కోసం త్రిఫల చూర్ణం తీసుకుంది. పేగులు ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలో ఏదైనా సరిగా పని జరుగుతుంది. ఉబ్బరం లేకుండా ఉండటం కోసం ప్రతిరోజు త్రిఫల చూర్ణం తీసుకున్నారు. పీరియడ్స్ సమయంలో పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. బాడీ ఫియట్ పర్సెంటేజ్ తగ్గుతున్నప్పటీ పీరియడ్స్ సమయంలో ఉబ్బరంగా ఉంటుంది. ఆ ఉబ్బరాన్ని తగ్గించేందుకు వేరే ప్లాన్ ఫాలో అయినట్టు ఆమె న్యూట్రీషియన్ చెప్పుకొచ్చారు.

మూత్రవిసర్జన సరిగా జరిగేలా ఉండేందుకు వామ్ము తీసుకుంది. చాలా మంది బాడీ బిల్డర్లు మూత్రవిసర్జన కోసం సప్లిమెంట్లు ఉపయోగిస్తారు. కానీ దానికి బదులుగా వామ్ము ఇచ్చినట్టు ఆమె చెప్పుకొచ్చారు. దీన్ని పీరియడ్స్ రావడానికి ఏడు రోజుల ముందు నుంచి నెలసరి కొనసాగిన అన్నీ రోజులు ఇచ్చారు.

స్టెరాయిడ్స్ తీసుకోలేదు కానీ..

తాప్సీ కండలు చూసి కొంతమంది నెటిజన్స్ స్టెరాయిడ్స్ తీసుకున్నారా అని అడుగుతున్నారు. కానీ సురక్షితమైన సప్లిమెంట్స్ మాత్రమే తీసుకున్నట్టు తెలిపారు. బరువు పెరగాల్సి వచ్చినప్పుడు స్టెరాయిడ్స్ ఉపయోగిస్తారు. కానీ రష్మీ రాకెట్ సినిమా సమయంలో కూడా తాప్సీ బరువు పెరగడం కోసం స్టెరాయిడ్స్ తీసుకోలేదు. కండరాల పునరుద్ధరణ కోసం L గ్లుటామైన్ ఉపయోగించారు. శరీరం బాగా టోన్డ్ లుక్ కనిపించడం కోసం ఇదే తీసుకుంటారు.

డైటీషియన్ కి లక్ష ఫీజు

తాప్సీ శిక్షకురాలు గనేరివాల్ కి లక్ష రూపాయలు ఫీజు చెల్లించినట్టు వార్తలు వచ్చాయి. వాటిని నిజమని గనేరివాల్ అంగీకరించారు. ఆరోగ్యం కోసం తాప్సీ నుంచి సంవత్సరానికి రూ.12 లక్షలు తీసుకున్నట్టి ఆమె తెలిపారు. నా వెబ్ సైట్ లో ఫీజు వివరాలు ఉంటాయి. అందులో దాచేందుకు ఏమి లేదు. తాప్సీకి ఎప్పుడు ఒక సంవత్సరం ప్యాకేజీ ఉంటుంది. వేర్వేరు లక్ష్యాల ప్రకారం వేర్వేరు రేట్లు ఉండవని ఆమె తెలిపారు.

నయనతారకి ఏడాది పట్టింది

నయనతార షారూఖ్ ఖాన్ తో జవాన్ సినిమా కోసం రూపాంతరం చెందాలనుకున్నప్పుడు ఆమె దాదాపు ఏడాది పాటు సమయం వెచ్చించారు. ఆ సమయంలో నయనతార కొత్త కాబట్టి అంత సమయం పట్టింది. కానీ ఇప్పుడు ఆమె తన రూపాన్ని మార్చుకోవాలి అనుకుంటే లక్ష్యాన్ని బట్టి 3-4 నెలల సమయం తీసుకుంటానని గనేరివాల్ ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: రోగనిరోధక శక్తి పెంచుకోవాలంటే ఇవి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే

Published at : 11 Apr 2023 07:03 PM (IST) Tags: Healthy lifestyle Taapsee Pannu Taapsee Pannu Diet Plan Taapsee Six Pack Body

ఇవి కూడా చూడండి

Google Lens : గూగుల్​ లెన్స్​తో మీరు ఈ విషయం తెలుసుకోవచ్చు తెలుసా?

Google Lens : గూగుల్​ లెన్స్​తో మీరు ఈ విషయం తెలుసుకోవచ్చు తెలుసా?

Mustard Oil: చలికాలంలో చర్మాన్ని రక్షించే ఆవనూనె, ఇలా ఉపయోగించండి

Mustard Oil: చలికాలంలో చర్మాన్ని రక్షించే ఆవనూనె, ఇలా ఉపయోగించండి

Telugu Recipes: పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి

Telugu Recipes: పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి

Low Carb Diet : బరువు తగ్గాలనుకుంటే.. ఈ ఫుడ్స్ కచ్చితంగా తినండి

Low Carb Diet : బరువు తగ్గాలనుకుంటే.. ఈ ఫుడ్స్ కచ్చితంగా తినండి

Immunity Booster : పిల్లల్లో ఇమ్మూనిటీని పెంచే అల్లం, క్యారెట్ సూప్.. రెసిపీ ఇదే

Immunity Booster : పిల్లల్లో ఇమ్మూనిటీని పెంచే అల్లం, క్యారెట్ సూప్.. రెసిపీ ఇదే

టాప్ స్టోరీస్

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి