అన్వేషించండి

RO Wastewater Reuse Tips:పెస్ట్ కంట్రోల్‌గా ఆర్‌ఓ ప్యూరిఫైయర్ వేస్ట్ వాటర్! మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి!

RO Wastewater Reuse Tips:ఇళ్లల్లో ఆర్‌ఓ ప్యూరిఫైయర్లు ఇచ్చే ప్రతి లీటర్ స్వచ్ఛమైన నీటి కోసం సుమారు 3 లీటర్ల నీరు వృథాగా పోతుంది.  ఆ వేస్ట్ వాటర్‌ను ఏంచేయాలో చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • RO వాటర్ ప్యూరిఫైయర్లు నీటిని వృధా చేస్తాయి.
  • ప్రభాత్ విజయన్ నీటిని ఆదా చేసే వినూత్న పద్ధతి కనిపెట్టారు.
  • RO వ్యర్థ జలాన్ని వివిధ పనులకు ఉపయోగించవచ్చు.
  • RO వ్యర్థ జలాన్ని తాగడానికి, వంటకు వాడకూడదు.

RO Wastewater Reuse Tips:ఆధునిక కాలంలో పట్టణ ప్రాంతాల్లో ఆర్‌ఓ వాటర్ ప్యూరిఫైయర్‌ ప్రతి ఇంట్లో ఒక నిత్యవసర వస్తువుగా మారింది. భూగర్భ జలాలు కలుషితం  కావడం, నీటిలో లవణాల శాతం పెరగడంతో ఆరోగ్యం కోసం ప్రజలు ఈ టెక్నాలజీపై ఆధారపడుతున్నారు.అయితే ఈ శుద్ధి ప్రక్రియలో మనకు తెలియకుండానే భారీ స్థాయిలో నీరు వృథా అవుతోంది. నివేదికల ప్రకారం ఒక లీటరు  స్వచ్ఛమైన నీటిని పొందడానికి ఆర్‌ఓ సిస్టమ్‌ సుమారు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని బయటకు పంపుతుంది. ఈ నీరు నేరుగా డ్రైనేజీలోకి వెళ్లడం వల్ల ఏటా వేల లీటర్ల జలం వృతా అవుతోంది. 

ఆర్‌ఓ నీరు ఎందుకు వృథా అవుతుంది?

ఆర్‌ఓ ప్యూరిఫైయర్లు సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అనే సాంకేతికతతో పని చేస్తాయి. నీటిలోని కలుషితాలను, భార లోహాలను, బ్యాక్టీరియాను ఈ మెంబ్రేన్ అడ్డుకుంటుంది. ఈ మెంబ్రేన్ పాడవకుండా ఉండటానికి , అి నిరంతరం తనను తాను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఈ శుభ్రపరిచే ప్రక్రియలో భాగంగా కలుషితాలు అధికంగా ఉన్న నీటిని బయటకు పంపిస్తుంది. దీనినే మనం రిజెక్ట్ వాటర్‌ లేదా వేస్ట్ వాటర్ అంటాం. ఈ నీటిలో టీడీఎస్‌ స్థాయి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇందులో కాల్షియం, మెగ్నీషియం వంటి లవణాలు అధిక సాంధ్రతలో ఉంటాయి. 

ప్రభాత్‌ విజయన్ స్ఫూర్తిదాయక ప్రయాణం

బెంగళూరుకు చెందిన ప్రభాత్ విజయన్ అనే వ్యక్తి తన ఇంట్లో ఆర్‌ఓ ప్యూరిఫైయర్‌ నుంచి వృథా అయ్యే నీటిని చూసిన చలించిపోయారు. కేవలం ఒక డ్రమ్‌, ఒక స్క్రూడ్రైవర్‌తో ఆయన ఒక సింపుల్‌ డీఐవై సెటప్‌్ తయారు చేసుకున్నారు. తద్వారా ఏడాదికి ఏకంగా 24వేల లీటర్ల నీటిని ఆదా చేస్తున్నారు. మనకు నీటి ఎద్దడి పెరుగుతున్న తరుణంలో, ఇలాంటి చిన్న మార్పులు భారీ ఫలితాలను ఇస్తాయని ఆయన నిరూపించారు. 

ఆర్‌ఓ వేస్ట్ వాటర్‌ను వినియోగించుకునే పది మార్గాలు 

ఫ్లోర్‌ క్లీనింగ్ 

ఆర్‌ఓ వేస్ట్ వాటర్‌  ఫ్లోర్ తుడవడానికి అత్యంత అనువైంది. ఇందులో ఉండే స్వల్ప లవణీయత మొండి మరకలను తొలగించడానికి కూడా సహయపడుతుంది. రోజూ ఒక బకెట్‌లో ఈ నీటిని సేకరించి, ఇల్లు కడగటానికి వాడటం ద్వారా మంచి నీటిని ఆదా చేయవచ్చు. 

టాయిలెట్ ఫ్లషింగ్

ఇంట్లో అత్యధికంగా నీరు ఖర్చు అయ్యేది టాయిలెట్‌లోనే ఆర్‌ఓ వేస్ట్ వాటర్‌ను నేరుగా ఫ్లష్‌ ట్యాంకుల్లో పోయవచ్చు. లేదా బకెట్‌తో ఫ్లషింగ్ కోసం ఉపయోగించవచ్చు. 

మొక్కల పెంపకానికి 

ఈ నీటిని మొక్కలకు పోయవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు అవసరం. కలబద, మందార, గన్నేరు వంటి ఎక్కువ లవణాలను కట్టుకునే మొక్కలకు ఈ నీరు అనువైంది. అయితే సున్నితమైన మొక్కలు లేదా ఆర్కిడ్స్‌ వంటి వాటికి ఈ నీటిని వాడకూడదు. సాధారణ నీటితో కలిపి వాడటం మంచిది. 

వాహనాల క్లీనింగ్‌ 

కారు లేదా బైక్ కడగడానికి భారీగా నీరు అవసరం అవుతుంది. ఆర్‌ఓ నుంచి వచ్చే నీటిని సేకరించి, వాహనాల టైర్లు, బయటి భాగాలను శుభ్రం చేయడానికి వాడవచ్చు. వాహనం తుడిచి తర్వాత మచ్చలు పడకుండా పొడి బట్టతో తుడవటం మంచిది. 

బట్టలు నానబెట్టడానికి 

మురికి ఎక్కువగా ఉన్న బట్టలను నానబెట్టడానికి ఈ నీటిని వాడవచ్చు దీని వల్ల వాషింగ్ మెషిన్‌లో తక్కువ మంచినీరు అవసరమవుతుంది. అయితే పట్టు వస్త్రాలు లేదా సున్నితమైన రంగులున్న బట్టలకు ఈ నీటిని వాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. 

పాత్రల శుభ్రత 

వంట పాత్రలలోని జిడ్డును, ఆహార పదార్థాలను వదలగొట్టడానికి ఆర్‌ఓ వేస్ట‌ వాటర్‌ను వాడుకోవచ్చు. ఆ తర్వాత సాధారణ నీటితో కడిగితే సరిపోతుంది. 

పెస్ట్ కంట్రోల్ 

తోటలలో లేదా ఇంటి మూలల్లో ఈ నీటిని చల్లడం వల్ల కొన్ని రకాల కీటకాలు దరిచేరవు. ఇందులో లవణాలు సహజమైన కీటక నివారిణిగా పని చేస్తాయి.

పనిముట్ల శుభ్రత కోసం 

తోటలో వాడే పనిముట్లపై ఉన్న మట్టిని తొలగించడానికి ఈ నీటిని ఉపయోగించడం ద్వారా మంచినీటిని వృథా కాకుండా చూడవచ్చు. ఇంటి ముందు మెట్లు, డ్రైవ్‌వే లేదా పోర్చ్‌ను శుభ్రం చేయడానికి ఈ నీరు చక్కగా పని చేస్తుంది. 

కూలర్‌లలో వినియోగం

ఎయిర్‌ కూలర్లలో సాధారణ నీటికి బదులు ఈ నీటిని వాడవచ్చు. అయితే కూలర్ ప్యాడ్లపై లవణాలు పేరుకుపోయే అవకాశం ఉన్నందున క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. 

ఆర్‌ఓ వేస్ట్ వాటర్‌తో చేయకూడని పనులు 

ఆర్‌ఓ వేస్ట్ వాటర్‌లో టీడీఎస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకూడదు. వంటకు, స్నానానికి , తల స్నానానికి వాడకూడదు. ఎందుకంటే చర్మం, వెంట్రుకలపై ప్రభావం చూపుతుంది. జంతువులకు తాగించవద్దు.   

Frequently Asked Questions

RO వాటర్ ప్యూరిఫైయర్లు నీటిని ఎందుకు వృధా చేస్తాయి?

RO ప్యూరిఫైయర్లు సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా పనిచేస్తాయి. కలుషితాలను అడ్డుకునే ఈ మెంబ్రేన్, తనను తాను శుభ్రం చేసుకునే ప్రక్రియలో భాగంగా కలుషితాలు అధికంగా ఉన్న నీటిని బయటకు పంపిస్తుంది. దీనినే రిజెక్ట్ వాటర్ అంటారు.

RO వేస్ట్ వాటర్ ను ఏయే పనులకు ఉపయోగించవచ్చు?

RO వేస్ట్ వాటర్ ను ఫ్లోర్ క్లీనింగ్, టాయిలెట్ ఫ్లషింగ్, మొక్కల పెంపకానికి (కొన్ని జాగ్రత్తలతో), వాహనాల క్లీనింగ్, బట్టలు నానబెట్టడానికి, పాత్రల శుభ్రతకు, పెస్ట్ కంట్రోల్, పనిముట్ల శుభ్రతకు, మరియు కూలర్లలో వినియోగించవచ్చు.

RO వేస్ట్ వాటర్ ను తాగవచ్చా?

లేదు, RO వేస్ట్ వాటర్ లో TDS (Total Dissolved Solids) ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకూడదు.

RO వేస్ట్ వాటర్ ను వంటకు లేదా స్నానానికి ఉపయోగించవచ్చా?

లేదు, RO వేస్ట్ వాటర్ ను వంటకు, స్నానానికి, లేదా తల స్నానానికి ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇందులో లవణాల శాతం ఎక్కువగా ఉండి చర్మం, వెంట్రుకలపై ప్రభావం చూపుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
Vertigo vs Blackouts : తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget