అన్వేషించండి

National Engineers Day 2025 : ఇండియాలో ఇంజినీరింగ్​లో కెరీర్ ఎంచుకోవడం ఇప్పటికీ మంచిదేనా? ఏ బ్రాంచులకు ఫ్యూచర్ ఉందంటే

National Engineers Day : ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా ఇంజినీరింగ్​ని కెరీర్​గా మలచుకోవడం మంచిదేనా? భవిష్యత్తుకోసం ఎలాంటి బ్రాంచులు ఎంచుకుంటే మంచిదో చూసేద్దాం. 

National Engineers Day 2025 : ప్రతి ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన ఇంజనీర్ల ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ఇండియాలో ఇంజనీర్ల దినోత్సవం జరుపుతున్నారు. భారత రత్న అవార్డు గ్రహీత గ్రేట్ ఇంజనీర్ సర్​ ఎం. విశ్వేశ్వరయ్య (Sir M. Visvesvaraya)జ్ఞాపకార్థం దీనిని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. లే ఆఫ్​లు పెరుగుతున్న ఈరోజుల్లో ఇంజనీరింగ్లో కెరీర్ చూజ్ చేసుకోవడం మంచి ఆప్షనేనా? దానిలోనే రాణించాలంటే ఎలాంటి బ్రాంచ్​లు సెలక్ట్ చేసుకోవాలి? ఈ కాలంలో ఇంజినీరింగ్​ కెరీర్​గా ప్రాముఖ్యత ఉందా లేదా ఇప్పుడు చూసేద్దాం. 

భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. వీరికి జాబ్స్ దొరకడం అనేది చాలా కాంపిటేషన్​తో కూడుకున్నది. పోటీ పక్కన పెడితే టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో మరికొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇంజనీర్లు AI, రోబోటిక్స్, రిన్యువబుల్ ఎనర్జీ, స్పేస్ టెక్, స్మార్ట్ సిటీస్ వంటి వాటిపై ఫోకస్ చేస్తే ఎప్పటికీ మంచి డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు. 

ఇంజినీరింగ్ కెరీర్​గా మార్చుకోవాలంటే.. 

ఇంజినీరింగ్​లో రాణించాలన్నా.. ఫ్యూచర్​ దానిలోనే చూసుకోవాలన్నా సరైన నైపుణ్యాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్​తో పాటు ఇంటర్న్​షిప్స్, కోడింగ్, ఇన్నోవేషన్ వంటివాటిపై ఫోకస్ చేస్తే ఇంజినీరింగ్ ఇంకా సేఫ్​గా, రెస్పెక్టెడ్ ప్రొఫెషన్​గానే ఉంటుంది. ఇవేమి లేకుండా కెరీర్​ ఇంజినీరింగ్​లో చూసుకోవాలంటే కష్టమే అవుతుంది. 

భవిష్యత్తు ఉన్న బ్రాంచులు ఇవే.. (Best Engineering Branches in India 2025)

ఫ్యూచర్​లో మంచి అవకాశాలు పొందాలనుకుంటే మీరు ఇంజినీరింగ్​లో కొన్ని బ్రాంచ్​లు (Future of Engineering Careers in India) ఎంచుకోవాల్సి ఉంది. కంప్యూటర్ సైన్స్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (CSE + AI/ML) మంచి బ్రాంచ్ అవుతుంది. సాఫ్ట్‌వేర్, డేటా సైన్స్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లోకి వెళ్లాలనుకునేవారికి ఇది బెస్ట్. ఎక్కువ ప్లేస్‌మెంట్లు, మంచి ప్యాకేజీలతో పాటు మంచి అవకాశాలు కూడా ఉంటాయి. 
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) కూడా మంచి ఆప్షనే. చిప్ డిజైనింగ్, IoT, 5G/6G టెలికాం, రోబోటిక్స్, సెమీకండక్టర్ రంగాల్లో స్కోప్ ఉంటుంది. ఇండియాలో సెమీకండక్టర్ పరిశ్రమలో పెట్టుబడులు పెరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తు బాగుంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ (ME) ట్రెడీషనల్ బ్రాంచ్ అయినా సరే.. ఆటోమొబైల్, ఏరోస్పేస్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ & ఆటోమేషన్ వల్ల మెకాట్రానిక్స్, రోబోటిక్స్ వైపు కూడా ఈ మధ్యకాలంలో దీనికి స్కోప్ పెరుగుతోంది.

స్మార్ట్ సిటీస్, మెట్రో ప్రాజెక్ట్స్, హైవేస్, గ్రీన్ బిల్డింగ్స్‌కి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ (CE) కూడా మంచి ఆప్షన్. పర్యావరణ, సస్టైనబుల్ కన్‌స్ట్రక్షన్ రంగాల్లో కూడా మంచి స్కోప్ ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (EE) తీసుకుంటే రిన్యువబుల్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, రోబోటిక్స్ రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. సోలార్, విండ్ పవర్‌కి ఇండియాలో పెద్ద ఎత్తున డిమాండ్ రానుంది. కరోనా తర్వాత బయోటెక్, మెడికల్ డివైసెస్, జనెటిక్ ఇంజనీరింగ్, స్టార్టప్స్ రంగాల్లో బాగా డిమాండ్ ఉంది. కాబట్టి బయోటెక్నాలజీ & బయోమెడికల్ ఇంజనీరింగ్ చేయవచ్చు. 

వీటిని మరచిపోకండి.. 

ఇంజనీరింగ్​లో కెరీర్​ ముందుకు తీసుకువెళ్లాలనుకునే విద్యార్థులు బ్రాంచ్​ని బంధువులు, ఫ్రెండ్స్ సలహా మీద ఎంచుకోకూడదు. మీ ఇంట్రెస్ట్, మార్కెట్ డిమాండ్ చూసుకుని ఎంచుకుంటే మీరు మంచిగా రాణించగలుగుతారు. కోడింగ్, డేటా అనలిసిస్, AI, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్​డేట్ చేసుకుంటూ సర్టిఫికేషన్లు సంపాదిస్తే కెరీర్​లో సక్సెస్​ఫుల్​గా ముందుకు వెళ్తారు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Embed widget