ఫోటోగ్రఫీ అంటే చాలామందికి ఇష్టం. మరి వాటి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?

1826లో జోసెఫ్ నైస్‌ఫోర్ నీప్స్ ప్రపంచంలోనే తొలి ఫోటో తీశారు. దాని కోసం 8 గంటలు పట్టిందట.

1975లో మొదటి డిజిటల్ కెమెరాను కనుగొన్నారు. కోడాక్ ఇంజనీర్ స్టీవెన్ సాసన్ దీనిని రూపొందించారు.

పీటర్ లిక్ తీసిన “Phantom” అనే ఫోటోను 2014లో $6.5 మిలియన్లకు అమ్మారు. ఇదే అత్యంత ఖరీదైన ఫోటో.

‘Photography’ అనే పదం గ్రీక్ భాషలోని రెండు పదాల నుంచి వచ్చింది. ‘Photos’ (వెలుగు) ‘Graphos’ (చిత్రకళ).

సెల్ఫీ కల్చర్ చాలామంది రీసెంట్ టైమ్స్​లో వచ్చిందనుకుంటారు కానీ.. దానిని 1839లోనే తీసుకున్నారు.

రాబర్ట్ కార్నేలియస్ అనే ఫోటోగ్రఫీ పయనీర్ మొట్టమొదటి సెల్ఫీ తీసుకున్నారు.

1861లో జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ రెడ్, గ్రీన్, బ్లూ కలర్ విధానంతో మొదటి కలర్ ఫోటో తీశారు.

ప్రపంచంలో అత్యధికంగా ఫోటోలు తీసిన ప్రదేశం పారిస్‌లోని ఐఫిల్ టవర్.

Apollo 8 (1968) మిషన్‌లో తీసిన “Earthrise” ఫోటో ప్రపంచ పర్యావరణ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఫోటోగా చెప్తారు.

‘Mammoth Camera’ ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా. 1900లో ఓ రైలును ఫోటో తీయడానికి దీనిని తయారు చేశారు.