News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Heart Tests: మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో చెప్పే ఆరు టెస్టులు ఇవే

గుండె ఆరోగ్యంగా ఉందో లేదో చెప్పే ఆరు పరీక్షలు ఉన్నాయి.

FOLLOW US: 
Share:

కాలం మారింది. ఒకప్పుడు గుండె పోటు వంటివి చాలా తక్కువ వచ్చేవి. ఇప్పుడు 20 ఏళ్ల వయసు వారికి కూడా ఎప్పుడు గుండె పోటు వస్తుందో చెప్పలేని పరిస్థితి. అందుకే ప్రతి ఒక్కరు గుండె ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె వైఫల్యం, గుండె పోటు, స్ట్రోక్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గుండె లేదా మెదడుకు రక్తం  ప్రవాహానికి అంతరాయాల కారణంగా ఇది సంభవిస్తుంది. గుండె, మెదడు ... ఈ రెండూ అత్యంత ముఖ్యమైన అవయవాలు. గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి కచ్చితంగా చేసుకోవాల్సిన కొన్ని ఆరోగ్య పరీక్షలు ఉన్నాయి. వీటిని ప్రతి ఒక్కరూ చేయించుకుని గుండె ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలి. 

ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG/EKG)
ఎలక్ట్రోకార్టియోగ్రామ్... దీన్నే ఈసీజీ అంటారు. ఈ పరీక్ష గుండె... విద్యుత్ కార్యకలాపాలను, అది కొట్టుకునే వేగాన్ని అంచనా వేయడానికి చేస్తారు. గుండె కొట్టుకునే వేగంలో ఏమైనా అసాధారణతలను ఇది గుర్తిస్తుంది. 

ఒత్తిడి పరీక్ష
వ్యాయామం చేస్తున్న సమయంలో మీ గుండె ఎంత బాగా పనిచేస్తుందో అంచనా వేసే పరీక్ష ఇది. ఒత్తిడి కలిగినప్పుడు గుండె ప్రతిస్పందన ఎలా ఉందో అంచనా వేయడంలో సహాయపడుతుంది. కరోనరీ ఆర్టరీ వ్యాధి వంటి వాటిని గుర్తిస్తుంది.

ఎకోకార్డియోగ్రామ్
ఈ పరీక్ష గుండె నిర్మాణం, పనితీరు ఎలా ఉందో చెప్పేందుకు ధ్వని తరంగాలను ఉపయోగిస్తుంది. ఇది గుండె పంపింగ్ సామర్థ్యం, ​​వాల్వ్ పనితీరు,  మొత్తం ఆరోగ్యం గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది.

కార్డియాక్ కాథెటరైజేషన్
ఈ ఇన్వాసివ్ ప్రక్రియలో ఒక సన్నని ట్యూబ్ (కాథెటర్)ని రక్తనాళం ద్వారా గుండెకు థ్రెడ్ చేయడం జరుగుతుంది. ఇది రక్త ప్రవాహం ఎలా ఉందో చెప్పడానికి, గుండె లోపల ఒత్తిడిని కొలవడానికి,ఏదైనా అడ్డంకులు, అసాధారణతలను అంచనా వేయడానికి ఇది సహకరిస్తుంది.

బ్లడ్ టెస్టు
రక్త పరీక్ష ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు, లిపిడ్ ప్రొఫైల్స్, ట్రోపోనిన్ వంటి పరీక్షలు చేస్తారు. రక్తంలో కొలెస్ట్రాల్ ఎంత ఉందో రక్త పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. 

CT స్కాన్ లేదా MRI
ఈ ఇమేజింగ్ పరీక్షలు గుండె నిర్మాణం చూపిస్తాయి. నిర్మాణంలో ఏదైనా అసాధారణతలు, అడ్డంకులు ఉంటే ఈ పరీక్షల్లో తెలిసిపోతుంది.

వయసు పెరిగిన వారు, ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తున్న వారు వెంటనే పైన చెప్పిన పరీక్షలన్నీ చేయించుకోవాలి. ఏడాదికి ఒకసారైనా ఈ పరీక్షలన్నీ చేయించుకుంటూ ఉండాలి. దీని వల్ల గుండె సమస్యలను ముందే పసిగట్టవచ్చు. గుండె పోటు రాకుండా అడ్డుకోవచ్చు. 

Also read: ఈ కాయల పేరేంటో తెలుసా? కనిపిస్తే కచ్చితంగా వండుకొని తినండి

Also read: ఆ రాష్ట్రంలో పెరుగుతున్న ర్యాట్ ఫీవర్ కేసులు, ఈ జ్వరం ఎవరికైనా రావచ్చు - లక్షణాలు ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 09 Jul 2023 08:29 AM (IST) Tags: Heart Attack Healthy Heart Heart Health Test for Heart

ఇవి కూడా చూడండి

World Heart Day 2023: ఈ ఐదు విషయాలు బాగున్నాయంటే మీ గుండె పదిలంగా ఉన్నట్టే లెక్క!

World Heart Day 2023: ఈ ఐదు విషయాలు బాగున్నాయంటే మీ గుండె పదిలంగా ఉన్నట్టే లెక్క!

Salt: మూడు రకాల ఉప్పుల్లో ఏది ఆరోగ్యానికి ఉత్తమమైందో తెలుసా?

Salt: మూడు రకాల ఉప్పుల్లో ఏది ఆరోగ్యానికి ఉత్తమమైందో తెలుసా?

Dengue: డెంగ్యూ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హాస్పిటల్‌లో ఎప్పుడు చేరాలి?

Dengue: డెంగ్యూ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హాస్పిటల్‌లో ఎప్పుడు చేరాలి?

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

టాప్ స్టోరీస్

RK Roja: ఆటో డ్రైవర్‌ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?

RK Roja: ఆటో డ్రైవర్‌ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం