అన్వేషించండి

Unauthorized Posts : మీ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో మీ ఫోటోలు పోస్ట్ చేశారా? ఇలా డిలీట్ చేసేయండి

Steps to Delete Unauthorized Posts : మీ పర్మిషన్ లేకుండా మీ ఫోటోలు లేదా వీడియోలు ఎవరైనా సోషల్ మీడియాలో అప్​లోడ్  చేశారా? అయితే కంగారు పడకండి. వాటిని డిలీట్ చేసేందుకు ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. 

Protect Your Privacy : ఈ మధ్యకాలంలో ఒకరి పర్మిషన్ లేకుండా ఫోటోలు తీయడం, వీడియోలు తీసి వైరల్ అవ్వడానికి పోస్ట్ చేయడం వంటివి చూస్తూనే ఉన్నాము. అవి కొందరికి మేలు చేస్తే.. మరికొందరికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. పైగా డిజిటల్ యుగంలో ఒక్క వీడియో ఎప్పుడు.. ఎలా వైరల్ అవుతుందో.. ఎన్ని దేశాలకు రీచ్ అవుతుందో చెప్పలేము. అలాంటప్పుడు మీరు ఆ సోషల్ మీడియా నుంచి ఆ వీడియో డిలీట్ చేయడం సాధ్యమవుతుందో? లేదో.. ఇప్పుడు చూసేద్దాం.

సోషల్ మీడియాలో రీచ్ కోసం.. లేదా వైరల్ కంటెంట్ కోసం చూసే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దానిలో భాగంగా తమ వీడియోలే కాకుండా.. తాము చూసిన వీడియోలు కూడా వైరల్ చేస్తున్నారు. కొన్ని వీడియోలకు బ్యాక్​గ్రౌండ్ స్కోర్ పెట్టి నిమిషాల్లో వేలల్లో లైక్​లు, వ్యూస్​లు సంపాదిస్తున్నారు. తమ రీచ్ కోసం ఎదుటివారి పర్మిషన్ లేకుండా ఇలా పోస్ట్ చేయడం చట్ట రీత్యా నేరం. అయితే కొన్ని సందర్భాల్లో చట్టాన్ని ఆశ్రయించేందుకు కొందరు భయపడతారు. అలాంటివారికోసమే ఇది. 

ఇన్​స్టాలో ఇలా డిలీట్ చేసేయండి..

మీకు సంబంధించిన ఫోటో లేదా వీడియో ఇన్​స్టాలో కనిపిస్తే దాని లింక్ కాపీ చేసుకుని.. httpps://help.instagram.com/contact/552695131608132 అనే వెబ్ సైట్ లింక్ ఓపెన్ చేయండి. దానిలో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ పూర్తి పేరు, డీటైల్స్ ఇచ్చి.. మీరు కాపీ చేసిన లింక్ పేస్ట్ చేయాలి. ఏ టైప్ కంటెంట్ ఫోటో లేదా వీడియో అనేది మెన్షన్ చేయాలి. తర్వాత ఎంటర్ కొడితే రెండు గంటల్లోపు ఆ పోస్ట్ డిలీట్ అయిపోతుంది. ఇది కేవలం ఇన్​స్టాగ్రామ్​కి మాత్రమే. 

ఇన్​స్టా కాకుండా మరేదైనా ప్లాట్​ఫామ్ అయితే..

మీకు సంబంధించిన ఫోటో లేదా వీడియో కేవలం ఇన్​స్టాలోనే కాదు.. ఏ ఇతర సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​​లలో అయినా ఉండవచ్చు. అలాంటప్పుడు దానిని డిలీట్ చేసేందుకు stopncii.org వెబ్​సైట్ ఓపెన్ చేసి.. క్రియేట్ యువర్ కేస్ మీద క్లిక్ చేయాలి. లీకైన మీ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు ఇక్కడ అప్​లోడ్ చేయాలి. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎక్కడున్నా.. 24 గంటల్లోపు అన్నీ డిలీట్ అయిపోతాయి. ఎవరైనా దానిని డౌన్​లోడ్ చేసుకుంటే తీయలేకపోవచ్చు కానీ.. ఏ సోషల్ మీడియాలో ఉన్నా సరే డిలీట్ చేయవచ్చు. 

ఇతరుల కంటెంట్ పోస్ట్ చేసేముందు జాగ్రత్త ఎందుకంటే

మీకు సంబంధించిన వీడియోలు ఉంటే.. వాటిని డిలీట్ చేసేందుకు ఈ టెక్నిక్స్ వాడండి. అలాగే ఈ ఇన్​ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్​కి షేర్ చేయండి. దీనివల్ల కొన్ని ఇబ్బందులు జరగకుండా ఆపగలుగుతారు. ఇలాంటి వీడియోలు పూసలమ్మే మోనాలిసా లాంటి వాళ్లకి హెల్ప్ కావచ్చు. కానీ అందరకీ అలా మంచి జరగకపోవచ్చు. కాబట్టి మీరు ఎవరి వీడియోలు అయినా వారి పర్మిషన్ లేకుండా షేర్ చేసేముందు కచ్చితంగా ఆలోచించండి. ఎందుకంటే అవతలి వాళ్లు కేసు పెడితే మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని గుర్తించుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Embed widget