అన్వేషించండి

Tips to Stop Feeling Hungry : మీరు ఎంత తిన్నా ఆకలిగానే ఉంటుందా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..

Feeling Hungry All Time : కడుపు నిండా భోజనం చేయడం తప్పేమి కాదు. కానీ ఫుల్​గా తిన్నా కూడా ఆకలి వేస్తుందంటే మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన టైమ్​ వచ్చిందనమాట.

Always Feeling Hungry : రోజూలాగే మీరు మీకు నచ్చిన ఫుడ్​ని కడుపు నిండా తిన్నారు. మళ్లీ గంట తర్వాత మీకు అంతే ఆకలి వేస్తుందా? అయితే మీ శరీరంలో ఏదో తప్పు జరుగుతుంది. దానిని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. దీనికి కారణం బ్లడ్ షుగర్ డిప్స్ అంటున్నారు నిపుణులు. మీ రక్తంలో చక్కెర స్థాయిల్లో లోపాలే దీనికి కారణం అని గుర్తించాలి. కడుపు నిండా ఏదైనా తిన్న రెండు, మూడు గంటల తర్వాత ఆకలి వేస్తుందంటే పర్లేదు.

ఎంత తిన్నా.. మళ్లీ ఏదో తినాలనే ఫీల్​ వస్తుందంటే మీరు కచ్చితంగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. ఇలా అనిపించడానికి రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడమే కారణం. శుద్ధి చేసిన, కార్బోహైడ్రేట్, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇలాంటింది జరుగుతుంది. ఇది మన రక్తంలో చక్కెరను పెంచుతుంది. తాజాగా వెయ్యి మందిపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెళ్లడైంది. ప్రతి ముగ్గురిలో ఒకరు దీనితో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్య మానసిక, శారీరకంగా కూడా సంబంధం కలిగి ఉంది. ఇలాంటి వారు రోజుకు 300 కేలరీలు అదనంగా ఫుడ్​ తింటారు. ఇది ఆరోగ్యకరమైనది కాదు. అయితే మీరు కొన్ని చిట్కాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. వాటిలో మూడు కచ్చితంగా ఫాలో అయితే దీనికి పూర్తిగా చెక్​ పెట్టవచ్చు.

సమతుల్యమైన బ్రేక్​ఫాస్ట్

బ్రేక్​ఫాస్ట్​పై చాలామంది శ్రద్ధ చూపరు కానీ.. అది రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. కాబట్టి కచ్చితంగా దానిపై శ్రద్ధ వహించాలి. సమతుల్యమైన ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్​లో ఉంచుంతిది. కాబట్టి రెగ్యూలర్​ టైమ్​కి ఆకలి వేస్తుంది. నట్స్, ప్రూట్స్​ వంటి ఫుడ్​ను మీ బ్రేక్​ఫాస్ట్​లో చేర్చుకోండి. ఇది భోజనం వరకు ఎలాంటి స్నాక్స్ లేకుండా మిమ్మల్ని ఉంచుతుంది. కేవలం బ్రేక్​ఫాస్ట్​లోనే కాదు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్​లో ఉంచుకోవడానికి మీరు ప్రతి భోజనంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్​లు ఉండేలా చూసుకోవాలి. 

వ్యాయామం

రోజులో ఏదొక సమయంలో కుదిరితే ఉదయాన్నే వ్యాయామం చేయండి. ఇది మీ రోటీన్​లో భాగమైపోవాలి. ఇది మీ కండరాలను బలంగా చేస్తుంది. కండరాలు శరీరంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. మనకు సరైన కండర ద్రవ్యరాశి లేనప్పుడు రక్తంలోని చక్కెరను తగ్గించుకోవడం కష్టమవుతుంది. ఇది ఇన్సులిన్, రక్తంలో చక్కెర పెరిగేలా చేస్తుంది. 

ఎలక్ట్రోలైట్​లు తీసుకోవాలి..

రోజూవారీ జీవితంలో మీరు తగినంత ఎలక్ట్రోలైట్‌లను పొందుతున్నారో లేదో తెలుసుకోండి. ఇది ఆకలిని దూరం చేయడంలో చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. శరీరం సరిగ్గా పనిచేయడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా జ్ఞానం, మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఇది ఆకలిని కూడా ప్రభావం చేస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్​లు అసమతుల్యమైనప్పుడు శరీరంలో తనకు అవసరమైన పోషకాలను తిరిగి నింపుకోవడం ఆకలిని ప్రేరేపిస్తుంది. తద్వారా మీకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తారు. కాబట్టి మీరు రోజూవారీ జీవితంలో ఎలక్ట్రోలైట్​లను తీసుకోండి. ఎనర్జీ డ్రింక్స్​ లాంటి వాటికి దూరంగా ఉండండి. తగినంత నీటిని తీసుకోవడం చాలా మంచిది. 

Also Read : పనీర్ బేసిన్ దోశ.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Doppelgangers : మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే
Face Packs for Glowing Skin : మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget