Homemade Ice Cream Recipe : చల్లని, టేస్టీ వెనిలా ఐస్‌క్రీమ్‌ను ఇంట్లోనే ఇలా సింపుల్‌గా తయారు చేసుకోండి
Easy Homemade Ice Cream : మీకు ఐస్ క్రీమ్ తినడమంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా కొన్ని పదార్థాలతో టేస్టీ ఐస్‌క్రీమ్ తినాలకుంటే మీరు ఈ రెసిపీ ట్రై చేయవచ్చు.
Homemade Vanilla Ice Cream : మార్చి నెల కూడా రాలేదు. ఫిబ్రవరి పూర్తి కూడా అవ్వలేదు. కానీ అప్పుడే ఎండలు ఓ రేంజ్లో ఇరగదీసేస్తున్నాయి. ఉదయం 10కి బయటకి వెళ్లాలంటేనే భయమేసే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో బయటకు వెళ్లడం రావడం తప్పదు కానీ.. అలా ఇంటికి వెళ్లినప్పుడు చల్లగా ఏమైనా తింటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి చల్లని, టేస్టీ ఫుడ్‌లలో ఐస్‌క్రీమ్ ఎప్పుడూ ముందు ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు అందరూ వీటిని ఇష్టంగా తింటారు.
ఇంటిల్లీపాది ఇష్టంగా తినగలిగే ఐస్ క్రీమ్‌లను ఇంట్లోనే తయారు చేసుకుంటే బాగుంటుంది. వాటిని ఎలా తయారు చేస్తారో.. పిల్లలకు పెట్టొచ్చో లేదో అనే డైలామాలో ఉన్న పేరెంట్స్ ఇంట్లోనే వాటిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. పైగా ఐస్‌క్రీమ్‌ను కొనడానికయ్యే ఖర్చుతో ఇంట్లోనే ఎక్కువ మోతాదులో మనం ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. పైగా దీనిని తయారు చేయడం కోసం ఎక్కువ సమయం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే టేస్టీ వెనిలా ఐస్‌క్రీమ్‌ను ఎలా తయారు చేయాలో? దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
పాలు - 2 కప్పులు
పంచదార - 1 కప్పు
పాల పొడి - 2 టేబుల్ స్పూన్స్
వేడి పాలు - 2 టేబుల్ స్పూన్స్
వెనిలా ఎసెన్స్ - అర టీస్పూన్
బాదం - రుచికి తగినంత
తయారీ విధానం
ముందుగా స్టౌవ్ వెలిగించి దానిలో పాలు వేయండి. అవి బాగా మరిగిన తర్వాత దానిలో పంచదార వేసి బాగా కలపండి. పాలల్లో చక్కెర పూర్తిగా కరిగేవరకు బాగా కలపాలి. ఇప్పుడు మరో చిన్న గిన్నె తీసుకుని దానిలో వేడి పాలు వేసి.. దానిలో పాలపొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం ఉండలు లేకుండా పేస్ట్ మాదిరిగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముందుగా చక్కెరతో కూడిన పాలల్లో వేయాలి. ఇప్పుడు పాలు చిక్కబడే వరకు దానిని బాగా ఉడకబెట్టాలి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి దానిని పూర్తిగా చల్లారేవరకు పక్కన పెట్టాలి.
ఈ మిశ్రమం చల్లారిన తర్వాత గాజు గిన్నోలోకి తీసుకుని దానిలో వెనిలా ఎసెన్స్ వేయాలి. అది పూర్తిగా పాలలో కలిసేలా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు గిన్నెను మూతపెట్టండి. సుమారు 4 గంటలపాటు ఫ్రిజ్లోనే ఉంచండి. ఇప్పుడు బ్లెండర్తో దానిని ముక్కలుగా చేసి క్రిస్టల్‌గా మార్చేయండి. ఇప్పుడు మిక్స్‌ను మరొక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు దాని మూతలను గట్టిగా కవర్ చేయండి. దీనిని ఫ్రిజ్‌లో ఉంచి 8 నుంచి 12 గంటలు స్టోర్ చేయవచ్చు. అంతే ఎండ తాపాన్ని దూరం చేసే చల్లచల్లని వెనిలా ఐస్ క్రీమ్ రెడీ.
మీరు ఈ ఐస్‌క్రీమ్‌ను తినేసమయంలో బాదంపప్పును తురిమి దానితో గార్నిష్ చేసుకుని చల్లగా లాగించేయవచ్చు. ముందురోజు రాత్రి దీనిని తయారు చేసుకుంటే.. నెక్స్ట్ డే మధ్యాహ్నం హాయిగా తినవచ్చు. దీనిని మీరు గులాబ్ జామ్‌తో కలిపి కూడా తినవచ్చు. ఎందుకంటే వెనిలా ఐస్‌క్రీమ్ గులాబ్ జామ్‌కు పర్ఫెక్ట్ కాంబో. దీనిని కేవలం ఎండలోనే కాకుండా.. రాత్రుళ్లు డిజెర్ట్గా కూడా తీసుకోవచ్చు.
Also Read : రోజూ ఉదయాన్నే బాదం, వాల్నట్ తింటున్నారా? అయితే ఇది మీకోసమే