అన్వేషించండి

Photography Career : ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా? అయితే దీనిని కెరీర్​గా ఎంచుకోవాలంటే ఇవి ఫాలో అయిపోండి

Photography tips : ఫోటోగ్రఫీని కెరీర్​గా మలచుకోవాలంటే కొన్ని ఫాలో అవ్వాలి అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో.. ఈ రంగంలో సక్సెస్​ అయ్యేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Tips for Starting a Photography Career : ప్రతి సంవత్సరం ఆగస్టు 19వ తేదీన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటారు. ఫోటోగ్రఫీ కళను, క్రాఫ్ట్​ను ప్రపంచానికి పరిచయం చేసి.. దానిని సెలబ్రేట్ చేయడమే దీని లక్ష్యం. అందుకే ఈ రోజు ఫోటోగ్రఫీ మార్గదర్శకులు గౌరవిస్తూ.. సమాజంపై ఫోటోగ్రఫీ ప్రభావం ఎలా ఉంటుందో చెప్తారు. పదాలను అధిగమించే ఫోటోలకు ఉంటుంది. దానిలో ఎమోషన్, ఓ జీవం ఉంటుంది. భావోద్వేగాలను మరింత వ్యక్తం చేసే సత్తా ఫోటోగ్రఫీకి మాత్రమే ఉంది. 

అప్పటి నుంచే మొదలైంది..

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని 1839 నుంచి చేస్తున్నారు. అప్పటి నుంచి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం డాక్యుమెంట్ చేసి, గ్రహించే విధానాల్లో విప్లవాత్మక మార్పులను ఫోటోగ్రఫీ తీసుకొచ్చింది. చలనచిత్రం నుంచి డిజిటల్​కు మార్పు చెందింది. అంతేకాకుండా స్మార్ట్​ఫోన్ ఫోటోగ్రఫీ రంగానికి అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి అందుబాటులో ఉంది. అందుకే దీనిని చాలామంది కెరీర్​గా ఎంచుకునేందుకు చూస్తున్నారు. 

సాంకేతిక అంశాలను తెలుసుకుంటూ.. ఫోటోగ్రఫీపై అవగాహన పెంచుకుంటూ ఈ రంగంలో ముందుకు వెళ్లొచ్చు. ఫోటోగ్రఫీలో ఓ చరిత్ర ఉంటుంది. ఇది జర్నలిజం, ఆర్ట్స్, సైన్స్, వ్యక్తిగతంగా కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఫోటోలను ఎవరైనా తీస్తారు. కానీ దానిని కెరీర్​గా ఎంచుకోవాలనుకునేవారు కొన్ని అంశాలను దృష్టిలోకి తీసుకోవాలి. అప్పుడే ఆ రంగంలో సక్సెస్ అవుతారు. 

స్కిల్స్ చాలా ముఖ్యం

నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. లైటింగ్, ఎడిటింగ్, ఎలాంటివి ఫ్రేమ్​లో ఉండాలనేవాటిపై కచ్చితంగా అవగాహన ఉండాలి. సాంకేతికతను మెరుగుపరచుకోవడానికి రెగ్యూలర్​గా ప్రాక్టీస్ చేయాలి. పోర్ట్రెయిట్, ల్యాండ్ స్కేప్, స్పోర్ట్స్ లేదా వైల్డ్ లైఫ్​ ఫోటోగ్రఫీ వంటి కళా ప్రక్రియల పట్ల ఎక్స్​పర్ట్ అవ్వాలి. కెమెరా మీద ఇన్వెస్ట్​ చేయాలి. ఏది పడితే అది కొనడం కాకుండా నాణ్యమైన పరికరాలపై పెట్టుబడి పెట్టాలి. మంచి కెమెరా, మంచి లెన్స్​లు మీ స్కిల్స్​ని మరింత మెరుగుపరుస్తాయి. 

ట్రెండ్​కి తగ్గట్లు మారాలి..

పోర్ట్​ఫోలియో చేయాలి. క్లైయింట్స్​, అవకాశాలను దక్కించుకోవాలంటే మీరు పోర్ట్​ఫోలియో ప్రిపేర్ చేసుకోవాలి. పనిలో మీ బెస్ట్ ఇవ్వాలి. మూస పద్ధతులతో కాకుండా మీ పనితనాన్ని ట్రెండ్​కి తగ్గట్లుగా మార్చుకోవాలి. వర్క్​షాప్స్, వెబినార్స్​ అటెండ్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల మీకు ట్రెండ్స్​ పట్ల అవగాహన కలుగుతుంది. డబ్బుల కోసం ఫ్రీలాన్స్ ఫోటోగ్రఫీని చేయొచ్చు. మీ వర్క్​ని దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. 

అది లేకుంటే సక్సెస్ కాలేరు..

ఫోటోలు తీయడమే కాదు.. ఫోటోగ్రఫీలో పోస్ట్ ప్రాసెసింగ్ చాలా ముఖ్యం. లైట్ రూమ్, ఫోటోషాప్ వంటి సాఫ్ట్​వేర్​లను నేర్చుకోవాలి. ఇది మీ ఫోటోలను ఎలివేట్ చేస్తుంది. నైతిక మార్గాలనే ఫాలో అవ్వాలి. బిజినెస్, మార్కెటింగ్​ గురించి అవగాహన పెంచుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకుంటూ.. క్లైయింట్​ని ఎలా తృప్తి పరచాలో తెలుసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఓపికతో ఉండాలి. ఎందుకంటే ఇది ఒక పోటీ రంగం. కాబట్టి దీనికి పట్టుదల ఉంటేనే సక్సెస్ అవ్వగలరు. 

Also Read : మీ బ్రదర్ లేదా సిస్టర్​కి వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​ ద్వారా ఇలా రాఖీ శుభాకాంక్షలు చెప్పేయండిలా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్
Game Changer: 'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్
Game Changer: 'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
Game Changer : 'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
Tigrer Tension: 21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Embed widget