అన్వేషించండి

Vitamin D : చలికాలంలో ‘విటమిన్ - D’ పొందటం ఎలా? అది లోపిస్తే ఏం జరుగుతుంది?

ప్రతి మనిషికి విటమిన్ D అనేది అత్యవసరం. విటమిన్ D లోపం ఉంటే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అయితే చలికాలంలో విటమిన్ D అవసరం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. విటమిన్ D లభించే ఆహారం ఏంటో తెలుసుకుందాం.

శీతాకాలం వచ్చేసింది. ఈ కాలం వచ్చింది అంటే చాలు చలిపులి విజృంభిస్తుంది. అంతేకాదు సూర్యరశ్మి కూడా తగ్గిపోతుంది. ఈ కారణంగా చాలా మందిలో  విటమిన్-డి లోపం తలెత్తుతుంది. అయితే చలికాలంలో కాసేపు ఎండలో కూర్చోమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. అయితే ఎండతో పాటు, మీ ఆహారంలో విటమిన్-D అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చమని నిపుణులు సూచిస్తున్నారు.

మన ఎముకలు, దంతాలు, కండరాల ఆరోగ్యానికి విటమిన్-డి చాలా ముఖ్యమైన పోషకం. అంతేకాకుండా, ఇది శరీరంలో కాల్షియం, ఫాస్ఫేట్ ఎముకలకు సరిగ్గా చేరడానికి విటమిన్-D ఉపయోగపడుతుంది. విటమిన్-D మన ఎముకలను బలపరుస్తుంది. Vitamin-D లోపం ఉంటే ఎముకలు బలహీనంగా మారే అవకాశం ఉంది. చివరకు అది ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధికి దారితీస్తుంది. అయితే నిజానికి విటమిన్-D కావాలంటే మనశరీరానికి  అతిపెద్ద మూలం సూర్య కిరణాలు, కాబట్టి దీనిని సూర్యకాంతిలో మన శరీరం ఎక్స్ పోజ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది, కాబట్టి నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ కాలంలో విటమిన్-D లోపం సర్వసాధారణం. అటువంటి పరిస్థితిలో, విటమిన్-D ఎలా పొందాలో తెలుసుకుందాం. 

చలి కారణంగా మనం బయట తిరిగేందుకు అంత ఆసక్తి చూపించము. కానీ ఇది చెడ్డ అలవాటు. రోజూ ఆరు బయట కాసేపు ఎండలో కూర్చోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శాస్త్రవేత్తల  పరిశోధనల ప్రకారం, మీరు రోజూ 8 నుంచి 15 నిమిషాల పాటు సూర్యరశ్మిని తీసుకోవడం ద్వారా తగినంత విటమిన్-D పొందవచ్చు. 

విటమిన్-D అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి:

సూర్యరశ్మిని తీసుకోవడమే కాకుండా, మీరు మీ ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలి. మీ ఆహారం శరీరానికి అన్ని పోషకాలను అందిస్తుంది, సూర్యరశ్మి విటమిన్-D  ఉత్తమ మూలం. అయినప్పటికీ, ప్రతిరోజూ తినే కొన్ని ఆహారాలు కూడా వాటి స్థాయిలను పెంచుతాయి. మీరు మీ ఆహారంలో ఈ ఆహారాలను చేర్చవచ్చు: నారింజ,  గుడ్లు. పుట్టగొడుగు. ట్యూనా చేప. సాల్మన్ చేప. పాశ్చరైజ్డ్ పాలు. ధాన్యంలో విటమిన్-D లభిస్తుంది.

విటమిన్-D లోపం  లక్షణాలు ఏమిటి?

శరీరంలో విటమిన్-D లోపం ఉన్నప్పుడు, మీరు ఈ క్రింది లక్షణాలు మీలో కనబడవచ్చు:

- శరీరం బలహీనంగా ఉంటుంది.

- రాత్రి పడుకున్నాక కూడా అలసటగా అనిపిస్తుంది.

- ఎముకలు, కీళ్ళలో నొప్పి.

- కండరాల బలహీనత, నొప్పి లేదా కండరాల తిమ్మిరి

- డిప్రెషన్ వంటి మూడ్ మార్పులు

విటమిన్-D సప్లిమెంట్లను ఎప్పుడు తీసుకోవాలి?

మీరు తగినంత సూర్యకాంతి పొందలేనప్పుడు,  లేదా మీ ఆహారంలో  తగినంత విటమిన్-D పొందకపోతే, మీరు విటమిన్-D సప్లిమెంట్లను తీసుకోవలసి రావచ్చు. అయితే విటమిన్-D సప్లిమెంట్లను తీసుకునే ముందు, మీ వైద్యుడిని సంప్రదించండి.

Read Also :  ఉప్పు లేదా చక్కెర - వీటిలో అత్యంత ప్రమాదకరమైనది ఏమిటో తెలుసా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Embed widget