Wrinkle Free Skin: ముడతలు లేని చర్మం కావాలా? ఈ ఫుడ్ మీ డైట్ లో భాగం చేసుకోవాల్సిందే
చర్మం కాంతివంతంగా ఉండేందుకు బ్యూటీ పార్లర్ కి వెళ్ళి డబ్బులు పోసి మరీ అందాన్ని కొని తెచ్చుకుంటారు కొంతమంది. మేకప్, టచప్ అని ఇంకొంతమంది ముఖానికి రంగులు పూసుకుంటారు. దాని వల్ల ముఖం ముదురుగా అనిపిస్తుంది
చర్మం కాంతివంతంగా ఉండేందుకు బ్యూటీ పార్లర్ కి వెళ్ళి డబ్బులు పోసి మరీ అందాన్ని కొని తెచ్చుకుంటారు కొంతమంది. మేకప్, టచప్ అని ఇంకొంతమంది ముఖానికి రంగులు పూసుకుంటారు. దాని వల్ల ముఖం ముదురుగా అనిపిస్తుంది. వయస్సు తక్కువగా ఉన్నప్పటికీ ముఖం మాత్రం వయసు ఎక్కువ చూపిస్తుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వాళ్ళ ముఖం మీద ముడతలు ఏర్పడతాయి. మేకప్ తో వాటిని కవర్ చేసేందుకు ప్రయత్నిస్తాం కానీ అది కాసేపు మాత్రమే. అలా కాకుండా మీ వయసు ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు యవ్వనంగా ముడతలు లేని చర్మంతో కనిపించాలంటే మాత్రం మీరు మీ డైట్ మార్చుకోవాల్సిందే. పోషకాలు నిండిన ఈ ఆహారం తినడం వల్ల ముడతలు నివారించవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు.
కొల్లాజెన్
అందమైన ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే తప్పకుండా కొల్లాజెన్ కావాలి. వయసు పెరిగే కొద్ది శరీరంలో కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి తగ్గుతూ వస్తుంది. మీ చర్మం ముడతలు లేకుండా ధృడంగా ఉండాలంటే కొల్లాజెన్ ప్రోటీన్ చాలా అవసరం. అందుకే సప్లిమెంట్స్ రూపంలో కూడా కొంతమంది కొల్లాజెన్ తీసుకుంటారు. కానీ వాటిని సప్లిమెంట్స్ గా కంటే ఆహార పదార్థాల ద్వారా తీసుకోవడం ఉత్తమమని చెప్తున్నారు నిపుణులు. మాంసకృతుల్లో ( జంతువుల ఎముకల్లో)కొల్లాజెన్ అధికంగా ఉంటుంది. వీటిలో కాలిష్యం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అవి చర్మాన్ని ధృడంగా చేసేందుకు దోహదపడతాయి.
ఆకుకూరలు
బచ్చలి కూర వంటి ఆకుకూరల్లోనూ విటమిన్ సి మెండుగా ఉంటుంది. ఈ ఆకు కూరలు చర్మాన్ని సూర్యరశ్మి , కాలుష్యం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. మీకు తెలుసా ఆరెంజ్ లో కంటే టమోటా, క్యాప్సికమ్ లో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది.
దాల్చిన చెక్క
పాలీఫెనాల్స్‌లో పుష్కలంగా ఉంటుంది. చర్మానికి అవసరమైన కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయకారిగా ఉంటుంది.
అల్లం, తేనె
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన జింజెరాల్ ఉంటుంది. చర్మం ఉపరితలంపై ఉండే బ్యాక్టీరియాను నాశనం చేసే సామర్థ్యం దీనికి ఉంది. తేనెతో కలిపి ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసేందుకు అవసరమైన సహజ యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ ద్రావణంగా మారుతుంది. ఇది ముడతలు రావడం ఆలస్యం చేస్తుంది.
అవకాడో, వాల్ నట్స్
విటమిన్లు A, D, E మరియు K కొవ్వులో కరిగే విటమిన్లు. విటమిన్ ఏ ప్రత్యేకంగా చర్మ కణాల చురుగ్గా ఉండేలా చూస్తుంది, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న పదార్థాలు డైట్ లో భాగంగా చేసుకోవాలి. సాల్మన్, అవకాడో, వాల్ నట్స్, నెయ్యి, అవిసె గింజలు, ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకమైన కొవ్వులు ఉన్న పదార్థాలు.
బెర్రీలు
వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. చర్మంలోని కొల్లాజెన్‌ను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో ఇవి పోరాడుతాయి. ఇవి తీసుకోవడం వల్ల ముడతలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
పుట్టగొడుగులు
ఇది చర్మ సంరక్షణకి ఎంతో మంచిది. చర్మంలో సహజంగా ఉండే ప్రోటీన్స్, కొల్లాజెన్ పనితీరును మెరుగ్గా చేస్తుంది.
చిక్కుళ్లు
ఐసోఫ్లేవోన్ల ఉనికి చర్మాన్ని హైడ్రేట్ గా, మృదువుగా మరియు దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. చిక్కుళ్లలో ఫోలేట్ కూడా సమృద్ధిగా ఉంటుంది, ఇది చర్మం చాలా పొడిబారకుండా చేస్తుంది మరియు తగినంత కొల్లాజెన్ ఉత్పత్తిని ఇస్తుంది.
కలబంద
కలబంద రసం తాగొచ్చు. లేదంటే కలబంద గుజ్జుని ముఖానికి రాసుకోవచ్చు. కొల్లాజెన్ ని అధికంగా ఉత్పత్తి చేస్తుంది. చర్మం తేమగా ఉండేందుకు సహాయపడుతుంది. ముడతలు రాకుండా చేస్తుంది. ఇది చర్మంపై మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అన్నింటికీ మించి నీరు బాగా తాగాలి. ఇది చర్మం పొడిబారి పోకుండా మెరిసేలా చేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: నేరేడు పండ్లు షుగర్ పేషెంట్స్ తినొచ్చా? నిపుణులు ఏం చెప్తున్నారంటే
Also Read: మీ పెదవులు పేలవంగా కనిపిస్తున్నాయా? ఇదిగో పరిష్కారం