Optical Illusion: మీకు ఇందులో ఎన్ని గుర్రాలు కనిపిస్తున్నాయి? మీరే చెప్పే సంఖ్యే మీరెలాంటి వారో చెబుతుంది

ఆసక్తికరమైన మరో ఆప్టికల్ ఇల్యూషన్ ఇది. దీన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేయచ్చు.

FOLLOW US: 

మెదడుకు, కళ్లకు సవాలు విసిరే ఆప్టికల్ ఇల్యూషన్ ఇది. దీనిలో మీకు ఎన్ని గుర్రాలు కనిపిస్తున్నాయో చెబితే మీరెలాంటి వారో, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో అంచనా వేయచ్చు. ఈ చిత్రంలో కొన్ని గుర్రాలు కలిపి పెద్ద గుర్రం ముఖంలా కనిపిస్తోంది. అలాగే బోలెడన్నీ గుర్రాలు పరుగులు తీస్తున్నట్టు కూడా కనిపిస్తున్నాయి. 

ఒక గుర్రం కనిపిస్తే...
మొదటి సారి చూసినప్పుడు మీకు పెద్దగుర్రం ఒక్కటే కనిపించే అవకాశం కూడా ఉంది. అలా మీకు పెద్ద గుర్రం ఒక్కటే కనిపిస్తే మీరు చాలా విశాల దృష్టి కలవారు. మీరు నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం చాలా తొందరపడతారు. విషయాలను సరిగా అంచనా వేయకుండానే నిర్ణయాలు తీసుకుంటారు. దేని గురించీ లోతుగా ఆలోచించరు. 

5 నుంచి 10
మీకు ఆ చిత్రంలో అయిదు నుంచి పది గుర్రాలలోపు కనిపిస్తే మీరు మంచి పర్ఫెక్షనిస్టు అని చెప్పాలి. మీరు ఏ విషయాలను తేలికగా తీసుకోరు. విలువైన వాటికి ప్రాముఖ్యత ఇస్తారు. మీరు నిర్ణయం తీసుకునే విధానం చాలా హేతుబధ్ధంగా ఉంటుంది. తెలివిగా వ్యవహరిస్తారు. మీరు వెళ్లే మార్గం కొన్ని ఇబ్బందులను కలిగిస్తుంది. అయినా లక్ష్యాన్ని మాత్రం సాధిస్తారు. 

11కి మించి కనిపిస్తే...
చిత్రంలో 11కి మించి గుర్రాలు కనిపిస్తే మీ చూపు చాలా నిశితమైనదని అర్థం. ఇతరులు గమనించని విషయాలను కూడా మీరు గమనిస్తారు. బాధ్యతగా ఉంటారు. మీతో కలిసిపనిచేసేందుకు సహోద్యోగులు ఆసక్తి చూపిస్తారు. అయితే ఒక్కోసారి ఓ పనిని కొనసాగించాలా? లేక ఆపేయాలా అని నిర్ణయం తీసుకునే విషయంలో తరచూ చిక్కుకుపోతారు. అలాగే అంతిమ ఫలితాలు ఎప్పుడూ మీకు సంతృప్తినివ్వవు. 

ఆప్టికల్ ఇల్యూషన్ పుట్టుక వెనుక వేల ఏళ్ల నాటి శిలాజాల ప్రభావం ఉన్నట్టు చెబుతారు. చాలా ఏళ్ల క్రితమే ఇవి వాడుకలో ఉన్నాయని చరిత్రకారుల అభిప్రాయం. చురుగ్గా పనిచేసే మెదడుకు మేతగా ఇలాంటి ఆటలను ఆడేవారు అప్పట్లో. వీటికి సంబంధించి శిలాజ రికార్డులు కూడా లభించాయి. ఎవరు, ఎప్పుడు మొదలుపెట్టారో మాత్రం తెలియదు. వీటితో కాసేపు కాలక్షేపం చేస్తే చాలు మెదడు చురుగ్గా పనిచేస్తుంది, కంటిచూపు పదును తేలుతుంది. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలకు డిమాండ్ ఎక్కువ. సోషల్ మీడియాలో వీటిదే హవా. 

Also read: పిల్లల దుస్తుల్లో 60 శాతం విష రసాయనాలు, గ్రీన్ సర్టిఫికెట్ అబద్ధమే

Also read: చైనా అధ్యక్షుడి ఆరోగ్యాన్ని కుంగదీస్తున్న సమస్య ఇదే, అది ఎంత ప్రమాదకరమంటే

Published at : 12 May 2022 09:49 AM (IST) Tags: Optical illusion Optical Illusions illusion best optical illusions optical cool optical illusions illusions optical illusion test optical illusions that make you see things optical illusion video optical illusions for kids optical illusions game optical illusion art amazing optical illusion optical illusion pictures mind blowing optical illusions flying optical illusion insane optical illusions mind blowing optical illusion minecraft optical illusions

సంబంధిత కథనాలు

Moon sand: చంద్రుని మట్టిలో ఆకుకూరల పెంపకం, భవిష్యత్తులో అక్కడ కూడా పంటలు పండిస్తామా?

Moon sand: చంద్రుని మట్టిలో ఆకుకూరల పెంపకం, భవిష్యత్తులో అక్కడ కూడా పంటలు పండిస్తామా?

World Bee Day 2022: వేల తేనెటీగల కష్టమే మనం తాగే స్పూను తేనె, నేడు తేనెటీగల దినోత్సవం

World Bee Day 2022: వేల తేనెటీగల కష్టమే మనం తాగే స్పూను తేనె, నేడు తేనెటీగల దినోత్సవం

Mutton Recipe: తలకాయ కూర వండడం రావడం లేదా? ఇలా అయితే సింపుల్

Mutton Recipe: తలకాయ కూర వండడం రావడం లేదా? ఇలా అయితే సింపుల్

Fertility: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి

Fertility: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి

Umbrella: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే

Umbrella: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే

టాప్ స్టోరీస్

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!