అన్వేషించండి

వయస్సు పెరిగినా, యవ్వనంగా ఉండాలని అనుకుంటున్నారా? ఈ నాలుగు మీ కోసమే!

వృద్ధాప్యాన్ని తప్పించుకునే దిశగా ప్రపంచవ్యాప్తంగా నిరంతరాయంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. యవ్వనాన్ని పొడగించేందుకు సాగుతున్న ఈ పరిశోధనల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

పెరుగుతున్న వయసుపై అందరికీ బెంగగానే ఉంటుంది. ముసలితనం అందరికీ శాపంగా, భయం గొలిపేదిగానే అనిపిస్తుంది. కానీ అది తప్పదని అంతా అనుకుంటూ ఉంటారు. అయితే వృద్ధాప్యాన్నితప్పించుకునే దిశగా ప్రపంచవ్యాప్తంగా నిరంతరాయంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. యవ్వనాన్ని పొడిగించేందుకు సాగుతున్న ఈ పరిశోధనల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

గత ఫిబ్రవరిలో కాలిఫోర్నియా స్టార్టప్ యువన్ రీసెర్చ్ లో చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ హెరాల్డ్ కాచర్, అతని బృందం ల్యాబ్ లో ఎలుక జీవితాన్ని 47 నెలల వరకు పొడిగించారు. ఇది ఇదివరకు రికార్డ్ చేసిన ఇతర ఎలుకల ఆయుష్షు కంటే ఆరునెలలు ఎక్కువ. ఇలా ఆయుష్షు పెంచేందుకు వయసు తక్కువగా ఉన్న ఎలుక నుంచి రక్తంలోని ప్లాస్మా ఇన్ఫ్యూజ్ చేసి ఈ ఫలితాలను సాధించారు. వయస్సు పెరిగినా, యవ్వనంగా ఉండాలని కోరుకొనేవారు.. తప్పకుండా ఈ నాలుగు ప్రయోగాల గురించి తెలుసుకోవల్సిందే.

బ్లడ్ ప్లాస్మా స్వాపింగ్

యువకుల నుంచి..  పెద్దవారికి రక్త మార్పిడి వంటి ప్రయోగాలు విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రక్రియ.. వ్యక్తి జీవితకాలాన్ని పొడిగించడం కోసం కాదు, యవ్వనాన్ని పొడిగించేందుకు మాత్రమేనని నిపుణులు తెలుపుతున్నారు. జీవితంలోని స్వర్ణయుగం యవ్వనం. ఈ కాలం మరింత ఎక్కువ కాలం ఉండేందుకు, మరిన్ని ఆనందదాయక సంవత్సరాలను జోడించడానికి మాత్రమేనని చెబుతున్నారు.

బ్రయన్ జాన్సన్ అనే 45 ఏళ్ల సంపన్నుడు కేవలం ఎలుకల్లో జరిపిన ఈ ప్రయోగాన్ని గురించి తెలుసుకుని.. శాశ్వత యవ్వనాన్ని సాధించేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా తన 17 ఏళ్ల కొడుకు రక్తంలోని ప్లాస్మను తన రక్తంలోకి మార్పిడి చేసుకున్నాడు. అయితే, ఫలితం తెలుసుకోడానికి కొన్నాళ్లు వేచి చూడాలి.

రెజువనేషన్

అమెరికా సిలికాన్ వ్యాలి, కెంబ్రిడ్జి శాస్త్రవేత్తలు వృద్ధాప్యం వల్ల దెబ్బతిన్న కణాల పునరుత్పత్తి కోసం మూల కణాలను పరిశోధిస్తున్నట్టు చెబుతున్నారు. రోగాలను తగ్గించి, కణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు.. సెల్ల్యూలార్ రెజువనేషన్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. దీని ద్వారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల వైకల్యాలను సరిచేసే దిశగా  ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. కానీ కచ్చితంగా వారు దేన్ని అభివృద్ది చేస్తున్నారో వివరించలేకపోతున్నారు. ఇప్పటికైతే ఇదొక మిస్టరీగానే ఉంది.

సెల్ ఫ్లష్షింగ్

వృద్ధాప్యం వల్ల దెబ్బతిన్న కణాలు.. వయసు పెరిగిన ఛాయలకు, వ్యాధులకు కారణం అవుతాయి. ఈ కణాలను పరిశోధించేందుకు చేసే ప్రయోగాలకు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ పెట్టుబడి పెట్టారు. వీటిని స్టార్ట్ అప్ యూనిటీ బయోటెక్నాలజీ వారు నిర్వహిస్తున్నారు.

యూఎస్ లోని మిన్నెసోటాలో మయోక్లినిక్ మందులు వాడడం వల్ల ఎలుకల జీవిత కాలం పెరిగినట్టు నిరూపితమైంది. ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగించి ఎడిన్ బర్గ్ యూనివర్సిటి నిపుణులు వృద్ధాప్యానికి కారణమయ్యే సెనెసెంట్ కణాలను ఎదుర్కోగల మూడు కాంపౌండ్స్ ను గుర్తించారు. ఇలా రకరకాల ప్రయోగాలను మనల్ని యంగ్‌గా ఉంచేందుకు కొనసాగుతున్నాయి. వీటిలో ఏ ఒక్కటి విజయం సాధించినా.. అది అద్భుతమే.

Also read : GAS stove: గ్యాస్ స్టవ్ వాడుతున్నారా? కంటికి కనిపించని ఈ ప్రమాదాన్ని మీరు ఊహించి ఉండరు!

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

టాప్ హెడ్ లైన్స్

Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Punjab Assembly Elections.. ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Punjab Assembly Elections.. ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Raptadu Crime News: రాప్తాడు జెడ్పీ స్కూల్లో దారుణం- టెన్త్ విద్యార్థినిపై రంపంతో దాడి.. తెగిన చెయ్యి, తీవ్ర గాయాలు
రాప్తాడు జెడ్పీ స్కూల్లో దారుణం- టెన్త్ విద్యార్థినిపై రంపంతో దాడి.. తెగిన చెయ్యి, తీవ్ర గాయాలు
Embed widget