పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించే డ్రింక్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

వామ్ము నీరు తీసుకుంటే మంచిది. దీనిలో మెంతులు కూడా వేసి మరిగించి తీసుకోవచ్చు. ఇది నొప్పి నుంచి కొంత ఉపశమనం ఇస్తుంది.

Image Source: Pexels

అల్లంతో టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పీరియడ్స్ నొప్పిని తగ్గించడం.

Image Source: Pexels

రాత్రి బాగా నిద్రపోవడం కోసం చాలా మంది చమోమిలే టీ తాగుతారు. ఈ ప్రత్యేకమైన టీ తాగితే పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.

Image Source: Pexels

పుదీనా ఆకులతో తయారు చేసిన హెర్బల్ టీ తాగడం వల్ల కూడా మీరు పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

Image Source: Pexels

కొన్ని పండ్లు, కూరగాయల రసాలు పీరియడ్స్ నొప్పి సమయంలో ఉపశమనం కలిగిస్తాయి. ఈ జాబితాలో క్యారెట్ జ్యూస్ కూడా ఒకటి.

Image Source: Pexels

ఇప్పుడు చలికాలం. మార్కెట్లో చాలా నారింజలు లభిస్తుంటాయి. పీరియడ్స్ నొప్పి వస్తే నారింజ రసం కూడా తాగవచ్చు.

Image Source: Pexels

పైనాపిల్ జ్యూస్ తాగినా పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. కాబట్టి ఈ పండు రసాన్ని కూడా జాబితాలో చేర్చుకోండి.

Image Source: Pexels

లవంగం కలిపిన టీ తాగినా పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

Image Source: Pexels

వేడి పాలలో పసుపు కలిపి తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో పొత్తికడుపు నొప్పి కూడా తగ్గుతుంది.

Image Source: Pexels