అన్వేషించండి

High Cholesterol : మహిళల్లో పెరుగుతోన్న కొలెస్ట్రాల్.. ముఖ్యంగా వారికే ప్రమాదం ఎక్కువ, ఇలా నివారించవచ్చు

High Cholesterol Causes : ఈ మధ్యకాలంలో కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ఆడవారు దీనితో ఇబ్బంది పడుతున్నారు. మరి దీనిని ఎలా అదుపులోకి తీసుకురావాలో చూసేద్దాం. 

High Cholesterol in Women : కొలెస్ట్రాల్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. శరీరానికి ఎనర్జీనివ్వడంలో ఇది హెల్ప్ చేస్తుంది. అయితే ఎక్కువ స్థాయిలో పేర్కొన్నప్పుడు చెడు కొలెస్ట్రాల్​గా మారుతుంది. ఇది క్రమంగా గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుంది. జీవనశైలిలో మార్పులు, ఫుడ్స్, ఇతర ఆరోగ్య సమస్యలు అధిక కొలెస్ట్రాల్​కు కారణమవుతాయి. అందుకే ఈ మధ్యకాలంలో ఈ సమస్య ఎక్కువగా వినిపిస్తుంది. 

అధిక కొలెస్ట్రాల్ అనేది ఆడవారిలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మోనోపాజ్​లో ఉన్న చాలామంది మహిళలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే శరీరంలో విడుదలయ్యే ఈస్ట్రోజెన్ స్థాయిలు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్​ను ప్రోత్సాహిస్తాయి. అయితే మోనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ విడుదల తగ్గి చెడు కొలెస్ట్రాల్​కు దారి తీస్తుంది. ఈ సమస్యను కొన్ని మార్పులతో దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

బరువు

అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలన్నా.. రాకుండా ఉండాలన్నా బరువును అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే కొవ్వు అనేది మెటబాలీజంను ఎఫెక్ట్ చేస్తుంది. జీవక్రియ తగ్గితే బరువు పెరిగిపోతారు. అంతేకాకుండా సోమరిగా ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు బరువును అదుపులో ఉంచుకుంటే మంచిది. 

హెల్తీ డైట్ 

డైట్​లో హెల్తీ ఫుడ్స్ చేర్చుకోవాలి. బయట చేసిన, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. రోజూవారి ఆహారంలో ఫైబర్, పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్, తృణధాన్యాలు, ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ కూడా కొలెస్ట్రాల్​ను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. 
ఓట్స్​, ఫైబర్​తో నిండి ఫుడ్స్ రెగ్యులర్​గా తీసుకోవాలి. అవకాడో కూడా మంచిది. చియాసీడ్స్, వాల్​నట్స్, ఫిష్ ద్వారా శరీరానికి ఒమేగా 3 అందుతుంది. బీన్స్ కూడా ఎక్కువగా తినాలి. 

వ్యాయామం 

రెగ్యులర్​గా వ్యాయామం చేయాలి. ఇది శరీరంలో కొవ్వు అధిక మోతాదులో పేరుకుపోకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే కొవ్వు ఎక్కువగా ఉంటే అది గుండెను నెగిటివ్​గా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. 

నిద్ర 

కనీసం 6 గంటల నిద్ర లేకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. అందుకే రాత్రి నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. నాణ్యమైన నిద్ర గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. 

ఒత్తిడి 

ఒత్తిడి వల్ల కూడా శరీరంలో వివిధ హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి బరువు పెరిగేలా చేయడంతో పాటు వివిధ ఆరోగ్య సమస్యల్ని పెంచుతాయి. వాటిలో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్, జర్నలింగ్, యోగా, డీప్ బ్రీతింగ్ వంటివి చేస్తే మంచిది. 

ఈ టిప్స్​ని రెగ్యులర్​గా ఫాలో అవుతూ వైద్య సహాయం తీసుకుంటే సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. మోనోపాజ్ తర్వాత వచ్చే హార్మోన్ల సమస్యలను గుర్తించి.. వాటిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వడంతో పాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget