అన్వేషించండి

High Cholesterol : కళ్లు, గోళ్లలోని ఈ మార్పులు అధిక కొలెస్ట్రాల్​కు సంకేతాలు.. ప్రమాదమంటోన్న నిపుణులు

Silent Killer Cholesterol : అధిక కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఇది సైలెంట్ కిల్లర్ అని.. అందుకే కొన్ని లక్షణాలు విస్మరించవద్దని చెప్తున్నారు.

High Cholesterol Warning Signs : వ్యాయామం లేకపోవడం, ఫుడ్ విషయంలో మార్పులు, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు అధిక కొలెస్ట్రాల్‌కు ప్రధాన కారణంగా మారుతున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు.. కొన్నిసార్లు సంకేతాలు ఉండకపోవచ్చు. కానీ అదనపు కొవ్వు కళ్ల చుట్టూ ఉన్న మృదు కణజాలాలలో పేరుకుపోయి.. చిన్న పసుపు మచ్చలను కలిగిస్తుందని చెప్తున్నారు. ఇది శాంథెలాస్మా ప్రారంభ సంకేతంగా కూడా చెప్తారు. 

అధిక కొలెస్ట్రాల్.. గుండె, రక్త నాళాలకు సంబంధించిన తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కానీ కళ్ళ చుట్టూ ఉన్న చర్మం మాత్రమే కాకుండా.. గోర్లు కూడా శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ గురించి హెచ్చరికను ఇస్తాయని మీకు తెలుసా? కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గోళ్లపై కనిపించే 5 లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.

అధిక కొలెస్ట్రాల్ 

అధిక కొలెస్ట్రాల్ అనేది రక్తంలో కొవ్వు (లిపిడ్) పరిమాణం పెరిగే ఒక పరిస్థితి. దీని వలన ధమనులలో ప్లాక్ ఏర్పడి అవి ఇరుకుగా మారుతాయి. ఫలితంగా గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గోళ్లలో కనిపించే లక్షణాలు 

పాలిపోవడం

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు.. కొన్నిసార్లు గోళ్ల రంగు మారి అవి పాలిపోయినట్లు కనిపించడం ప్రారంభిస్తాయి. గోళ్లు సాధారణ గులాబీ రంగుకు బదులుగా పాలిపోయినట్లు లేదా తెల్లగా కనిపిస్తే.. అది అధిక కొలెస్ట్రాల్‌తో సంబంధం ఉన్న రక్త ప్రసరణ సరిగా లేకపోవడానికి సంకేతం కావచ్చు.

గోళ్లపై చారలు

గోళ్లలో మార్పులు తరచుగా అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బులు వంటి అంతర్లీన ఆరోగ్య సమస్య వల్ల సంభవిస్తాయి. గోళ్లపై పెరిగిన గాట్లను ఒనికోరెక్సిస్ అని పిలుస్తారు. ఇవి పోషకాహార లోపాలు, రక్తహీనత వంటి ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా సంభవించవచ్చు.

పెరుగుదల లేకపోవడం

గోర్లు కత్తిరించిన తర్వాత అవి తిరిగి పెరగడానికి చాలా సమయం పడుతుంది. ఇది కూడా అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం కావచ్చు. శరీరంలో రక్త ప్రవాహం తగ్గినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

వంకరగా మారడం

అధిక కొలెస్ట్రాల్ గోళ్లపై కూడా ప్రభావం చూపుతుంది. అవి వంగి, కొనలు స్పాంజిలా కనిపిస్తాయి. ఇది సాధారణంగా కొలెస్ట్రాల్ అసమతుల్యత కారణంగా దీర్ఘకాలిక ఆక్సిజన్ లేమికి సంకేతం.

నీలం లేదా ఊదా రంగు గోళ్లు

అధిక కొలెస్ట్రాల్​కు మరో సంకేతం ఏమిటంటే మీ గోర్లు నీలం లేదా ఊదా రంగులో కనిపించడం ప్రారంభించవచ్చు. మీ గోళ్లలో అలాంటి మార్పులు ఏవైనా గమనించినట్లయితే.. ఆలస్యం చేయకండి. వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jaggery In Winter: చలి కాలంలో బెల్లం ఇలా తీసుకోండి, వీటితో కలిపి తింటే ఆరోగ్యానికి మేలు
చలి కాలంలో బెల్లం ఇలా తీసుకోండి, వీటితో కలిపి తింటే ఆరోగ్యానికి మేలు
Retinol Eye Cream : రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
Sperm Quality : పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
Top 5 Road Trips in India : రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget