అన్వేషించండి

 Heavy Bleeding : పీరియడ్స్‌లో ఎక్కువ బ్లీడింగ్ అవుతుందా? ఇది నార్మలా? ఏం తింటే మంచిది?

Heavy Bleeding During Periods : కొందరికి పీరియడ్స్​ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. దీనికి కారణాలు ఏంటి? ఆ సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో చూసేద్దాం. 

Heavy Menstrual Bleeding : పీరియడ్స్ సమయంలో కొందరికి రక్తస్రావంగ నార్మల్​గానే ఉంటుంది. కానీ కొందరికి మాత్రం చాలా ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది. దీంతో రోజులో ఎక్కువసార్లు ప్యాడ్స్ మార్చుకోవాల్సి వస్తుంది. రక్తస్రావం ఎక్కువకావడం వల్ల బలహీనంగా అనిపించడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇలా పీరియడ్స్‌లో ఎక్కువ రక్తస్రావం (Heavy Bleeding) నార్మలేనా? దీనికి కారణాలు ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో చూసేద్దాం. 

బ్లీడింగ్ ఎక్కువ కావడమంటే..

బ్లీడింగ్ ఎక్కువ అవుతుందని ఎలా గుర్తించాలో తెలుసా? 1 లేదా 2 గంటలకోసారి ప్యాడ్ పూర్తిగా నిండిపోవడం నుంచి పీరియడ్స్ 7 రోజుల కంటే ఎక్కువ కొనసాగడం అధిక రక్తస్రావానికి గుర్తు. అలాగే పెద్ద పెద్ద బ్లడ్ క్లాట్స్ రావడం, తీవ్రమైన అలసట, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే అది నార్మల్ కాదని వైద్యులు చెప్తున్నారు.

పీరియడ్స్‌లో ఎక్కువ బ్లీడింగ్‌కు కారణాలు

బ్లీడింగ్ ఎక్కువ అవ్వడానికి వివిధ కారణాలు ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు సరిగా బ్యాలెన్స్ కాకపోతే గర్భాశయ లైనింగ్ ఎక్కువగా పెరిగి అధిక రక్తస్రావం జరుగుతుంది. అలాగే ఐరన్ డెఫీషియన్సీ ఉన్న మహిళలకు బ్లీడింగ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే మెన్స్ట్రువల్ సైకిల్ దెబ్బతిని బ్లీడింగ్ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం వంటివి కూడా పీరియడ్స్‌ను ప్రభావితం చేస్తాయి. PCOS, గర్భాశయ సమస్యల వల్ల కూడా హెవీ బ్లీడింగ్ రావచ్చు.

బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి?

బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి శరీరంలో ఓపిక నశిస్తుంది. అందుకే ఈ సమయంలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్తున్నారు నిపుణులు. పాలకూర, మెంతికూర వంటి ఐరన్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. బీట్‌రూట్, ఖర్జూరం, ఎండుద్రాక్ష, బెల్లం వంటివి బెస్ట్ ఐరన్ సోర్స్​గా చెప్పవచ్చు. 

ఓపిక కోసం.. 

ఎనర్జీ రావాలంటే ప్రోటీన్ ఫుడ్స్ డైట్​లో తీసుకోవాలి. గుడ్లు, పప్పులు, శెనగలు, వేరుశెనగ తీసుకోవాలి. విటమిన్ సి ఫుడ్స్ తీసుకుంటే ఐరన్​ శోషణకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి నారింజ, నిమ్మకాయ, ఉసిరికాయ వంటివి తీసుకోవచ్చు. అలాగే గోరువెచ్చని నీరు తాగితే క్రాంప్స్, నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. మజ్జిగ, కొబ్బరి నీరు కూడా మంచి ప్రయోజనాలు ఇస్తాయి. 

ఏవి తినకూడదు?

పీరియడ్స్ సమయంలో క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే అలాంటప్పుడు తెలియకుండా జంక్ ఫుడ్ తినేస్తారు. కానీ ఇది పరిస్థితిని ఇంకా దారుణంగా చేస్తుంది. కాబట్టి జంక్ ఫుడ్​కి దూరంగా ఉండాలి. అలాగే కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోకూడదు. హెర్బల్ డ్రింక్స్ తీసుకోవచ్చు. ఉప్పు, మసాలా ఆహారం తగ్గించాలి. 

డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలా?

ఏదొక నెలలో హెవీ బ్లీడింగ్ ఉంటే పర్లేదు. లైఫ్ స్టైల్ రీసెట్ చేసుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రతి నెలా హెవీ బ్లీడింగ్ ఉండడం, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బాగా బలహీనంగా అనిపిస్తే వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తే మంచిది. సరైన ఆహారం, విశ్రాంతితో పాటు వైద్య సలహా తీసుకోవడం చాలా అవసరమని గుర్తించాలి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget