అన్వేషించండి

Fenugreek Water : 15 రోజులు మెంతి నీళ్లు తాగితే శరీరంలో కనిపించే మార్పులు ఇవే

Fenugreek Water on Empty Stomach : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఓ గ్లాసు మెంతి నీళ్లు 15 రోజులు వరుసగా తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.. శరీరంలో జరిగే మార్పులు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాత్రి నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తాగడం శ్రేయస్కరం.

Fenugreek Water for 15 Days : ఉదయాన్నే ఒక్క గ్లాసు మెంతి నీళ్లు తాగడం అనేది చాలా చిన్న విషయంలా కనిపిస్తుంది. కానీ ఈ పాత ఇంటి చిట్కా ఆరోగ్యానికి ఎన్నో లాభాలు చేకూరుస్తుంది. జీర్ణశక్తి మెరుగుపడడం నుంచి రక్తంలో చక్కెర స్థాయి సమతుల్యం చేయడం వరకు బోలెడు ప్రయోజనాలు అందిస్తుంది. అందుకే పోషకాహార నిపుణులు సైతం మెంతులు డైట్లో చేర్చుకోవాలంటున్నారు. పీచు, యాంటీఆక్సిడెంట్లు, సహజ సమ్మేళనాలతో నిండిన మెంతులను నానబెట్టి.. 15 రోజులు తాగితే బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూద్దాం. 

మెంతుల్లోని పోషకాలు.. 

మెంతుల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. అలాగే ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజెన్ ఉంటుంది. ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్​తో పాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ కలిసి శరీరాన్ని లోపల నుంచి మెరుగుపరుస్తాయి. ప్రధానంగా కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. 

బ్లడ్ షుగర్ కంట్రోల్.. 

మెంతుల్లో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోకి చక్కెర వేగంగా చేరకుండా నెమ్మదిగా విడుదలవడానికి సహాయపడుతుంది. 15 రోజులు తాగితే ఇన్సులిన్ నిరోధకత ప్రారంభ సంకేతాలు ఉన్నవారిలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. పలు అధ్యయనాలు మెంతి ఇన్సులిన్ సమతుల్యతను మెరుగుపరుస్తుందని నిరూపించాయి. అంటే శరీరం చక్కెరను కొవ్వుగా నిల్వ చేయకుండా సమర్థంగా ఉపయోగించుకుంటుంది.

మెరుగైన మెటబాలీజం 

మెంతి నీళ్లు జీవక్రియను ప్రభావంతమైన రీతిలో మెరుగుపరుస్తాయి. గింజల్లోని సహజ సమ్మేళనాలు జీర్ణ ఎంజైమ్‌లను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో కడుపు ఉబ్బరం తగ్గి.. తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవడం గమనిస్తారని NIHలో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. 

బాడీ డీటాక్స్

మెంతి గింజలు గట్​ని సహజంగా శుద్ధి చేస్తాయి. దాని పీచు పదార్థం పేరుకుపోయిన విషాలను తొలగించడంలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని, అసిడిటీని దూరం చేస్తుంది. కడుపులోని చికాకును తగ్గిస్తుంది. రెండు వారాల్లో గట్ హెల్త్ మెరుగవుతుంది. 

స్కిన్ హెల్త్ 

మెంతి నీళ్లు చర్మానికి కూడా మంచి ఫలితాలిస్తాయి. శరీరం వ్యర్థాలు, అదనపు నూనెను బయటకు పంపించి.. మొటిమలు తగ్గిస్తాయి. దీంతో చర్మం తాజాగా కనిపిస్తుంది. మెంతిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలుష్యం, ఒత్తిడి వల్ల కలిగే కణ నష్టాన్ని తగ్గిస్తాయి. దీంతో స్కిన్ టోన్ మెరుగవుతుంది. 

హార్మోన్ సమతుల్యత 

మెంతి గింజల్లో ఈస్ట్రోజెన్‌ను పోలిన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కొన్ని హార్మోన్ హెచ్చుతగ్గులను నియంత్రించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలకు ఇది చాలామంచిది. అలాగే పీరియడ్ రెగ్యులర్​గా రావడానికి హెల్ప్ చేస్తుంది. 

తయారీ విధానం

మెంతులు రాత్రుళ్లు నానబెట్టుకోవాలి. ఒక టీస్పూన్ తీసుకుంటే చాలు. 6–8 గంటలు నానితే.. గింజలు ఉబ్బి.. నీళ్లు కాస్త రంగు మారతాయి. ఉదయాన్నే వాటిని వడబోసి.. తాగాలి. గింజలను కూడా తినొచ్చు. ఖాళీ కడుపుతో తాగితే.. మంచిది. బెనిఫిట్స్ అనేవి ఒక్కరోజులో కనిపించవు. కానీ ఇలా 15 రోజులు చేస్తే తేడాలు మీకు కచ్చితంగా తెలుస్తాయి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మెంతి నీరు ఆరోగ్యానికి మంచిదే అయినా.. కొందరు తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీతో ఉన్నవారు, కొన్నిరకాల మందులు వాడేవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే వాడాలి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Monsoon Driving Guide : వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Gas Stove Cleaning: గ్యాస్ స్టవ్‌పై పాల మరకలను ఎలా తొలగించాలి? సులభమైన పరిష్కారా చిట్కాలు ఇవే!
గ్యాస్ స్టవ్‌పై పాల మరకలను ఎలా తొలగించాలి? సులభమైన పరిష్కారా చిట్కాలు ఇవే!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget