అన్వేషించండి

Adult vaccination: పిల్లలకే కాదు పెద్దవారు కూడా కచ్చితంగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు ఇవిగో

పిల్లలకు మాత్రమే కాదు పెద్దవారికి కొన్ని రకాల వ్యాక్సిన్లు ఉన్నాయి.

చాలామంది చిన్న పిల్లలకు మాత్రమే వ్యాక్సిన్లు అనుకుంటారు. కానీ మారుతున్న కాలంలో పెద్దవారికి కూడా వ్యాక్సిన్ల రక్షణ చాలా అవసరం. దీనినే అడల్ట్ వ్యాక్సినేషన్ అంటారు. యువత నుంచి వృద్ధాప్యం వరకు చాలా రకాల వ్యాక్సిన్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఆ వ్యాక్సిన్లు వేసుకోవడం ద్వారా వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. చిన్నపిల్లలకు DPT వ్యాక్సిన్ వేస్తూ ఉంటారు. ఇది డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం వంటివి రాకుండా అడ్డుకోవడానికి ఇస్తుంటారు. ఇదే వ్యాక్సిన్ పెద్దవారికి కూడా ఉంది. దాన్ని Tdap అంటారు.  ఈ వ్యాక్సిన్ ను 11 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు ఖచ్చితంగా ఇప్పించాలి. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంది. 

మహిళలు కచ్చితంగా గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌కు సంబంధించిన వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ సర్వైకల్ క్యాన్సర్... హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ వైరస్ ను నివారించేందుకు HPV వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది కేవలం సర్వైకల్ క్యాన్సర్ కోసమే  కాదు, ఆడవారిలో వచ్చే వెజైనల్ క్యాన్సర్,వల్వెవ్ క్యాన్సర్ కూడా అడ్డుకుంటుంది. ఈ వ్యాక్సిన్ ను 9 ఏళ్ల నుంచి 45 సంవత్సరాల లోపు వయసున్న మహిళలు కచ్చితంగా తీసుకోవాలి.

వానాకాలం మొదలైందంటే అనేక వైరల్ ఇన్ఫెక్షన్లు రావడం మొదలుపడతాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు వ్యాన్సిన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. దీన్ని ఫ్లూ షాట్ అని కూడా పిలుస్తారు. ఇది తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

చికెన్ పాక్స్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్ వల్లే వస్తుంది. దీన్ని మనం ఆటలమ్మ, అమ్మవారు అని పిలుస్తాము. చిన్నప్పుడే వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ ఇస్తారు. ఒకవేళ చిన్నప్పుడు తీసుకోకపోతే 13 ఏళ్లు దాటిన తర్వాత ఈ వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలి. దీన్ని వారిసెల్లా వ్యాక్సిన్ అంటారు. ఇది రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది.

న్యూమోకోకల్ అనే వ్యాధి కూడా ఎక్కువమందిని వేధిస్తోంది. దీన్ని నిరోధించడానికి న్యూమో కోకల్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కచ్చితంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. లేకుంటే ఈ బ్యాక్టీరియా త్వరగా దాడి చేస్తుంది.

జ్వరం నుంచి తప్పించుకునేందుకు టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లలతో పాటు పెద్దలు కూడా అనేక రకాల వ్యాక్సిన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  వీటిని కచ్చితంగా అందరూ తీసుకోవాలి.

Also read: వేసవిలో పొట్ట అప్‌సెట్ అవుతోందా? అయితే తినాల్సిన ఆహారాలు, తినకూడని పదార్థాలు తెలుసుకోండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget