Rainy Season Health Tips for all Ages : వర్షాకాలంలో పిల్లలనుంచి పెద్దలవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిపుణుల సలహాలు ఇవే
Rainy Season Health Tips : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, ఇతరత్రా సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే నిపుణులు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటంటే..
Rainy Season Health Tips for Children and Adults : తెలుగు రాష్ట్రాలను వర్షాలు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. కేరళను వరదల ముంచెత్తుతున్నాయి. వర్షాకాలంలో ప్రకృతి విపత్తులను ఆపలేము కానీ.. కొన్ని రొటీన్ సమస్యలను అయితే తగ్గించుకోవచ్చు. ఈ సమయంలో వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వాతావరణంలో మార్పులు.. దానివల్ల కలిగే సీజనల్ వ్యాధులు, దోమల వ్యాప్తి పెరగడం.. వాటివల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఇలా చాలా ఉంటాయి. వీటినుంచి ఉపశమనం పొందేందుకు మనం కొన్ని ఆరోగ్య చిట్కాలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
ఫుడ్ విషయంలో
ఆరోగ్యానికి ఆహారం ఆక్సిజన్ లాంటిది. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం అంత చక్కగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో పలు రకాల ఇన్ఫెక్షన్లు ఎటాక్ అయ్యే అవకాశముంది కాబట్టి.. ఈ సమయంలో తీసుకునే ఫుడ్, తాగునీటి విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి ద్వారా ఎన్నో వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి తాగే నీరు శుభ్రమైనదో కాదో చూసుకోండి. నీటిని వేడి చేసుకుని తాగితే ఇంకా మంచిది. అలాగే స్ట్రీట్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఎందుకంటే వారు ఆహారం కోసం వినియోగించే నీరు, హైజీన్ ఫాలో అవ్వకుంటే వ్యాధులు, ఇన్ఫెక్షన్లు త్వరగా వచ్చేస్తాయి.
కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా వాటిని మార్కెట్ నుంచి తీసుకువచ్చిన వెంటనే.. శుభ్రంగా కడిగి, తుడిచి స్టోర్ చేసుకోవాలి. అలాగే మీ ఆహారంలో వెల్లుల్లి, అల్లం, పసుపు, పుట్టగొడుగులు, విటమిన్ సి కలిగిన సిట్రస్ పండ్లు చేర్చుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.
హైడ్రేటెడ్‌గా ఉండాలి..
వర్షాకాలంలో చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే.. నీటిని ఎక్కువగా తీసుకోరు. కానీ ఏ కాలంలోనైనా మనం హైడ్రేటెడ్‌గా ఉండేందుకు కచ్చితంగా నీటిని తీసుకోవాలి. దాహం వేసినా వేయకున్నా.. సరిపడా నీటిని తాగితే మంచిది. కార్బోనేటెడ్, కెఫిన్, ఆల్కహాల్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. అలాగే హెర్బల్ టీలు హైడ్రేటెడ్‌గా ఉంచడానికే కాకుండా.. ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి.
దోమల నివారణ..
అంటువ్యాధుల వ్యాప్తిని తగ్గించాలంటే కచ్చితంగా దోమలను కంట్రోల్ చేయాలి. డెంగ్యూ, మలేరియాను వ్యాపింపజేసే దోమలు ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దోమలు ఇంట్లోకి రాకుండా కొన్ని రకాల క్రీములు, లోషన్లు అప్లై చేసుకోవాలి. కిటికీలు, తలుపులు క్లోజ్ చేసి ఉంచితే మంచిది. దోమల తెర కట్టుకుంటే మరీ మంచిది. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. డస్ట్బిన్లు, కంటైనర్లపై మూత ఉంచాలి. లైట్ కలర్ దుస్తులు దోమలను ఆకర్షించవు.
వర్షంలో తడిస్తే..
కొందరికి వర్షంలో తడవడం చాలా ఇష్టంగా ఉంటుంది. అయితే ఇలా తడవడం, తర్వాత ఆరబెట్టుకునే సౌలభ్యాలు లేకపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కావాలని వర్షంలో తడిచినా.. అనుకోకుండా తడవాల్సి వచ్చినా.. వెంటనే మీ దుస్తులను మార్చుకోవాలి. ముఖ్యంగా తడిసిన తర్వాత స్నానం చేస్తే చాలా మంచిది. ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఓ జత బట్టలను, లో దుస్తులను మీతో తీసుకెళ్లాలి.
రోజుకు రెండుసార్లు
వర్షాకాలంలో కాస్త చలిగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో కొందరు స్నానం చేయడం మానేస్తారు. ఇది ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి కారణమవుతుంది. కాబట్టి ఉదయం, సాయంత్రం కచ్చితంగా స్నానం చేయాలి. వర్షాకాలంలో తేమ వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. ఈ సమయంలో శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవాలనుకుంటే కచ్చితంగా రెండు పూటల స్నానం చేయాలని గుర్తించుకోవాలి.
Also Read : హస్తప్రయోగం ఎక్కువగా చేస్తే ఆ సమస్యలు తప్పవట.. అపోహలు, వాస్తవాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే